రూపక్ రొనాల్డ్‌సన్
స్వరూపం
రూపక్ రొనాల్డ్‌సన్ | |
---|---|
జననం | రూపక్ రొనాల్డ్‌సన్ |
వృత్తి | తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత |
రూపక్ రొనాల్డ్‌సన్ తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్, ఫోటోగ్రాఫర్, నిర్మాత. 2023లో పరేషాన్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]రూపక్ రొనాల్డ్‌సన్ మంచిర్యాల జిల్లాలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]రాయ్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో పట్టా పొందాడు. తొలిరోజుల్లో టెలివిజన్ కార్యక్రమాలు, ప్రచార చిత్రాల (యాడ్స్) కు రచన, ఎడిటింగ్ విభాగాల్లో పనిచేశాడు. వీడియో కూలీ మీడియా అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. తరువాత స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన హృదయ కాలేయం సినిమాకు పనిచేశాడు.
తిరువీర్ ప్రధాన పాత్రలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పరేషాన్ (2023)సినిమా రూపొందించాడు.[2]
సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (22 February 2023). "పల్లెటూర్లో పరేషాన్". Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
- ↑ Telangana Today, Features (18 December 2020). "Rupak Ronaldson completes the production of his next film 'Pareshan'". Santosh Padala. Archived from the original on 29 January 2021. Retrieved 29 January 2021.