రొద్దం రాజారావు
రొద్దం రాజారావు | |
---|---|
జననం | 1901 |
మరణం | 1950 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు |
రొద్దం రాజారావు (1901 - 1950) ప్రముఖ రంగస్థల నటుడు.[1]
జననం
[మార్చు]1901 లో హిందూపురం లో జన్మించాడు.
విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]పెనుగొండలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన రాజారావు, బెంగుళూరు, అనంతపురంలలో కళాశాల విద్యను చదివాడు. కొంతకాలం పెనుగొండలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసి, చెన్నపట్నం, తిరువనంతపురంలో చదివి న్యాయశాస్త్ర పట్టా పొందాడు. 1927లో పెనుగొండలో తండ్రితో కలిసి న్యాయవాదిగా పనిచేశాడు. ఆ తరువాత హిందూపురంలో స్థిరనివాసమేర్పరచుకొని న్యాయవాదిగా పనిచేశాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]1940లో హిందూపురం లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు నాటకోత్సవాలు నిర్వహించాడు. 1946లో ఏలూరులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు సభలకు అధ్యక్షత వహించాడు. హిందూపురంలో రాయలసీమ కళా పరిషత్తు స్థాపించి గడియారం వేంకట శేషశాస్త్రి, రాజశేఖర శతావధాని వంటి పండితకవులనెందరినో సత్కరించాడు.
నటించిన పాత్రలు
[మార్చు]- పఠాన్ రుస్తుం
- సత్యవంతుడు
- భరతుడు
- నలుడు
- అర్జునుడు
- శ్రీకృష్ణదేవరాయలు
- రాజసింహుడు
- రాణాప్రతాప్
- సారంగధరుడు
- పృథ్వీ రాజ్
- చంద్రగుప్తుడు
మరణం
[మార్చు]నాటకరంగ అభివృద్ధి కోసం విశేష కృషిచేసిన రాజారావు 1950 లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.504.