Jump to content

రియాలిటీ చెక్

వికీపీడియా నుండి

రియాలిటీ చెక్ పుస్తకం ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పూడూరి రాజిరెడ్డి రాసిన వ్యాసాల సంకలనం. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో రచయిత పర్యటించి అక్కడి అనుభవాన్ని, ఆ ప్రాంతం వ్యక్తిత్వాన్ని ఈ వ్యాసాల్లో రచించారు. కొన్ని వ్యాసాలకు భూమికగా హైదరాబాద్ నగరం కాక ఇతర ప్రాంతాలను కూడా స్వీకరించారు. రాజిరెడ్డి ఈ వ్యాసాల్లో భాగంగా ఎర్రగడ్డ మాససిక వైద్యశాల, పంజాగుట్ట శ్మశానం, శవాలగది వంటి సాధారణంగా వెళ్ళని ప్రాంతాలకు,

రచనా నేపథ్యం

[మార్చు]

రియాలిటీ చెక్ వ్యాసాలను సాక్షి పత్రికలో ఉద్యోగస్తుడైన పాత్రికేయుడు, రచయిత పూడూరి రాజిరెడ్డి రియాలిటీ చెక్ అనే కాలమ్ సాక్షి ఆదివారం సంచిక ఫన్‌డేలో ధారావాహికగా ప్రచురితమైంది. రియాలిటీ చెక్ వ్యాసాలను డిసెంబర్ 4, 2011న ప్రారంభించి మార్చి 17, 2013 వరకూ కొనసాగించారు. రియాలిటీ చెక్ 2013 డిసెంబరులో తొలి ప్రచురణ పొందింది. మొత్తం 59 వారాలు కొనసాగిన ఈ ధారావాహికలో 59 వ్యాసాలు ఉండగా పుస్తకంగా ప్రచురితమైనప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. రియాలిటీ చెక్‌లో భాగంగా అచ్చైన ఊహల్లో మనుషులు ఈ పుస్తకంలో కాక రచయిత వేరే పుస్తకమైన పలక-పెన్సిల్లో ప్రచురించారు. ఆ ధారావాహిక కోసం రాయకున్నా నీది మరణం-నాది జీవన్మరణం, తెలంగాణా వంటల పండుగ వ్యాసాలను కలిపి మొత్తంగా 60 వ్యాసాలుగా చేసి పుస్తకం వేశారు. పుస్తకాన్ని తెనాలి ప్రచురణలు సంస్థ ప్రచురించింది.

ఇతివృత్తాలు

[మార్చు]

రియాలిటీ చెక్ వ్యాసాలు అధిక భాగం హైదరాబాద్ నగరంలోనూ, కొద్దిగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రదేశాలను, పలువురు వ్యక్తులను రాజిరెడ్డి సందర్శించి ఆ అనుభవాన్ని అక్షరబద్ధం చేసినవి. ఈ వ్యాసాల్లో భాగంగా పూడూరి రాజిరెడ్డి వివిధ ప్రాంతాలలో తాను గమనించిన వాస్తవికతను వ్యాసాలుగా అందించారు. ఆయన సందర్శించి, అక్షరరూపం కల్పించిన ప్రాంతాలు ఇవి:

మొదలైనవి ఉన్నాయి.

ఆయన వ్యక్తులకు ప్రత్యేకించిన వ్యాసాలు కూడా రాశారు. ఆ వ్యాసాలకై కలిసిన వారు:

తదితరులు ఉన్నారు

ఇతరుల మాటలు

[మార్చు]
  • అట్లాంటి చోట్లనీ, అట్లాంటి వ్యక్తుల్నీ గురించి ఆలోచించడం 59 వారాలపాటు 'రియాలిటీ చెక్‌'గా సాక్షి ఫన్‌ డేలో అందించడం పూడూరి రాజిరెడ్డి చేసిన సాహసయాత్ర. దీనికి అవసరమైన సామగ్రీ సామర్థ్యమూ ఉండటం వల్ల ఒక రొటీన్‌ కాలమ్‌గా కాక ఇది తెలుగు వచనంలో ఒక 'ఎవర్‌లాస్టింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌'గా నిలిచిపోతుంది... ఇట్లాంటి రచన చేయడానికి ఉపయోగపడిన 'రా మెటీరియల్‌' వాక్యమే. వాక్య నిర్మాణంలో సవ్యసాచి అయితే తప్ప అది సాధ్యం కాదు. వాక్యాన్ని ఎన్ని రకాలుగా సుసంపన్నం చేయవచ్చునో అన్ని రకాలూ చేశాడు రాజిరెడ్డి. - చింతపట్ల సుదర్శన్
  • అనాదిగా మానవజాతి అభివృద్ధి చేసుకున్న అన్ని సాహితీ ప్రక్రియల సారభూతమైనదేదో ఈ రచనల్లో ఉంది. పూర్వపు ఆశు సంప్రదాయం ధ్వనిస్తుంది. ఆధునిక రాత కథా లక్షణమూ పొడగడుతుంది. దృశ్యకావ్యపు లక్షణమేదో ద్యోతకమవుతుంది. అన్నింటినీ చదవడం పూర్తిచేసింతర్వాత ఇదొక భాగ్యనగరపు (అభాగ్యనగరపు) నవలగా కూడా అనిపిస్తుంది. అన్ని సాహితీ ప్రక్రియలు కలగలిసి ఒక సరికొత్త ఉత్కృష్ట సాహితీరూపంగా పరిణమించాయని కూడా నాకు అనిపించింది. - తుమ్మేటి రఘోత్తమరెడ్డి[1]

మూలాలు

[మార్చు]
  1. "కినిగె.కాంలో రియాలిటీ చెక్ గురించిన పేజీ". Archived from the original on 2014-07-18. Retrieved 2014-07-26.