Jump to content

రేణుకాదాస్ భాలేరావు

వికీపీడియా నుండి
రాజా రాయ్ రాయన్
దియానత్వంత్
మాదర్-ఉల్-మహమ్ (సామ్రాజ్యపు అధిపతి)
రేణుకాదాస్ భాలేరావు
షామ్‌ రాజ్ బహదూర్
కత్తిని ధరించిన మొదటి రేణుకాదాస్ షామ్ రాజ్
హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి
In office
1795–1797[1]
చక్రవర్తిసికందర్ ఝా
అంతకు ముందు వారుఅరస్తు ఝా
తరువాత వారుఅరస్తు ఝా
వ్యక్తిగత వివరాలు
జననం
రేణుకాదాస్ భాలేరావు

(1765-07-01)1765 జూలై 1
హైదరాబాదు, హైదరాబాదు రాజ్యం (ప్రస్తుతకాలపు తెలంగాణ, భారతదేశం)
మరణం1822 మే 28(1822-05-28) (వయసు 56)
హైదరాబాదు, హైదరాబాదు రాజ్యం (ప్రస్తుతకాలపు తెలంగాణ, భారతదేశం)
సంతానం
  • కిషన్ రావు
  • భవానీశంకర్ రావు[2]
తండ్రిరాజా ధోందోజీ పంత్
Military service
Battles/warsరెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం
శ్రీరంగపట్నం ముట్టడి
నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధం

రేణుకాదాస్ భాలేరావుగా జన్మించిన మొదటి షామ్ రాజ్[note 1] (1 జూన్ 1765 – 28 మే 1822),[3] రాజా షామ్ రాజ్ రాయ్ రాయన్గా ప్రసిద్ధి చెందాడు. ఈయన సైనికాధికారి, రాజనీతిజ్ఞుడు, భారతీయ ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. హైదరాబాదు రాజ్యపు దీవానుగా పనిచేశాడు.[1] ఈయన రాజా షాన్ రాయ్ రాయన్ రేణుకాదాస్గా కూడా వ్యవహరించబడ్డాడు.[4]

రాజా కృష్ణాజీ పంత్ వంశంలో హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రేణుకాదాస్ నిజాం యొక్క పోషణలో చదువు పూర్తిచేశాడు. ఈయన నిజాం యొక్క బాల్య స్నేహితుడు. జీవితాంతం నిజాంకు విశ్వసపాత్రుడిగా ఉన్నాడు. 1785లో "దియానత్వంత్" బిరుదాన్ని పొంది, దానితో పాటు ఒక మన్సబును, రెండు వేల ఆశ్వదళాన్ని, ఆభరణాలను బహుమానంగా పొందాడు.[5] 1786లో ఈయన పేష్కరు (ఉపమంత్రి) పదవిని అధీష్టించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అరస్తు ఝా పూణేలో బందీగా ఉన్న కాలంలో నిజాం, రాజా షాన్ రాయ్ రాయన్‌ను దీవానుగా (ప్రధానమంత్రి)గా నియమించాడు.[2]

ఆరంభ జీవితం

[మార్చు]

