రూప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూప
జననం (1960-11-07) 1960 నవంబరు 7 (వయసు 63)
ఇతర పేర్లురూపాదేవి
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1980–1990
2005-ప్రస్తుతం
నాలాగ ఎందరో

రూప (జ.1960 నవంబరు 7) తెలుగు సినిమా నటీమణి. ఈమెకు నాలాగ ఎందరో సినిమాకు గాను ఉత్తమ నటీమణిగా నంది పురస్కారం లభించింది[1]. ఆమె 1980లలో కన్నడ, తమిళం, మలయాళం సినిమాలలో నటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె భారతీయ సినిమా నటి అద్వానీ లక్ష్మీదేవి కుమార్తె. ఆమె 1960 నవంబరు 7న జన్మించింది. ఆమె తమిళ సినిమా "ఒరి తలై రాగం" చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ఆ సినిమా 365 రోజులు ఆడింది. ఈ చిత్రంలో కొత్తగా వచ్చిన నటుడు శంకర్ తో నటించింది[2].

ఆమె ప్రధానంగా 1980 లలో కన్నడ సినిమాల్లో పనిచేసింది. ఆమె 1979 లో కమలా అనే ప్రయోగాత్మక చిత్రంలో అడుగుపెట్టింది. ఆమె నటించిన వేశ్య పాత్ర ఆమెకు విస్తృత విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టింది. 1980 లో సింహా జోడితో ఆమె వాణిజ్య సినిమాల్లోకి ప్రవేశించింది, ఇందులో విష్ణువర్ధన్ సోదరి పాత్రలో నటించింది. 1983-87 మధ్య కన్నడ సినిమాల్లో రెండవ ప్రధాన, సహాయక పాత్రలకు ఆమె మొదటి ఎంపిక అయింది. ఆమె కన్నడ సినిమాలైన హాలు జెను, ముల్లినా గులాబీ, బంధన, అవాలా అంతరంగ, మరాలి గుడిగే, త్రిశూల, అహుతి, ధర్మ, బాలా నౌకే చిత్రాలలో నటించింది. అవాలా అంతరంగలో నటనకు ఆమె ఉత్తమ నటిగా (1984-85) కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.

డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, విష్ణువర్ధన్, శ్రీనాథ్, అంబరీష్, అనంత్ నాగ్, శంకర్ నాగ్, లోకేష్ సహా ఆమె అప్పటి కన్నడ నటులతో కలిసి పనిచేసింది. ఆమె హాలు జెను, సమయాడ గొంబే, యారివానులలో డాక్టర్ రాజ్‌కుమార్‌తో కలసి నటిందింది. ఇవన్నీ విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా భారీ విజయాలు సాధించాయి. ఆమె 1989 తర్వాత నటనను ఆపివేసింది. దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత ఆమె 2008 లో గంగా కావేరితో కలిసి వెండితెరపైకి వచ్చింది. 2011 లో ఆమె జరాసంధలో హీరో దునియా విజయ్ తల్లిగా నటించింది.[3][4]

రూప నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Naalaaga Endaro. Naalaaga Endaro Movie Cast & Crew". www.bharat-movies.com. Retrieved 2020-04-16.[permanent dead link]
  2. "Ninaithu Ninaithu Parthen's music is brilliant". rediff.com. 13 March 2007. Retrieved 12 April 2010.
  3. "Jarasandha Movie Review-Deserved to be better". indiaglitz. 26 November 2011. Retrieved 29 March 2015.
  4. "Review: Jarasandha is disappointing". rediff. 26 November 2011. Retrieved 29 March 2015.
  5. "Naa Laaga Endaro (1978) | DoReGaMa". Archived from the original on 2019-09-07. Retrieved 2020-04-16.
"https://te.wikipedia.org/w/index.php?title=రూప&oldid=4313350" నుండి వెలికితీశారు