Jump to content

రామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యం

వికీపీడియా నుండి
రామప్ప గుడి

శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో ఉంది. ఇది వరంగల్లుకు నలబై మైళ్ళ దూరంలో ఉంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు రాజు కట్టించాడు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్పకళా నైపుణ్యం వర్ణించనలవికానివి. ఈ కాకతీయ శిల్పకళా చాతుర్యం ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించినట్లుగా, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది[1].రామప్ప గుడి లోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా అమర్చిన పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై చెక్కిన నాట్య భంగిమలు, మృదంగాది వాద్యముల, అనేక రకములైనవాద్యముల రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంది.

పాలంపేట లోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీద మార్థంగికురాండ్ర శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్థంగికురాండ్ర శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది. హనుమ కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి.

రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీద మార్థంగికురాండ్ర శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్థంగికురాండ్ర శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది. హనుమ కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి.జాయన సేనాని భరతముని విరచితమైన నాట్యశాస్ర్తాన్ని ఆంధ్రీకరించాడు.మొదటి అధ్యాయంలో నానావిధ నాట్యకళా రీతుల గురించి వివరించడము జరిగింది.రెండవ ఆద్యాయం అంగనిరూపణ.,. మూడవ ఆద్యాయం మండల లక్షణం, నాలుగవ ఆద్యాయం కరణాంగ హార వివేచానికి సంబంధించింది. ఐదవ ఆద్యాయం దేశి, స్థానిక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ ఉంది. ఆరవ ఆధ్యాయం దేశి పాట, చారీలాస్యాంగగతి లక్షణమనే పేరు గలది. 6--7--8 ఆద్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేశి, నృత్తపద్ధతులన్ని వివరించేదిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటుతున్నాయి.జాయన నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలాగ్రంగా చిత్రింఛాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు ఆద్యాయాలూ దేశి నృత్య సంప్రదాయాలైన పేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాచకం, దండ రాచకం, శివప్రియం, చిందు, కందుకం, ఖాడిక్కం, ఘంటనరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేక జానపద నృత్యాలను వివరించాడు. జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంతోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు. జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది. జాయన 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదికమణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన నృత్తరత్నావళిని 1253–54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈ నాడు ఆంథ్రులు గర్వించగగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణిభూషణం వంటిది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; వరంగల్లు జిల్లాలోని దేవాలయాలు అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు