రామేశ్వర్ ఒరాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామేశ్వర్ ఒరాన్
రామేశ్వర్ ఒరాన్

డాక్టర్ రామేశ్వర్ ఒరాన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 డిసెంబర్ 2019
గవర్నరు ద్రౌపది ముర్ము
రమేష్ బైస్
సీ.పీ. రాధాకృష్ణన్
ముందు రఘుబర్ దాస్

జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
26 ఆగస్టు 2019 – 25 ఆగస్టు 2021
ముందు అజోయ్ కుమార్
తరువాత రాజేష్ ఠాకూర్

జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 డిసెంబర్ 2019
ముందు సుఖదేయో భగత్
నియోజకవర్గం లోహర్దగా

పదవీ కాలం
13 మే 2004 - 16 మే 2014
ముందు దుఖా భగత్
తరువాత సుదర్శన్ భగత్
నియోజకవర్గం లోహర్దగా

పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం లోహర్దగా

వ్యక్తిగత వివరాలు

జననం (1947-02-14) 1947 ఫిబ్రవరి 14 (వయసు 77)
దాల్తోన్‌గంజ్ , బీహార్ , (ఇప్పుడు జార్ఖండ్ ), బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి రాగిణి మింజ్
సంతానం కుమారుడు (రోహిత్ ఒరాన్), కుమార్తె (నిషా ఒరాన్ సింగ్మార్)
నివాసం రాంచీ , జార్ఖండ్ , భారతదేశం
మూలం [1]

రామేశ్వర్ ఒరాన్ భారతదేశానికి చెందిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా, ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రామేశ్వర్ ఒరాన్ 1947 ఫిబ్రవరి 14న పాలములోని చియాంకిలో జన్మించాడు. ఆయన దాల్తోన్‌గంజ్‌లోని గణేష్ లాల్ అగర్వాల్ కాలేజీలో బిఎ (ఆనర్స్) డిగ్రీని, పాట్నా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

రామేశ్వర్ ఒరాన్ 1971లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES)లో చేరి ఆ తర్వాతి సంవత్సరం 1972లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కి మారాడు. ఆయన రాజకీయాల పట్ల ఆసక్తితో 2004లో ఐపీఎస్‌ని వదులుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామేశ్వర్ ఒరాన్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోహర్దగా నుండి లోక్‌సభకు ఎన్నికై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2009 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయన 2010 నుండి 2016 వరకు వరుసగా రెండు పర్యాయాలు 28 అక్టోబర్ 2010 నుండి 26 ఆగస్టు 2017 వరకు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో లోహర్దగా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, ఆహార & పౌర సరఫరాల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

రామేశ్వర్ ఒరాన్ 26 ఆగస్టు 2019 నుండి 25 ఆగస్టు 2021 వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Tribal (2 February 2022). "Village Boy turned Minister". Archived from the original on 30 November 2022. Retrieved 9 July 2024.
  2. Rediff (24 December 2019). "Jharkhand polls 2019: Big winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  3. The New Indian Express (29 January 2020). "Jharkhand Cabinet portfolios: CM Soren keeps home; Rameshwar Oraon made finance minister" (in ఇంగ్లీష్). Retrieved 9 July 2024.
  4. India Today (26 August 2019). "Shakeup in Jharkhand Congress: Rameshwar Oraon new PCC chief, state unit gets 5 working presidents" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  5. The Indian Express (26 August 2019). "Congress appoints Rameshwar Oraon as new Jharkhand unit chief" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.