Jump to content

రీమా కగ్టి

వికీపీడియా నుండి
రీమా కగ్టి
2011లో రీమా కగ్టి
జననం
రీమా కాకతి

(1972-11-07) 1972 నవంబరు 7 (వయసు 52)
దిగ్బోయ్, అస్సాం, భారతదేశం
వృత్తిసినిమా దర్శకుడు , స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం

రీమా కగ్టి (ఆంగ్లం: Reema Kagti; అసలు పేరు: రీమా కాకతి; జననం 1972 నవంబరు 7) బాలీవుడ్‌కు చెందిన ఒక భారతీయ చలనచిత్ర దర్శకురాలు, స్క్రీన్ రైటర్. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి. (2007)తో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. దీని తర్వాత నియో-నోయిర్, తలాష్ (2012), హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా గోల్డ్ (2018). జోయా అక్తర్‌తో కలిసి రీమా కగ్టి 2015 అక్టోబరులో టైగర్ బేబీ ఫిల్మ్స్ అనే ఫిల్మ్, వెబ్ స్టూడియోని స్థాపించింది.

బాల్యం

[మార్చు]

అస్సాంలోని టిన్సుకియా జిల్లా బోర్హాప్జాన్‌కి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రీమా కాకతి ఢిల్లీలో చదువుకుంది. ఆ తర్వాత టీనేజ్‌లో చిత్రసీమపై మక్కువతో ముంబైకి చేరుకుంది.[1]

కెరీర్

[మార్చు]

ఆమె ఫర్హాన్ అక్తర్ (దిల్ చాహ్తా హై, లక్ష్య), అశుతోష్ గోవారికర్ (లగాన్), హనీ ఇరానీ (అర్మాన్), మీరా నాయర్ (వానిటీ ఫెయిర్) వంటి ప్రముఖ దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించింది.[2]

ఆమె ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ ఇద్దరికీ ఇప్పటి వరకు వారి అన్ని సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో సహాయం చేసి ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో చక్కని అనుబంధం కలిగిఉంది.[3] అలాగే జోయా అక్తర్, రీమా కగ్టి కలిసి టైగర్ బేబీ ఫిల్మ్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు.

2006లో హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి.తో దర్శకురాలిగా పరిచయమైన[4] రీమా కగ్టి తదుపరి చిత్రం అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ డ్రామా తలాష్.[5] ఆమె దర్శకత్వం వహించిన 2018లో వచ్చిన గోల్డ్, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో మొదటి ఒలింపిక్ బంగారు పతకం సాధించిన చిత్రంగా గుర్తింపుపొందింది.

మూలాలు

[మార్చు]
  1. Nair, Supriya (9 November 2012). "Reema Kagti: Being 'mad' in Bollywood". Mint. Retrieved 10 February 2022.
  2. ""Initially I had plans to make a dark film; in fact it was darker than an average film" - Reema Kagti". Bollywoodhungama.com. 2006-11-07. Retrieved 2011-07-04.
  3. "Honeymoon Travels". Imagineindia.net. Archived from the original on 2016-03-04. Retrieved 2011-07-04.
  4. "Reema Kagti". Excel Entertainment.
  5. "Aamir's Khan's next is suspense drama directed by Reema Kagti". Bollywoodhungama.com. 2010-11-01. Retrieved 2011-07-04.