Jump to content

రుద్రదేవుడు

వికీపీడియా నుండి

అస్సలు నిజానికి చాలుక్యు డైన క్షత్రియ రాజ వంశానికి రుద్రదేవుడు ఒకడు. [1] ఇతడిని గోనే మహారాజు, బుద్ధా రుద్రదేవ మహారాజు, రుద్రదేవుడు నిర్మించిన దేవాలయం త్రిలింగ లేదా త్రికూట 1, సూర్యవంశ క్షత్రియ గుర్తు గా (ఇంద్ర లింగం) 2, వైష్ణవ వంశ గుర్తు గా (విష్ణు లింగం) 3, శైవ వంశ గుర్తు గా (శివ లింగం) ఉన్న దేవుళ్ళు అని అర్ధం దైవం పేరు పెట్టారు. పూర్వా కాలంలో గోవులు చాలా ఉండేవి. ఆ గోవుల పైన గోనే బొంతలు ఉండేవి. అందుకు గోనెంద్ర అని ఇతర పేర్లతో ప్రజలు పిలిచేవారు, గోనే ఆవుల రుద్ర దేవుడు దేవతలకి అధిపతి దేవేంద్రుడు ఇంద్ర దేవ అంశ (శిల్పి బ్రహ్మ) భక్తుడు, యెల్లవుల ఏలదేవుడు విష్ణు (మాయ బ్రహ్మ )అంశ భక్తుడు , ఓరుగంటి శంభు దేవుడు శివుని (మను బ్రహ్మ )భక్తుడు అంశ , వీరి గుర్తుగా త్రిలింగ లేదా త్రికూట దేవాలయాన్ని నిర్మించిన రుద్ర దేవుడు,

రాజ్య విస్తరణ

[మార్చు]

రుద్రదేవుడు 1158-62 వరకు సామంత రాజుగా, 1163-95 వరకు స్వతంత్ర రాజుగా పరిపాలన చేశాడు. రుద్రదేవుడు 1163లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని తెలంగాణలో మొదటి విశాల రాజ్యాన్ని స్థాపించాడు. నగునూర్ (కరీంనగర్)‌ పాలకుడైన దొమ్మరాజును, పొలవాస (జగిత్యాల) పాలకుడైన రెండో మేడరాజును, మైలిగ దేవుడు, చోడోదయుడు మొదలైన వారిని యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని తెలంగాణలో నెలకొల్పాడు. కలచురి రాజ్యాన్ని ఆక్రమించి, కందూరి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.ఇతడి రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు, పశ్చిమాన బీదర్‌ వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు వ్యాపించింది. 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో నలగామరాజుకు తన మద్దతు తెలిపాడు. ఇతడి మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించిన ద్రాక్షారామ శాసనం (1158) ప్రకారం ఇతడు పరాక్రమశాలి.

వివాహం

[మార్చు]

రుద్రదేవుడు ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు చాలుక్య కూతురు అయిన భాగ్య లక్మి (భాగేమ్మ) గుర్తుగా భాగ్య నగర్ లోని (హైద్రాబాద్ ) భాగ్య లక్ష్మి దేవాలయం కట్టించాడు రెండువ భార్య పేరు అరెమ్మ (మారెమ్మ). అరెక్షత్రియల కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం సందర్భంగా రుద్రదేవుడు 'రుద్రసముద్ర తటాకం' అనే చెరువును తవ్వించాడు.

నిర్మించిన కట్టడాలు, వేయించిన శాసనాలు

[మార్చు]

రుద్రదేవుడు తన విజయాలకు సూచకంగా ఒక విజయ శాసనాన్ని అనుమకొండలో వేయించి ఇంద్ర లింగం, విష్ణు లింగం ,శివ లింగాలను ప్రతిష్టించి గొప్ప త్రికూట ఆలయాన్ని నిర్మించాడు. (వేయి స్తంభాల గుడి ). రుద్రదేవుడు ఘనపూర్ కోట వరంగల్ కోట కరీంనగర్ కోట పూర్తిచేశాడు. ఇతడి మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్ లో‌ శాసనం (1170) వేయించాడు. అంతేకాక అనుమకొండలో ఒక చెరువును తవ్వించాడు, ప్రసన్నకేశవస్వామి ఆలయాన్ని కట్టించాడు.

చేసిన రచనలు, పొందిన బిరుదులు

[మార్చు]

రుద్రదేవుడు సంస్కృతంలో 'నీతిసారం' అనే గ్రంథాన్ని రాశాడు. ‘విద్యాభూషణ’ బిరుదు కలవాడు.

మరణం

[మార్చు]

1195లో యాదవ రాజైన జైతుగి చేతిలో రుద్రదేవుడు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

మరణాంతరం

[మార్చు]

రుద్రదేవుడికి పుత్రులు లేనందువల్ల అతడి సోదరుడు మహాదేవుడు కాకతీయ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఈ విషయాన్ని‘ఖండవల్లి తామ్రదాన పత్రం’ ధృవపరుస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2021-03-14). "వేయిస్తంభాల గుడి శాసనాన్ని లిఖించింది?". www.ntnews.com. Retrieved 2023-08-18.

వెలుపలి లంకెలు

[మార్చు]

• నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో ప్రచురితమైన వ్యాసం.