రేణుకాదాస్ 1765, జూన్ 1న హైదరాబాదులో జన్మించాడు. ఈయన తండ్రి రాజా ధొందోజీ పంత్ (ఈయన్నే రాజా ధుందిరాజ్ పంత్ అని కూడా పిలుస్తారు). రేణుకాదాస్, దేవగిరి వతన్‌దార్, మొఘల్ చక్రవర్తి షాజహాన్కు సన్నిహిత సహాయకుడైన కృష్ణాజీ పంత్‌కు యొక్క వంశజుడు.[6] రేణుకాదాస్ ముత్తాత, రాయ్ నరో పంత్, మొదటి అసఫ్‌జాతో పాటు ఢిల్లీనుండి హైదరాబాదుకు వలస వచ్చాడు. రాయ్ నరో పంత్ అన్న, రాయ్ మోరో పంత్ నిజాముల్ ముల్క్ పాలనాకాలంలో మొదటి పేష్కరుగా పనిచేశాడు. 1750లో అన్న మరణం తర్వాత, రాయ్ నరో పంత్ రెండో పేష్కరుగా (ఉపమంత్రి) పనిచేశాడు. రేణుకాదాస్ భాలేరావు తండ్రి, ధొందోజీ పంత్, రాయ్ నరో పంత్ యొక్క పెద్దకొడుకు, సికిందర్ జా పాలనాకాలంలో మూడవ పేష్కరుగా పనిచేశాడు.[7] వీరు హిందూ దేశస్థ ఋగ్వేద బ్రాహ్మణులు.[8][9] ఈయన కుటుంబం నిజాముల్ ముల్క్, మొదటి అసఫ్‌జా కాలంలో దక్కన్ హైదరాబాదులో దఫ్తరే దివానీ (విత్తమంత్రిత్వ శాఖ)ను స్థాపించారు.[10] ఆ తర్వాత కాలంలో 1933 నుండి 1948 వరకు నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడైన రెండవ రాజా షామ్ రాజ్, రేణుకాదాస్ భాలేరావు యొక్క మునిమనవడు. ఈ కుటుంబం హైదరాబాదులో రాయ్ రాయన్ కుటుంబంగా ప్రసిద్ధిచెందింది.[9] రాయ్ రాయన్ కుటుంబపు ఆధీనంలో 5000 నుండి 7000 వరకు జాఠ్ మున్సబులు, సాలీనా 48,000 రూపాయల ఆదాయం వచ్చే జాగీర్లు ఉండేవి. మెదటి రాజా షామ్ రాజ్ కాలంలో 478,552 రూపాయలు ఆదాయం వచ్చే ఫౌజ్ జాగీరుకూడా ఉండేది.[11]

రేణుకాదాస్ యుద్ధ విద్యలలో నిష్ణాతుడైనాడు. ఆయన హిందువైనందువలన సంస్కృతం కూడా అధ్యయనం చేశాడు. వంశపారంపర్యంగా సంక్రమించిన నిజాం కోశాగారపు బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడానికి అకౌంటింగును నేర్చుకున్నాడు.[5] రచయిత, మాజీ హైదరాబాదు నగర మేయరు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ప్రకారం రేణుకాదాస్ భాలేరావు, 1783 డిసెంబరు 5న వంశపారంపర్య బాధ్యతలు తండ్రినుండి స్వీకరించాడు.[5]

వృత్తి జీవితం

[మార్చు]
హైదరాబాదులోని చంద్రభవన్ ప్యాలెస్ (రాయ్ రాయన్ దేవిడి)ని 1757లో రాయ్ రాయన్ పాలకుల అధికారపీఠంగా నిర్మించారు.

రాయ్ రాయన్ కుటుంబం హైదరాబాదు రాజ్యంలో దఫ్తరే దివానీ (విత్తమంత్రిత్వ శాఖ)ని స్థాపించి, హైదరాబాదు రాజ్యంలో అర్ధభాగమైన పశ్చిమ సుబాలకు వారసత్వ దఫ్తరుదారులుగా పనిచేశారు. 1783 ఫిబ్రవరిలో రాజా ధొందోజీ పంత్ మరణించిన తర్వాత, ఈయన పశ్చిమ సుబాలైన కర్నాటకం, బీదరు, ఔరంగాబాదు, ఖాందేశ్ సుబాలయొక్క దఫ్తరుదారీ, ఆయన పెద్ద కొడుకైన రాయ్ ఒమకాంత్ రావుకు బదిలీ అయ్యింది. రాయ్ ఒమకాంత్ రావు తన తండ్రి చనిపోయిన సంవత్సరమే, 1783 ఆగష్టులో మరణించాడు.[7][9] అన్న ఒమకాంత్ రావు మరణించిన తర్వాత, రేణుకాదాస్ భాలేరావుకు తండ్రి యొక్క వారసత్వ హక్కులు సంక్రమించాయి. రచయిత కె.కె.ముదిరాజ్ ప్రకారం, భాలేరావుకు వారస్వత హక్కులతో పాటు రాజా రాయన్ అనే బిరుదు 1783, డిసెంబరు 5న సంక్రమించాయి.[5] కె.కె.ముదిరాజ్ ఈ విధంగా అన్నాడు, "1784లో, నాలుగు పశ్చిమ సుబాలతోపాటు ఆయనకు మెదక్, గుల్బర్గా, నాందేడ్ పరగణాల్లో దక్కన్ శివారు ప్రాంతాలపై, మాష్, సర్దేశ్‌పంత్‌గిరి, పర్తాబ్‌పూర్‌తో పాటు అనేక ఇతర జాగీర్ల సర్దేశ్‌ముఖీ హక్కులు పొందాడు".[12] 1786లో ఈయన పేష్కరుగా నియమించబడ్దాడు.[2]

