రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇ-గవర్నెన్స్ వ్యవస్థ.[1] దాన్ని 2017 సెప్టెంబరు 6 న ఏర్పాటు చేసారు. ఈ విభాగం ముఖ్యమంత్రి నియంత్రణలో ఉండేది.[2]

చరిత్ర

[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో ఇ-గవర్నెన్స్‌ని అమలు చేయడానికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, టెక్నాలజీని ఉపయోగించాలనే ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా 13 జిల్లా కేంద్రాలు, 1 రాష్ట్ర కేంద్రం ఉన్నాయి.[3] ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన, ముందస్తు హెచ్చరిక పరిశోధన కేంద్రం, డ్రోన్‌లు, మెషిన్ లెర్నింగ్ వ్యవస్థలు, బయోమెట్రిక్ వ్యవస్థలు, ఇతర నిఘా వ్యవస్థల నుండి డేటాను సేకరించి, నిజ సమయంలో RTGS వ్యవస్థ ద్వారా నివేదించబడుతుంది. అంతర్గత ఫిర్యాదులను ఓ కాల్ సెంటర్ ద్వారా పరిష్కరిస్తారు.[3]

RTGల దరఖాస్తులు

[మార్చు]

RTGS వ్యవస్థను N. చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగించాడు. 2019 ఎన్నికలకు ముందు పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాచారం అంతా తన వద్ద ఉందని, గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులనే బరిలోకి దింపుతానని హెచ్చరించేవాడు. దీనిలో నియోజకవర్గాల వారీగా డేటాను సేకరించేవారు. ప్రతిపక్షం తమ పార్టీపై తరచూ దాడి చేసిన ఇసుక మైనింగ్ కార్యకలాపాల్లో తన మంత్రులెవరూ పాలుపంచుకోకుండా చూసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించాడు.[4]

'ఫెథాయ్ తుఫాను' సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మానవ ప్రాణనష్టాన్ని తగ్గించడానికి RTGS, IVRS సాంకేతికతలను ఉపయోగించి సుమారు తొమ్మిది లక్షల మందికి సందేశాలను పంపింది. RTGS ప్రభావం గురించి చంద్రబాబు నాయుడు, "తుఫాను తీరం చేరే ఖచ్చితమైన స్థానాన్ని మేము భారత వాతవరణ శాఖ కంటే మెరుగ్గా అంచనా వేసాము" అని చెప్పాడు.

మూలాలు

[మార్చు]
  1. "How Real-Time Governance Society helps Chandrababu Naidu evaluate his MLAs performance". The New Indian Express. Retrieved 2019-02-21.
  2. ANI (2017-11-26). "Chandrababu Naidu inaugurates real time governance centre in AP". Business Standard India. Retrieved 2019-02-21.
  3. 3.0 3.1 "Real Time Governance Centre launched in Andhra Pradesh" (in ఇంగ్లీష్). 27 November 2017. Retrieved 2019-02-21.
  4. "How Real-Time Governance Society helps Chandrababu Naidu evaluate his MLAs performance". The New Indian Express (in ఇంగ్లీష్). 28 November 2018. Retrieved 2022-07-15.