Jump to content

రైతుభారతం

వికీపీడియా నుండి
రైతుభారతం
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం త్రిపురవేణి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ సాయి శ్రీ మూవీస్
భాష తెలుగు

రైతు భారతం 1994 మార్చి 2 న విడుదలైన తెలుగు చలన చిత్రం. సాయిశ్రీ మూవీస్ బ్యానర్ కింద త్రిపురనేని మహారథి నిర్మించిన ఈ సినిమాకు త్రుపురనేని శ్రీప్రసాద్ దర్శకత్వం వహించాడు. టి. రాఘవయ్య చౌదరి సమర్పించిన ఈ సినిమాకు సాలూరి వాసూరావు సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా రైతు తన పరిస్థితిని తానే చక్కదిద్దుకోవాలన్న రీతిలో తీసినది.

విశేషాలు

[మార్చు]

మొదట కృష్ణ, కృష్ణంరాజు, భానుచందర్ కాంబినేషన్ లో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. రైతు ప్రతినిధిగా కృష్ణ, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కృష్ణంరాజు, యాక్షన్ హీరోగా భానుచందర్ అనుకున్నారు. సినిమా ప్రారంభమయ్యాక సినిమా పరిశ్రమలో సమ్మె, తర్వాత కొంత విరామం కారణంగా రెండేళ్లు సినిమా ఆగింది. తర్వాత ఈ సినిమా కథలో మార్పు చేసి, కృష్ణంరాజు పాత్ర తొలగించారు. కృష్ణ , భానుచందర్ అన్నదమ్ములుగా, తులసి చెల్లెలుగా కథ లో మార్పులు చేశారు. రైతు శ్రమను దోచుకునే వ్యవస్థపై తిరుగుబాటు చేసే రైతు ప్రతినిధిగా కృష్ణ పాత్ర నడుస్తుంది. ఆనాటి ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన డంకెల్ ప్రతిపాదనల ను వ్యతిరేకించడం ఈ మూవీ స్పెషల్. సౌందర్యకు ఇది తొలిసినిమా కావడం విశేషం. [2]

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Raithu Bharatham (1994)". Indiancine.ma. Retrieved 2021-04-26.
  2. "రైతు భారతం సినిమా గురించి ఎవరికి తెలియని నిజాలు...అసలు నమ్మలేరు". Chai Pakodi (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-28. Retrieved 2021-04-26.

బాహ్య లంకెలు

[మార్చు]