మైసూరుకు చెందిన హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ లపై, మరాఠాలు, బ్రిటీషువారు చేసిన రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం, మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధంలలో రేణుకాదాస్ భాలేరావు కీలకపాత్ర వహించాడు. 1791–92లలో, షామ్ రాజ్ శ్రీరంగపట్నం ముట్టడిలో నిజాం అలీఖాన్ సేనలకు నేతృత్వం వహించాడు.[13] రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం, మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం, శ్రీరంగపట్నం ముట్టడిలో భాలేరావు ప్రభావం గురించి రచయిత ఎం.వి.శివప్రసాద్ రావు ఈ విధంగా అన్నాడు. "1781లో టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా హైదరాబాదు నిజాం తరఫున భాలేరావు అత్యంత ప్రముఖ పాత్ర వహించాడు. ఈయన లేఖల్లో, 1792 శ్రీరంగపట్నం సంధి ఒప్పందంలో ఉన్న బాధ్యతలను పూర్తిచేసేందుకు మైసూరు పాలకులకు ఒత్తిడి చేసేందుకు, మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం తర్వాత టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కొడుకలను బందీలుగా తీసుకున్న వృత్తాంతం ఉన్నది".[14]

1792లో టిప్పు సుల్తాన్ పై విజయం సాధించిన తర్వాత భాలేరావుకు "రాజా షామ్ రాజ్" అనే బిరుదుతో పాటు, ఆయన యుద్ధ సేవలను సన్మానించేందుకు అనేక ఇతర గౌరవమర్యాదలు కూడా పొందాడు.[4]

ఆ తర్వాత కాలంలో అరస్తు ఝా, పూణేలో మరాఠాల బందీగా ఉన్న కాలంలో నిజాం భాలేరావును తన దీవాను (ప్రధానమంత్రిగా) ఉండమని కోరాడు. భాలేరావు 1795 నుండి 1797 వరకు ఆ పదవిని నిర్వహించి, అరస్తు ఝా తిరిగి వచ్చిన తర్వాత దిగిపోయాడు.[1]

బిరుదులు

[మార్చు]

క్రమబద్ధంగా రేణుకాదాస్ భాలేరావు పొందిన వివిధ బిరుదులు:[15][16]

  • 1765-1780 - రాజకుమార్ రేణుకా దాస్ ధూండిరాజ్ భాలేరావు
  • 1780-1783 - రాయ్ రేణుకా దాస్ ధూండిరాజ్ భాలేరావు
  • 1783-1785 - రాయ్ రాయన్ రేణుకా దాస్ ధూండిరాజ్ భాలేరావు
  • 1785-1786 - రాయ్ రాయన్ దియానత్వంత్ రేణుకా దాస్ ధూండిరాజ్ భాలేరావు
  • 1786-1795 - రాజా రాయ్ రాయన్ దియానత్వంత్ షామ్ రాజ్ రేణుకా దాస్ ధూండిరాజ్ భాలేరావు
  • 1795-1822 - మెహెర్బాన్ మదరుల్ మహం రాజా రాయ్ రాయన్ దియానత్వంత్ షామ్ రాజ్ రేణుకా దాస్ ధూండిరాజ్ భాలేరావు బహదూర్

మత దైవిక ధృక్పధం

[మార్చు]

