Jump to content

లక్కరాజు నిర్మల

వికీపీడియా నుండి
లక్కరాజు నిర్మల

లక్కరాజు నిర్మల కవయిత్రి, ఆత్మీయ మానసిక వికాస కేంద్ర స్థాపకురాలు.[1] ఈమె "ఆత్మీయ నిర్మల"గా సుపరిచితురాలు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమెకు కాలిఫోర్నియా వర్శిటీకి అనుబంధంగా ఉన్నథియోలాజికల్ రీసెర్చి యూనివర్శిటీ వారు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసారు.సాహిత్య, సామాజిక సేవల్లో అనుభవానికి గాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.[2]

సాహితీ సేవలు

[మార్చు]

కవిత్వంలో భావకవిత్వం ఉన్నట్లే భక్తికవిత్వం కూడా ఇటీవల కాలంలో అనేక మంది కవులు పాటల రూపంలోనో, వ్యాసాల రూపంలోనో లేక వచన, పద్య రూపాలలోనూ కనిపిస్తూనే ఉన్నాయి. లక్కరాజు నిర్మల స్వతహాగా సేవాదృక్పథం కలిగిన వ్యక్తి. అందుకే వీరిలో ఇంతటి అరుదైన భక్తికవిత్వం రూపుదిద్దుకుంది.ఆమె "ఆత్మనివేదన -కవితా సంపుటి"ని వ్రాసారు.[3] ఆమె "నిర్మల సూక్తులు", "ఎన్ని'కలలో'", "సంఘర్షణ", "ఆత్మ నివేదన", "ప్రఫుల్లోక్తి" వంతి కవితా సంపుటులను వ్రాసారు.అక్షరమాల అనే పిల్లల కథల పుస్తకాన్ని కూడా వ్రాసారు.[4]

అవార్డులు

[మార్చు]

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు మహిళాభ్యుదయం'విభాగంలో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.[5]

ఆత్మీయ మానసిక వికాస కేంద్రం

[మార్చు]

ఈ సంస్థ లక్కరాజు నిర్మల గారిచే స్థాపించబడింది. దానికి ప్రస్తుతం ఆమె వ్యవస్థాపక సెక్రటరీగా యున్నారు. ఈ కేంద్రం హైదరాబాదు లోని తార్నాకాలో ఉంది. ఈ పాఠశాల 1992-93 లో నలుగురు విద్యార్థులతో ప్రారంభించారు. ఇచట 120 మంది మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్నారు.వారికి ఈ సంస్థ మంచి విద్య, ఆరోగ్య రక్షణ, అనేక అవసరాలను తీర్చి వారిని ఆనందగా ఉంచేందుకు కృషిచేస్తున్నది. ఈ సంస్థలో అనాథలు, వికలాంగులు, బధిరులు మొదలగు విద్యార్థులున్నారు. వీరిలో 70 శాతం మంది అనాథలే. వారికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు ఒక మిని బస్ అందజేసారు. ఈ కేంద్రంలో ప్రతి విద్యార్థికి యోగా, ధ్యానం చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Aathmeeya Manasika Vikasa Kenduram, Andhra Pradesh - Secunderabad". Archived from the original on 2015-04-20. Retrieved 2015-07-02.
  2. లక్కరాజు నిర్మలకు గౌరవ డాక్టరేట్[permanent dead link]
  3. భక్తితత్వానికి దర్పణం ఆత్మ ని‘వేదనం’[permanent dead link]
  4. నిర్మల ఫోటో గ్యాలరీ[permanent dead link]
  5. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
  6. "లక్కరాజు నిర్మల ఇంటర్వ్యూ". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-03.

ఇతర లింకులు

[మార్చు]