Jump to content

లక్కీ భాస్కర్

వికీపీడియా నుండి
లక్కీ భాస్కర్
దర్శకత్వంవెంకీ అట్లూరి
రచనవెంకీ అట్లూరి
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
సాయి సౌజన్య
తారాగణందుల్కర్ సల్మాన్
మీనాక్షి చౌదరి
అయేషా ఖాన్
హైపర్ ఆది
సాయి కుమార్
ఛాయాగ్రహణంనిమిష్ రవి
కూర్పునవీన్ నూలి
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీs
31 అక్టోబరు 2024 (2024-10-31)(థియేటర్)
28 నవంబరు 2024 (2024-11-28)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
సినిమా నిడివి
151 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్100 కోట్లు[1]

లక్కీ భాస్కర్ 2024లో విడుదలైన సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 11న,[2] ట్రైలర్‌ను అక్టోబర్‌ 21న విడుదల చేసి, సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది.[3][4]

ఈ సినిమా రూ.30 కోట్లతో నిర్మించగా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా నిలిచి నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[5][6]

భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) మగధ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. తమ్ముడు, చెల్లి, నాన్న, భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకుతో కలిసి ఉంటూ చాలీ చాలని జీతంతో, అప్పులతో జీవితం గడుపుతుంటాడు. బ్యాంక్‌లో ఎంత కష్టపడినా ప్రశంసలు వస్తాయి తప్ప ప్రమోషన్ రాదు. దాంతో తీవ్ర నిరుత్సాహం మరోవైపు కుటుంబ భారం మోయలేక నిస్సహాయతతో ఉన్న స్థితిలో భాస్కర్‌‌కు ఆంటోని (రాంకీ) ద్వారా ఓ ఆట (స్మగ్ల్డ్ గూడ్స్) అలవాటు పడుతుంది. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అక్కడితో ఆగని భాస్కర్ హర్షద్ మెహతా బ్యాంక్ స్కాములో భాగం అవుతుంటాడు. మగధ బ్యాంక్‌లో ఆ జరిగిన స్కామ్‌ విచారణలో భాగంగా సాధారణ బ్యాంక్ ఉద్యోగి భాస్కర్‌ వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ చూసి అధికారులు షాక్‌ అవుతారు. మగధ బ్యాంక్‌లో జరిగిన స్కామ్‌ ఏంటి ? చివరికి స్కామ్‌ నుంచి భాస్కర్‌ గట్టెక్కాడా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌
  • నిర్మాత: సూర్యదేవర నాగవంశీ,[12] సాయి సౌజన్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
  • సంగీతం: జి. వి. ప్రకాష్
  • సినిమాటోగ్రఫీ:నిమిష్ రవి
  • ఎడిటర్: నవీన్ నూలి
  • ఆర్ట్ డైరెక్టర్: బంగ్లాన్

మూలాలు

[మార్చు]
  1. "Lucky Baskhar: Release date, budget, cast and everything you need to know about Dulquer Salmaan's film". Desimartini. 22 October 2024.
  2. 10TV Telugu (11 April 2024). "దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీజర్ రిలీజ్." (in Telugu). Retrieved 12 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "'లక్కీ భాస్కర్' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్". 11 October 2024. Retrieved 12 October 2024.
  4. The Times of India (20 August 2024). "Official: Dulquer Salmaan's 'Lucky Bhaskar' will now be released on October 31". Retrieved 12 October 2024.
  5. TV9 Telugu (28 November 2024). "ఓటీటీలోకి వచ్చేసిన లక్కీ భాస్కర్.. ఎక్కడ చూడొచ్చంటే". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (28 November 2024). "ఓటీటీలోకి 'లక్కీ భాస్కర్‌'.. డేట్‌ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్‌". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
  7. Zee News Telugu (30 October 2024). "కామన్ మ్యాన్ గా ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్.. ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా..!". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
  8. Sakshi (4 February 2024). "'లక్కీ భాస్కర్‌'తో దుల్కర్‌ అసాధారణమైన ప్రయాణం". Retrieved 12 October 2024.
  9. 10TV Telugu (15 September 2023). "మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి..?" (in Telugu). Retrieved 12 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  10. Chitrajyothy (4 November 2024). "తెలుగు భాషతోనే అది సాధ్యం.. ఆనందంలో దుల్కర్‌". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  11. 11.0 11.1 Chitrajyothy (7 November 2024). "'లక్కీ భాస్కర్'కు 'సిరివెన్నెల' బెనర్జీ, రాంకీల‌ను అందుకే తీసుకున్నాం". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  12. Prajasakti (11 October 2024). "30 నుంచి 'లక్కీ భాస్కర్' ప్రీమియర్ షోలు : నిర్మాత సూర్యదేవర నాగవంశీ". Retrieved 12 October 2024.

బయటి లింకులు

[మార్చు]