Jump to content

రావు సాహిబ్

వికీపీడియా నుండి

రావు సాహిబ్ భారతదేశంలో బ్రిటిష్ పాలనలో విశ్వాసపాత్రమైన సేవ చేసినవారికి లేదా ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినవారికీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవ బిరుదు.[1] ఈ బిరుదును హిందువులకు ఇచ్చేవారు. ఇతర మతస్థులకు ఇదే స్థాయి బిరుదులు వేరే పేర్లతో - ఖాన్ సాహిబ్ వంటివి - ఉండేవి. దీన్ని రాయ్ సాహిబ్ / రాయ్ సాహెబ్ / రావు సాహెబ్ అని కూడా పిలుస్తారు. సంక్షిప్తంగా RS అని అంటారు. 1911 నుండి ఈ బిరుదుతో పాటు పతకాన్ని కూడా ఇచ్చారు. రాయ్ అంటే "రాజు" అని, సాహెబ్ అంటే "నాయకుడు" అనీ అర్థం.[2]

జార్జ్ VI పాలనలో ప్రదానం చేసిన బిరుదు పతకం.[3]

ఇది సాధారణంగా పౌరులకు ఇచ్చే ప్రారంభ స్థాయి బిరుదు. దీనికి పై స్థాయిలో రావు బహదూర్‌, ఆ తరువాత దివాన్ బహదూర్ బిరుదు లున్నాయి.[4]

ఈ బిరుదు పేరుకు ఉన్న వివిధ రూపాల్లో రాయ్ సాహిబ్ను ఉత్తర భారతదేశపు హిందువులకు ఇచ్చేవారు. మహారాష్టలో రావు సాహెబ్ అని, దక్షిణ భారతదేశపు హిందువులకైతే రావు సాహిబ్ అనీ ఇచ్చేవారు. అయితే, అవన్నీ ఒకే స్థాయికి చెందినవే. ఆయా ప్రాంతాల్లో ఉండే పలుకుబడికి అనుగుణంగా పేర్లు మారేవి.[5]

బ్రిటిష్ రాజ్ సమయంలో జారీ చేసిన ఇతర బిరుదులతో పాటు

రావు సాహిబ్‌ను కూడా 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్మూలించారు.[6]

కొందరు రావు సాహిబ్‌లు

[మార్చు]
  • శంకర్ రామచంద్ర పన్హాలే 1936 లో రావు సాహెబ్ పురస్కారం పొందాడు. అతను పూణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సుప్రసిద్ధ పరోపకారి. 1973 లో ప్రభుత్వం అతనికి ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.
  • రావు బహదూర్ సత్యేంద్ర నాథ్ ముఖర్జీ, 1934 జూన్ 4 న రాయ్ సాహెబ్ అవార్డు పొందాడు. అతను కలకత్తాలోని మొట్టమొదటి భారతీయ డిప్యూటీ పోలీసు కమిషనర్.[7][8][9][10]
  • రావు సాహెబ్ బుద్ధ మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లికి చెందిన పెద్ద భూస్వామి, ఇనామ్దార్, విశాఖపట్నం జిల్లా బోర్డు సభ్యుడు
  • రావు సాహిబ్ అయ్యతన్ గోపాలన్ (కేరళ, ఇండియా) - డాక్టర్, చీఫ్ సర్జన్, హాస్పిటల్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, కేరళలోని మలబార్ ప్రాంతానికి మేజిస్ట్రేట్ (భారతదేశంలో బ్రిటిష్ పాలనలో), కేరళ సామాజిక సంస్కర్త. -రైసాహిబ్‌కు 1917 నవంబరు 17 న బ్రిటిష్ ప్రభుత్వం ఈ బిరుదు నిచ్చింది.
  • పండిట్ వజీర్ చంద్ త్రిఖా, ఝాంగ్, పాకిస్తాన్ (ఇండియా) - చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉత్తర రైల్వే.[11][12]
  • నాగేంద్ర కుమార్ భట్టాచార్య - బెర్హాంపూర్ కమిషనర్ 1932-1948, ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్
  • రావు సాహిబ్ కాట్రగడ్డ పెద్ద అచ్చయ్య, అమృతలూరు జమిందారు - గుంటూరు, ఆంధ్రప్రదేశ్
  • రామ్‌నాథ్ గోయెంకా, బొంబాయి - వార్తాపత్రిక సంపాదకుడు, వ్యాపారవేత్త
  • ముల్జీ జగ్మల్ సవారియా, బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్ - గని వ్యాపారి.
  • AYS పరిశుత్థ నాడార్, తంజావూర్ - రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త
  • దిననాథ్ ఆత్మారాం దల్వి (1844-1897) సబ్ జడ్జ్, తరువాత సబార్డినేట్ జడ్జి బాంబే ప్రెసిడెన్సీ, సీనియర్ దక్షిణ ఫెలో ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ బాంబే, ఫెలో బాంబే యూనివర్శిటీ, "ఒక సమీకరణంలో ఊహాత్మక స్క్వేర్ రూట్స్ సంఖ్యను కనుగొనడం కోసం సర్ ఐజాక్ న్యూటన్ నియమం పరీక్ష" పుస్తక రచయిత.[13][14][15]
  • దుఖాన్ రామ్ - భారతీయ నేత్ర వైద్యుడు, శాసనసభ్యుడు పద్మభూషణ్ గ్రహీత [16]
  • మహాబీర్ ప్రసాద్ మిశ్రా - విద్యావేత్త, మధుబని జిల్లా, ధర్బంగా.[17]
  • గిడుగు వెంకట రామమూర్తి - తెలుగు భాషావేత్త
  • గణపత్రరావు నారాయణరావు మదిమాన్ - కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాంకర్.
  • కాశీనాథ్ కృష్ణ కల్కర్ - అమల్నర్ [18]
  • కూవర్జీ కర్సన్ రాథోర్ - కటక్ నుండి పారిశ్రామికవేత్త [19]
  • కుప్పుసామి కోదండపాణి పిళ్లై - డిప్యూటీ కలెక్టరు [20]
  • హరిలాల్ షామ్‌జీ - పరోపకారి, రాయ్‌గఢ్ [19][21]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

