రాప్తాటి ఓబిరెడ్డి
స్వరూపం
రాప్తాటి ఓబిరెడ్డి | |
---|---|
జననం | రాప్తాటి ఓబిరెడ్డి 1905, జూలై 1 అనంతపురం జిల్లా రాప్తాడు గ్రామం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి |
తండ్రి | చిన్న రోశప్ప |
తల్లి | తిప్పమ్మ |
రాప్తాటి ఓబిరెడ్డి [1]అనంతపురం జిల్లాకు చెందిన అజ్ఞాతకవి. చిత్రకవిత్వం చెప్పడంలో దిట్ట. ఒక మారుమూల కుగ్రామంలో బడి పెట్టుకొని, పేదపిల్లలకు పాఠం చెప్తూ, తీరిక సమయంలో తోచిన విషయాలపై కవిత్వం చెప్తూ మరోప్రక్క వ్యవసాయంచేస్తూ జీవనం సాగించిన నిరాడంబర జీవి ఇతడు. శతకాలు, హరికథలు, నాటకాలు, పద్యకావ్యాలు చాలా వ్రాశాడు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలే. ఖడ్గబంధ కందము, శైలబంధకందము, రతిబంధము, ఉత్పల పాద గర్భకందము మొదలైన చిత్రబంధకవిత్వం, అంత్యప్రాస, ద్విప్రాస, త్రిప్రాస,లటానుప్రాస మొదలైన శబ్దాలంకారాలు ఇతని రచనలలో అడుగడుగునా కనిపిస్తుంది.
రచనలు
[మార్చు]- భక్త శ్రీ సిరియాళ (హరికథ)
- భీమసౌగంధిక (నాటకము)
- నిర్యోష్ట కృష్ణశతకము
- రాప్తాటి నిర్వచన రామాయణము
- శబ్దాలంకార శతకము
రచనల నుండి ఉదాహరణలు
[మార్చు]- నక్షత్రనేత! ఖద్యో
- తాక్షా! రణరంగదక్ష! ఆశ్రితరక్షా!
- రాక్షస గజహర్యక్షా!
- అక్షీణ దయా కవితకటాక్షా! కృష్ణా!
- (కృష్ణ శతకము నుండి)
- ఏరా! సాగర! యింతనీకు పొగరా! మీరీతి నాయనతిన్
- మేరంజాలితివా! దురాత్మ! కుటిలా! మిథ్యానులాపా! నినున్
- ఘోరప్రక్రియ ఖండఖండములుగా, గోయించి భూతాళికా
- హారం బౌ నటులే నొనర్తు ననగా - నాతండు భీతాత్ముఁడై
- (రాప్తాటి నిర్వచన రామాయణములో కౌసల్యా పరిణయ ఘట్టము నుండి)
- ఏమేమీ! చిరుతొండనంబి సతతం - బీరీతి సద్భక్తులన్
- ఆమోదంబు జెలంగ, దృప్తిపడ - నాహారంబు లర్పించునే?
- ఈ మాడ్కిన్ జెలువొందు త్యాగపరు నెందేనిన్ గనుగొంటిమే?
- స్వామీ! నా మదిఁగోర్కె గల్గెను భవద్భక్తున్ బరీక్షింపగన్
- (భక్త శ్రీసిరియాళ నుండి)
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర - మూడవ సంపుటి - కల్లూరు అహోబలరావు