లక్కున్నోడు
స్వరూపం
లక్కున్నోడు | |
---|---|
దర్శకత్వం | రాజ్‌కిరణ్ |
రచన | రాజ్‌కిరణ్ (కథ) డైమండ్ రత్నబాబు (మాటలు) |
స్క్రీన్ ప్లే | డైమండ్ రత్నబాబు |
కథ | రాజ్‌కిరణ్ |
నిర్మాత | ఎం.వి.వి.సత్యనారాయణ |
తారాగణం | మంచు విష్ణు హన్సికా మోట్వాని |
ఛాయాగ్రహణం | పి.జి. వింద |
సంగీతం | అచ్చు, ప్రవీణ్ లక్కరాజు |
నిర్మాణ సంస్థ | ఎం.వి.వి.సినిమా |
పంపిణీదార్లు | లైకా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 జనవరి 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లక్కున్నోడు 2017లో విడుదలైన తెలుగు సినిమా.
కథ
[మార్చు]లక్కీ (మంచు విష్ణు) దురదృష్టవంతుడు. అతని దురదృష్టం కారణంగా అతని తండ్రి కూడా లక్కీతో మాట్లాడడు. అలాంటి లక్కీ ఓ రోజు పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి ప్రతి విషయాన్ని మంచి కోణంలోనే ఆలోచించే మనస్తత్వం గల అమ్మాయి. కథ ఇలా సాగుతుండగా లక్కీ తన చెల్లి పెళ్ళి కోసం తీసుకెళ్తున్న డబ్బు సంచి ఎక్కడో పోతుంది. ఆ సంచిలో పాతిక లక్షల రూపాయలు ఉంటాయి. ఏం చేయాలో తెలియక లక్కీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంతో ఓ వ్యక్తి లక్కీకి ఓ సంచి ఇచ్చి దాన్ని ఓ రోజు జాగ్రత్తగా దాస్తే కోటి రూపాయలిస్తానని చెబుతాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ సంచిలో ఏముంటుంది? లక్కీకి కోటి రూపాయలు వచ్చిందా? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.[1]
తారాగణం
[మార్చు]- మంచు విష్ణు[2]
- హన్సికా మోట్వాని
- తనికెళ్ళ భరణి
- వెన్నెల కిశోర్
- పోసాని కృష్ణమురళి
- ప్రభాస్ శ్రీను
- సత్యంరాజేష్
- జయప్రకాష్
పాటల జాబితా
[మార్చు]- రావేరా , రచన: కృష్ణకాంత్, గానం.లీప్సికా, రేవంత్
- ఐసాలాగా , రచన: పల్లవి గీత పూట్నిక్ , శ్రీజో, గానం.మోహన భోగరాజు, సింహా, ప్రవీణ్ లక్కరాజు
- వాట్ డాఫ్, రచన: శ్రీజో, గానం. అధనాన్ సామి, ప్రవీణ్ లక్కరాజు
- ఓ సిరిమల్లె , గానం.బప్పిలహరి , అనురాగ్ కులకర్ణి .
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాణ సంస్థ:ఎం.వి.వి.సినిమా
- సంగీతం: అచ్చు, ప్రవీణ్ లక్కరాజు
- కళ: చిన్నా
- సినిమాటోగ్రఫీ: పి.జి. వింద
- స్క్రీన్‌ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్
- నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
- కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-01-28. Retrieved 2017-02-03.
- ↑ సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.