 

  1. H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
  2. Hankin, Nigel B. (2003). Hanklyn-janklin By Nigel B. Hankin. p. 404. ISBN 9788187943044.
  3. Image of Rao Sahib Medal
  4. "Quila House and the Jalan Collection: Dewan Bahadur". quilahouse.com. Archived from the original on 2015-02-19. Retrieved 2021-09-21.
  5. "British India: INDIAN TITLE BADGE (MYB # 327), RAO BAHADUR & RAO SAHIB MEDALS". worldofcoins.eu. Retrieved 18 October 2014.
  6. "Santi Priya Mukherjee vs Surendra Nath Chatterjee on 28 November, 1950". indiankanoon.org. Retrieved 27 March 2020.
  7. "Santi Priya Mukherjee vs Surendra Nath Chatterjee on 28 November, 1950". indiankanoon.org. Retrieved 27 March 2020.
  8. Channa, Subhadra Mitra; Channa, Subhadra (5 September 2013). Gender in South Asia (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 978-1-107-04361-9.
  9. Gupta (IAS.), G. S. (1991). Free Masonry in India (in ఇంగ్లీష్). G.S. Gupta.
  10. India Supreme Court (1963). Indian Factories & Labour Reports (in ఇంగ్లీష్). Law Publishing House.
  11. Kaur, Madanjit (2008). Maharaja Ranjit Singh (in ఇంగ్లీష్). Unistar Books. ISBN 9788189899547.
  12. Sikh Digital Library (1 April 1964). Three Letters Of Maharani Jind Kaur – Dr. Ganda Singh. Sikh Digital Library. Sikh Digital Library.
  13. Dalvi, Dinanath Atmaram (1 January 1869). An Examination of Sir Isaac Newton's Rule for Finding the Number of Imaginary Roots in an Equation: With Geometrical and Mechanical Theorems and a Trigonometrical Formula. Education Society's Press, Byculla – via Google Books.
  14. The India Office and Burma Office List. 1888. p. 146.
  15. "The India Office and Burma Office List". 1 January 1888 – via Google Books.
  16. "Padma Bhushan Dr. Dukhan Ram". Association of Otolaryngologists of India. 2013. Archived from the original on 6 July 2016. Retrieved 9 July 2016.
  17. Rao, C. Hayavando (1915). The Indian biographical dictionary (PAGE 30). University of California Libraries. Madras : Pillar.
  18. Peter, Thomas. The Royal Coronation Number and Who's who in India, Burma and Ceylon (in ఇంగ్లీష్). Sun Publishing House. p. 584. Retrieved 1 December 2020.
  19. 19.0 19.1 Lewis, Sir Hawthorne. Speeches Delivered by His Excellency Sir Hawthorne Lewis, ..., Governor of Orissa, 1941–1946 (in ఇంగ్లీష్). Government of Orissa. p. 191.
  20. {{cite book |last1=Saint George (India) |first1=Fort |title=Fort St. George Gazette|pages=4 |url=https://archive.org/details/gazette.stgeorge.TG1943.TG1943JAN26/page/n3/mode/2up%7Ctitle=Fort St. George Gazette (PAGE 4)|last=Pillai|first=Kodandapani|date=1943|publisher=Madras
  21. Pradesh (India), Madhya. Madhya Pradesh Gazette (in ఇంగ్లీష్). p. 9. Retrieved 2 December 2020.