రేణుకా చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమతి రేణుకా చౌదరి
రేణుకా చౌదరి


పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
29 జనవరి, 2006 - 2009
తరువాత నామ నాగేశ్వరరావు
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-13) 1954 ఆగస్టు 13 (వయసు 70)
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఎస్.చౌదరి
సంతానం ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాదు
మతం హిందూ
మే 1, 2008నాటికి

రేణుకా చౌదరి మాజీ భారత పార్లమెంటు సభ్యురాలు, మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రేణుక బెంగుళూరు లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పారిశ్రామిక మానసికశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందింది. రేణుకా చౌదరి 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచింది. ఈమె 1986 నుండి 1998 వరకు రెండు సార్లు టీడీపీ నుండి రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసి హెచ్.డి.దేవగౌడ మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.[3]

ఆమె 1998లో భారత జాతీయ కాంగ్రెసులో చేరి 1999, 2004 లోక్‌సభ ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.[1] 2009 ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయింది.[4]

ఆమెను 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Renuka Chowdhury's profile at the Lok Sabha website". Archived from the original on 2009-06-15. Retrieved 2008-08-01.
  2. EENADU (2 May 2024). "అభ్యర్థుల్లో వాటా 3 శాతమే". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
  3. The News Qube (21 November 2020). "కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన రాజకీయ నేతలు వీరే !! | The News Qube". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  5. Hindustantimes Telugu (14 February 2024). "కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  6. Eenadu (14 February 2024). "తెలంగాణ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు వీరే". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  7. EENADU (3 May 2024). "ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.