మత, దైవిక అంశాలకు షామ్ రాజ్ తన జీవితాంతం చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. జీవితకాలంలో అనేక హిందు పుణ్యక్షేత్రాలకు తీర్ధయాత్రలు చేశాడు. రచయిత కె.కె.ముదిరాజ్ ఈ విధంగా అన్నాడు "రాజా షామ్ రాజ్ దైవిక చింతనతో తన బిరుదులన్నీ పక్కనపెట్టి, రామేశ్వరం వెళ్ళి అక్కడ ఆరు సంవత్సరాల పాటు నివసించాడు.".[12]

సూచనలు

[మార్చు]
  1. ఈయన మనవడు కూడా అదే పేరుతో, రాజా షామ్ రాజ్‌గా ప్రసిద్ధి చెందడంవలన, అయోమయనివృత్తి నిమిత్తం ఈయనను మొదటి షామ్‌ రాజ్‌గా వ్యవహరిస్తున్నారు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Luther 2006, p. 191.
  2. 2.0 2.1 2.2 Ekbote 1954, p. 19.
  3. Mallavarapu Venkata Siva Prasada Rau (1980). Archival Organization and Records Management in the State of Andhra Pradesh, India: An archival analysis and description of the public documents in the Andhra Pradesh State Archives. Government of Andhra Pradesh by the Director of State Archives (Andhra Pradesh State Archives). p. 33. One of the sons and successors of Dhondaji Pant by name Renukadas, received the title of Rai Rayan in 1783, of Diyanatwanth in 1785, and a little later, of Raja Shamraj.
  4. 4.0 4.1 Ekbote 1954, p. 28.
  5. 5.0 5.1 5.2 5.3 Mudiraj 1934, p. 218.
  6. Brief History of Andhra Pradesh. State Archives, Government of Andhra Pradesh. 1972. p. 57. A Maharashtrian family which was given the title of Rai Rayan appears to have been the first to receive the designation . The founder of the family was Krishnaji Pant, a Watandar of Devagiri (Daulatabad), who was patronised by Shah Jehan.
  7. 7.0 7.1 Mudiraj 1934, p. 217.
  8. Proceedings of the ... Session, Volume 38. Indian Historical Records Commission, The Commission. 1967. p. 109. Krishnajipant (1608–1688), the known ancestor of the Rai Rayan family, was a Maharashtra Deshastha Brahmin. He was a native of the village of Lamgaon, Pargana Takli, Prant Devgad (Daulatabad), on the bank of the Girija river.
  9. 9.0 9.1 9.2 Leonard 1994, p. 24.
  10. Dadabhoy 2019, p. 65.
  11. Leonard 1994, p. 34.
  12. 12.0 12.1 Mudiraj 1934, p. 219.
  13. Rau 1980, p. 1.
  14. M. V. Shiva Prasad Rau (1980). Archival Organization and Records Management in the State of Andhra Pradesh, India: An archival analysis and description of the public documents in the Andhra Pradesh State Archives. Government of Andhra Pradesh by the Director of State Archives (Andhra Pradesh State Archives). p. 33. Raja Shamraj played a prominent part on behalf of the Nizam of Hyderabad in the war against Tipu Sultan of Mysore, in 1781 . In his correspondence there is a reference to the two sons of Tipu Sultan who were taken as hostages soon after the Third Mysore War (1790-1792) to compel the ruler of Mysore to fulfil the obligations arising out of the Treaty of Seringapatnam (1792).
  15. Mallavarapu Venkata Siva Prasada Rau (1980). Archival Organization and Records Management in the State of Andhra Pradesh, India: An archival analysis and description of the public documents in the Andhra Pradesh State Archives. Government of Andhra Pradesh by the Director of State Archives (Andhra Pradesh State Archives). p. 33. One of the sons and successors of Dhondaji Pant by name Renukadas, received the title of Rai Rayan in 1783, of Diyanatwanth in 1785, and a little later, of Raja Shamraj.
  16. Ekbote 1954, p. 28: "Rai Rayan, Raja, Bahadur, Renuka Das, the second son of Dhondaji Pandit was born in 1178 H. (1765). At the age of fifteen (1194H/1780) he received the title of Rai. In 1199H/1785 he became Rai Rayan and was appointed Peshkar."