Jump to content

రోష్ని వాలియా

వికీపీడియా నుండి
రోష్ని వాలియా
జననం (2001-09-20) 2001 సెప్టెంబరు 20 (వయసు 23)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్
తారా ఫ్రమ్ సతారా
వెబ్‌సైటు[1]

రోష్ని వాలియా (జననం 2001 సెప్టెంబర్ 20) భారతీయ నటి.[1] చిన్నతనంలోనే టెలివిజన్ ప్రకటనలతో తన వృత్తిని ప్రారంభించిన ఆమె మై ఫ్రెండ్ గణేశ యానిమేషన్ చిత్రంలోనూ నటించింది.[2] లైఫ్ ఓకేలో డిసెంబర్ 2011 నుండి అక్టోబర్ 2012 వరకు ప్రసారమైన టెలివిజన్ షో మెయిన్ లక్ష్మీ తేరే ఆంగన్ కి(मैं लक्ष्मी तेरे आंगन की)లో బాలనటిగా ఆలరించింది.[3] ఆమె బాలికా వధు (2013), భరత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్‌లో మహారాణి అజబ్డేగా[4], సోనీ టీవీలో తారా ఫ్రమ్ సతారాలో తారా మానేగా నటించి ఆమె ప్రసిద్ది చెందింది.[5]

బాల్యం

[మార్చు]

ఆమె 2001 సెప్టెంబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించింది.[6][7] ఆమె తల్లి స్వీటీ వాలియా, అక్క నూర్ వాలియాలతో కలసి తాను ముంబైలో నివసిస్తోంది.[8][9] ఆమె తాత సైనిక అధికారి.[10]

కెరీర్

[మార్చు]

ఆమె తన కెరీర్‌ని టెలివిజన్ ప్రకటనలతో ప్రారంభించింది. ఆ తర్వాత, లైఫ్ ఓకే డ్రామా సిరీస్ మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీలో నటించింది, అందులో ఆమె జియానా పాత్రను పోషించింది. తరువాత, లైఫ్ ఓకే మరొక డ్రామా సిరీస్ రింగా రింగా రోజెస్‌లో నటించింది, ఇందులో ఆమె సమీర్ సోని పాత్రకు కుమార్తెగా నటించింది.[11]

2014లో, భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్‌లో మహారాణా ప్రతాప్ మొదటి భార్య అయిన యువ మహారాణి అజబ్దే పున్వర్ పాత్రను ఆమె పోషించింది.[12][13] దీంతో ఆమె 13వ ఇండియన్ టెలీ అవార్డ్స్ 2014లో ఉత్తమ బాలనటి - ఫిమేల్‌ గా ఎంపికైంది.[14][15] డిసెంబర్ 2014లో, ఆమె యూత్ క్రైమ్ డ్రామా సిరీస్ గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ మూడవ సీజన్‌లో నటించింది. ఈ కార్యక్రమం ఛానల్ V ఇండియాలో ప్రసారమైంది, ఇందులో ఆమె ఆరోహి పాత్రను పోషించింది.

2015లో, జీ టీవీ యే వాద రహాలో సుర్వి పాత్రను ఆమె పోషించింది.[16] 2019లో, ఆమె సోనీ టీవీలో తారా ఫ్రమ్ సతారాలో తారా మనే పాత్రను పోషించింది.[17]

మూలాలు

[మార్చు]
  1. "వాలు కనుల వాలియా." web.archive.org. 2023-07-30. Archived from the original on 2023-07-30. Retrieved 2023-07-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Tara from Satara's Roshni Walia gifts herself a car on her birthday". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 November 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Popular child actors who are now all grown up: Check out what are they up to these days". timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 13 August 2021.
  4. "Maharana Pratap actress Roshni Walia - Remember these famous child actors?". The Times of India. Retrieved 13 August 2021.{{cite news}}: CS1 maint: url-status (link)
  5. "Roshni Walia opts for a no-makeup look in Tara from Satara - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2021.
  6. "'Yeh Vaada Raha' best B-day gift from god: Roshni Walia". Zee News. 9 September 2015. Retrieved 18 September 2015.
  7. "'Yeh Vaada Raha' best B-day gift from god: Roshni Walia". The Indian Express. 9 September 2015. Retrieved 18 September 2015.
  8. "Roshini Walia in Deeparaj's next". The Times of India. Retrieved 18 September 2015.
  9. "Raksha Bandhan Special: 'Maharana Pratap' fame Roshni Walia and her sister tie rakhi to each other". Daily Bhaskar. 27 August 2015. Retrieved 18 September 2015.
  10. "Young girls in big roles". Deccan Chronicle. 15 June 2014. Retrieved 18 September 2015.
  11. "Roshni Walia to play Samir Soni's daughter!". Daily Bhaskar. Retrieved 18 September 2015.
  12. "Young girls in big roles". Deccan Chronicle. 15 June 2014. Retrieved 18 September 2015.
  13. Tiwari, Vijaya. "Jannat Zubair & Roshani Walia in Maharana Pratap". The Times of India. Retrieved 18 September 2015.
  14. "Indian Telly Awards 2014 - Popular". Archived from the original on 26 June 2015. Retrieved 18 September 2015.
  15. "Indian Telly Awards 2014 - Nominees". Archived from the original on 14 September 2015. Retrieved 18 September 2015.
  16. "ZEE TV to jig schedule for 'Yeh Vaada Raha' launch". Archived from the original on 30 September 2015. Retrieved 18 September 2015.
  17. Trivedi, Tanvi. "Tara From Satara to wrap up in five weeks - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 December 2021.