Jump to content

రామ్ లాల్ రాహి

వికీపీడియా నుండి
రామ్ లాల్ రాహి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
1991 – 1996
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1969
1977
నియోజకవర్గం హర్‌గావ్

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1977 - 1984
1989 - 1994
నియోజకవర్గం మిస్రిఖ్

వ్యక్తిగత వివరాలు

జననం 1 జనవరి 1934
భారతదేశం)
మరణం 10 డిసెంబర్ 2020
సీతాపూర్, ఉత్తరప్రదేశ్‌
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం సురేష్ రాహి

రామ్ లాల్ రాహి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ లాల్ రాహి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1969లో హర్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1974లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రామ్ లాల్ రాహి 1977లో తొలిసారి మిస్రిఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై ఆ తర్వాత రెండు సార్లు 1989, 1991లో ఎంపీగా ఎన్నికై 1991లో పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. రాహి చాలా 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.

మరణం

[మార్చు]

రామ్ లాల్ రాహి ఛాతీ నొప్పి & శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా రాహిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. తరువాత ఆయనకు కరోనావైరస్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, అతన్ని ఎల్2 సదుపాయానికి మార్చారు, ఈ క్రమంలో ఆయన గుండెపోటుతో 10 డిసెంబర్ 2020న మరణించాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (11 December 2020). "Veteran Congress leader Ram Lal Rahi dies at 86 in Uttar Pradesh's Sitapur - The New Indian Express". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  2. Khaleej Times (11 December 2020). "Veteran Indian politician Ram Lal Rahi dies after heart attack" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.