Jump to content

లకుముకి పిట్ట

వికీపీడియా నుండి
లకుముకి పిట్ట

లకుముకి పిట్టలు, వీటికి వీటికి పెద్ద తలలు, పొడవాటి, సూదివంటి ముక్కులు, పొట్టి కాళ్ళు, పొట్టిగా మందంగా ఉన్నతోకలతో ఉంటాయి. చాలా జాతి పక్షులు ఉష్ణమండలాలలో కొన్ని అడవులలో నివసిస్తుంటాయి ఇవి చేపలను వేటాడి తింటాయి.కొన్ని చెట్లమీద ఉండే చిన్న బల్లుల వంటివాటిని కూడా తింటుంటాయి.ఇవి గూళ్ళను కొండలలోని బెజ్జాలలో కట్టుకుంటాయి.చాలా జాతువులు లింగాల మధ్య చిన్న తేడాలు మాత్రమే కలిగివుంటాయి.[1]దీనిని "టిట్టిభం" అని మరోపేరుతో కూడా వ్యవహరిస్తారు

నివాసం

[మార్చు]

ఇవి ఎక్కువుగా చేపలు లభించే ప్రాంతాలలో నివసిస్తాయి.[2] చాలా జాతులు ఆఫ్రికా, ఆసియా, ఓషియానియాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి.అతి తక్కువ జాతుల పక్షులు మాత్రమే అడవులలో కనిపిస్తాయి.[1]

ఆహారం సంపాదన

[మార్చు]

ఇవి సాధారణంగా నదుల సమీపంలో సంచరిస్తూ ఆహారాన్ని పసిగట్టి, శరవేగంగా క్రిందికి దూసుకెళ్లడం ద్వారా పట్టుబడిన అనేక రకాల ఆహారాన్ని సంపాదించుకుంటాయి.కొన్ని కింగ్ ఫిషర్లు సాధారణంగా నదుల దగ్గర నివసించి చేపలను తింటాయి. అయితే అనేక జాతులు నీటికి దూరంగా నివసించి వెన్నుముక లేని క్రిమి కాటకాలను చిన్న అకశేరుకాలును తింటాయి.ఇవి మిగతా జాతులకు చెందినవాటిమాదిరిగానే,చెట్టుతొర్రలలో, రంధ్రంలలో,గుహలలో (కావిటీస్‌) లో గూడు కట్టుకుంటాయి.సాధారణంగా సొరంగాలు భూమిలోని సహజ లేదా కృత్రిమంగా ఏర్పడిన తొర్రలలో ఏర్పాటు చేసుకుంటాయి.

శాస్త్రం

[మార్చు]

లకుముకిపిట్ట ఎడమవైపు నుండి వారిదగ్గరకు రావడం జరిగితే వార్కి మంచి అదృష్టం జరిగిందనే ఒక నమ్మకం ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "లకుముకి పిట్టలు | పక్షుల ప్రపంచం-శాస్త్రీయ విశ్లేషణ". సిరిమల్లె. 2019-01-21. Retrieved 2020-07-10.
  2. "లకుముకి పిట్టలు | పక్షుల ప్రపంచం-శాస్త్రీయ విశ్లేషణ". సిరిమల్లె. 2019-01-21. Retrieved 2020-07-10.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-13. Retrieved 2020-07-10.

వెలుపలి లంకెలు

[మార్చు]