Jump to content

రిషి సునాక్

వికీపీడియా నుండి
ది రైట్ హానరబుల్ రిషి సునాక్
రిషి సునాక్


ప్రతిపక్ష నాయకుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జూలై 2024
ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్
చక్రవర్తి చార్లెస్ III
ముందు కీర్ స్టార్మర్

కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 అక్టోబర్ 2022
ముందు లిజ్ ట్రస్

పదవీ కాలం
25 అక్టోబర్ 2022 – 5 జూలై 2024
చక్రవర్తి చార్లెస్ III
[[డిప్యూటీ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి|డిప్యూటీ]]
  • డొమినిక్ రాబ్
  • ఆలివర్ డౌడెన్
ముందు లిజ్ ట్రస్
తరువాత కీర్ స్టార్మర్

ఆర్థిక శాఖ మంత్రి
పదవీ కాలం
13 ఫిబ్రవరి 2020 – 5 జూలై 2022
ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్
ముందు సాజిద్ జావీద్
తరువాత నదీమ్ జహావి

ట్రెజరీ ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
24 జులై 2019 – 13 ఫిబ్రవరి 2020
ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్
ముందు లీజ్ ట్రస్
తరువాత స్టీవ్ బార్క్లే

పార్లమెంటరీ రాష్ట్ర అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్
పదవీ కాలం
9 జనవరి 2018 – 24 జులై 2019
ప్రధాన మంత్రి థెరిసా మే
ముందు మార్కస్ జోన్స్
తరువాత ల్యూక్ హాల్

Member of Parliament
for రిచ్‌మండ్ & నార్తల్లెర్టన్ పార్లమెంటు సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 మే 2015
ముందు విలియం హేగ్
మెజారిటీ 12,185 (25.1%)[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1980-05-12) 1980 మే 12 (వయసు 44)
సౌథాంప్టన్‌, ఇంగ్లాండ్
రాజకీయ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ
జీవిత భాగస్వామి
అక్షతా మూర్తి
(m. 2009)
[2]
బంధువులు
సంతానం కృష్ణా సునాక్, అనౌష్క సునాక్

రిషి సునక్‌ (జననం 1980 మే 12) బ్రిటీష్ రాజకీయ నాయకుడు. ప్రస్తుత బ్రిటన్ ప్రధాని. 2019 నుండి 2020 వరకు ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా, 2020 నుండి 2022 వరకు ఆర్థిక మంత్రి పనిచేశాడు. ఋషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నుండి 2015లో రిచ్‌మండ్ (యార్క్స్) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ)గా ఎన్నికయ్యాడు.[3] రిషి సునక్‌ 2022 అక్టోబరు 24న భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ దేశ ప్రధానిగా నియమితులయ్యాడు.[4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించాడు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. ఋషి పూర్వీకులు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి అనంతరం యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఋషి తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో జన్మించగా తల్లి ఉష టాంజానియాలో పుట్టారు. ఋషి సునక్ స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రిషి సునాక్ తాను చదువుకునే రోజుల్లో కొంతకాలం పాటు కన్జర్వేటివ్‌ పార్టీలో ఇంటర్న్ షిప్ చేసి 2014లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుండి ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి ఎంపీగా గెలిచి 2019లో కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌కు మద్దతు తెలిపి బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఎన్నికయ్యాక ఋషికి ఆర్థిక శాఖలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆయన 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా పదోన్నతి అందుకొని అదే ఏడాది మార్చిలో పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.[5]

వివాహం

[మార్చు]

రిషి సునాక్​ ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని 2009లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఋషి సునక్, అక్షత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Richmond and Northallerton results". BBC News. 4 July 2024. Retrieved 5 July 2024.
  2. "బ్రిటన్‌ ప్రధాని రిషి విజయంలో.. అక్షత కృషి". 26 October 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  3. Sakshi (7 July 2022). "బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో రిషి సునక్‌..ఆయన గురించి ఐదు కీలక విషయాలు". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  4. "బ్రిటన్‌ నూతన ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవ ఎన్నిక". 24 October 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  5. Eenadu (7 July 2022). "బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌.. ఆయన గురించి తెలుసా?". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  6. BBC News తెలుగు (9 July 2022). "బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన ఋషి సునక్". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.