రుబియా సయ్యద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుబియా సయ్యద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుబియా సయ్యద్ షేక్
పుట్టిన తేదీ (1994-05-10) 1994 మే 10 (వయసు 30)[1]
అనంతనాగ్, జమ్మూ కాశ్మీర్
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి మీడియం-ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–2017జమ్మూ కాశ్మీర్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WLO WT20
మ్యాచ్‌లు 24 21
చేసిన పరుగులు 213 215
బ్యాటింగు సగటు 9.26 13.43
100లు/50లు 0/1 0/1
అత్యధిక స్కోరు 50* 57
వేసిన బంతులు 510 325
వికెట్లు 8 11
బౌలింగు సగటు 41.87 26.18
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/24 2/10
క్యాచ్‌లు/స్టంపింగులు 4 2
మూలం: CricketArchive (subscription required), 2018 జనవరి 1

రుబియా సయ్యద్ ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1994 మే 10న జమ్మూలో ఉన్న అనంత్‌నాగ్‌లో పుట్టింది.[2] తన తండ్రి గులాం ఖాదిర్ షేక్, పండ్ల వ్యాపారి ఎప్పుడూ మద్దతుగా నిలిచారని రుబియా తెలిపింది[3]

ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్, కుడి చేతి మీడియం- ఫాస్ట్ బౌలింగ్ చేసేది. జమ్మూ & కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) కి ప్రాతినిధ్యం వహించింది.[4][5] జమ్మూ & కాశ్మీర్ నుండి మహిళల క్రికెట్ ఉత్తర మండల జట్టులోకి ప్రవేశించిన మొదటి మహిళ రుబియా. ఆమె సకీనా అక్తర్ దగ్గర క్రికెట్ శిక్షణ తీసుకుంది. సకీనా అక్తర్ కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో మొదటి అర్హత పొందిన మహిళా క్రికెట్ శిక్షకురాలు.[6]

రుబియా 2012 నుండి క్రికెట్ ఆడుతోంది. ఆమె రంజీ ట్రోఫీ, సీనియర్ మహిళల T-20లో కూడా ఆడింది. వార్తా సంస్థ-కశ్మీర్ న్యూస్ అబ్జర్వర్ (KNO) తో ఫోన్‌లో మాట్లాడుతూ, రూబియా "రాబోయే సీజన్‌లో IPL జట్టు గుజరాత్ జెయింట్స్‌ తరపున భాగమవుతానని అధికారుల నుండి పిలుపు వచ్చింది." అని చెప్పింది.[3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Rubia Syed". ESPNcricinfo. Retrieved 20 Dec 2017.
  2. "Rubia Syed". CricketArchive. Retrieved 1 January 2018.
  3. 3.0 3.1 "Kashmiri all-rounder Rubia Syed to play for Gujarat Giants in Women's IPL". Awazthevoice. Retrieved 14 September 2023.
  4. "Women's limited overs Matches played by Rubia Syed". CricketArchive. Retrieved 1 January 2018.
  5. "Women's Twenty20 Matches played by Rubia Syed". CricketArchive. Retrieved 1 January 2018.
  6. "Kashmir's Rubia Syed to play for Gujarat Giants in IPL". Awaz-The Voice. Retrieved 14 September 2023.