రెమో
స్వరూపం
రెమో అనునది 2016లో విడుదలైన ఒక తెలుగు అనువాద సినిమా. రెమో అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాత్రుక . ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్ బిల్డప్ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్ చేసేట్టుగా తీర్చిదిద్దారు.
తారాగణం
[మార్చు]- శివ కంటన్/ రెజినా మొత్వాని(రెమో) గా శివ కార్తీకేయన్
- డాక్టర్ దివ్యగా కీర్తి సురేష్
- శివ తల్లిగా శరణ్య
- వల్లికంత్గా సతీష్
- కె. ఎస్. రవికుమార్
- యోగిబాబు
- అరుణ్రాజా కామరాజ్
- రాజేంద్రన్
- శ్రీదివ్య (అతిథి పాత్రలో)
- ప్రతాప్ పోతేన్
- ఆన్సన్ పాల్
వివరాలు
[మార్చు]- బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్
- సంగీతం: అనిరుధ్
- కూర్పు: రూబెన్
- ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
- నిర్మాత: ఆర్.డి. రాజా
- రచన, దర్శకత్వం: బక్కియరాజ్ కణ్ణన్