Jump to content

రామ్ బాబు శర్మ

వికీపీడియా నుండి
రామ్ బాబు శర్మ

పదవీ కాలం
2003 – 2009
ముందు రాధే శ్యామ్ ఖన్నా
తరువాత విపిన్ శర్మ
నియోజకవర్గం రోహ్తాస్ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం 1956
ఢిల్లీ, భారతదేశం
మరణం 2009 జనవరి 28
ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

రామ్ బాబు శర్మ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు రోహ్తాస్ నగర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ బాబు శర్మ 1971లో విద్యార్థి రాజకీయాల ద్వారా రాజకీయాల్లోకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రాగా 1980లో ఇందిరా గాంధీ ఆయనను తూర్పు ఢిల్లీ యూత్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించింది ఆ తరువాత తూర్పు ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామితుడై 10 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగాడు. ఆయన 1996లో తూర్పు ఢిల్లీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేసి 1997, 2002లో రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా ఎన్నికై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో సభా నాయకుడిగా పని చేసి 2003 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రోహ్తాస్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అలోక్ కుమార్‌పై 6,363 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన నవంబర్ 2004లో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తొలిసారి నియమితుడై ఆ తరువాత జూలై 2005లో రెండోసారి ఎన్నికై 2007 వరకు డీపీసీసీ అధ్యక్షుడిగా పని చేశాడు.

రామ్ బాబు శర్మ 2008 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అలోక్ కుమార్‌పై 13,243 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ బాబు శర్మ నోటిలో క్యాన్సర్ కణితి ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం ప్రారంభించడంతో అపోలో ఆసుపత్రిలో చేరగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ 2009 జనవరి 28న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Former DPCC chief Ram Babu Sharma passes away" (in ఇంగ్లీష్). The Indian Express. 29 January 2009. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
  2. "वरिष्‍ठ कांग्रेसी नेता रामबाबू शर्मा का निधन". आज तक. 28 January 2009. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.