రాధా మాధవ్ ధామ్
రాధా మాధవ్ ధామ్ | |
---|---|
బర్సానా ధామ్ | |
![]() | |
భౌగోళికం | |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | టెక్సాస్ |
స్థలం | ఆస్టిన్ |
సంస్కృతి | |
దైవం | రాధా కృష్ణుడు |
చరిత్ర, నిర్వహణ | |
స్థాపితం | 1990 |
రాధా మాధవ్ ధామ్ (బర్సానా ధామ్)[1][2][3] అమెరికా, టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు దక్షిణంగా ఉన్న హిందూ దేవాలయం. 200 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంగణంలో ఉన్న హిందూ దేవాలయం, ఆశ్రమ సముదాయమిది.[4][5] టెక్సాస్‌లోనే అతి పురాతన ఈ హిందూ దేవాలయం[6] ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద దేవాలయం.[7]
రాధా మాధవ్ ధామ్ అనేది లాభాపేక్షలేని, మతపరమైన, విద్యాపరమైన, స్వచ్ఛంద సంస్థ[8] 2014 ఏప్రిల్ లో ఎకనామిక్ గ్రోత్ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించిన నెల్సన్ మండేలా శాంతి అవార్డును గెలుచుకున్న జెకెపి ఎడ్యుకేషన్‌తో సహా అనేక ధార్మిక విద్యా కార్యక్రమాలలో ఈ దేవాలయం భాగస్వామ్యం పొందింది.[9][10]
చరిత్ర
[మార్చు]1970లలో స్థాపించబడిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ డివైన్ లవ్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ కేంద్రంగా రాధా మాధవ్ ధామ్ (బర్సానా ధామ్) 1990లో స్థాపించబడింది. ఈ ప్రాంతంలో రాధా, కృష్ణులు 5,000 సంవత్సరాల క్రితం కనిపించారని ఇక్కడి హిందువులు నమ్ముతారు.[11][12] [13] ఈ దేవాలయం అమెరికాలో పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.[14] రాధా మాధవ్ ధామ్‌లోని ప్రాంతాలు ధ్యానం చేసుకోవడానికి వీలుగా అభివృద్ధి చేయబడ్డాయి.[13][15] గోవర్ధన్, రాధా కుండ్, ప్రేమ్ సరోవర్, శ్యామ్ కుటీ, ఇతర ప్రాంతాలు రాధా మాధవ్ ధామ్‌లో ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ప్రాంతంలోని కాళింది అనే సహజ ప్రవాహం బృందాబన్ లోని యమునా నదిని సూచిస్తోంది.[16]
స్వచ్ఛంద కార్యకలాపాలు
[మార్చు]రాధా మాధవ్ ధామ్ ఆస్టిన్ ఏరియా ఇంటర్‌రిలిజియస్ మినిస్ట్రీస్,[17][18][19] హిందూ-జూయిష్ సాలిడారిటీ డే,[20][21][22] పిబిఎస్ మెనీ వాయిస్‌ల ప్రాజెక్ట్ వంటి అంతర్-మత సేవల్లో పాల్గొంటారు.[23] 1993లో ప్రపంచ మతాల పార్లమెంట్‌లో హిందూ మతానికి ప్రాతినిధ్యంలో[24] భాగంగా సంస్థ ఎంపిక చేయబడింది.
మూలాలు
[మార్చు]- ↑ a Dham Blooms in Texas Archived ఆగస్టు 17, 2016 at the Wayback Machine
- ↑ "Hindu Temple Opens in Texas", October 14, 1995. The Washington Post. Section: METRO
- ↑ Kurien, P.A. 2007. A Place at the Multicultural Table: The Development of an American Hinduism. NJ: Rutgers University Press.
- ↑ Ricci, J. Yoga Escapes: A Yoga Journal Guide to the Best Places to Relax, Reflect, and Renew. Celestial Arts.
- ↑ Walker, J.K. 2007. The Concise Guide to Today's Religions and Spirituality. Harvest House Publishers.
- ↑ India Today International. Volume 1, Issues 1-8. Living Media International. 2002.
- ↑ Gaines, David (September 11, 2020). "I Climbed Up Friday Mountain and Down Barsana Hill". The Wall Street Journal. The Wall Street Journal. Retrieved January 12, 2021.
- ↑ Ludwig, M. March 9, 2002. "Houses of worship". Austin American-Statesman (TX)
- ↑ Nelson Mandela Peace Award bestowed on the charitable organization supported by Austin based Hindu temple Archived ఏప్రిల్ 27, 2014 at the Wayback Machine. April 24, 2014. Voice of Asia
- ↑ Austin-based Hindu Temple gets Nelson Mandela Peace Award. April 23, 2014. India Herald.
- ↑ Harvard Plurism Project Archived మార్చి 4, 2016 at the Wayback Machine
- ↑ Perks, K.S.L. August 24, 1997. Hindus honor supreme deity with festival. Austin American-Statesman
- ↑ 13.0 13.1 Prothero, S.R. 2006. A nation of religions: the politics of pluralism in multireligious America. University of North Carolina Press
- ↑ Kettmann, M. 2009. "The Salt Lick, a Hindu Temple, Disc Golf, The Horseshoe, and Texas Wine" Archived ఆగస్టు 19, 2016 at the Wayback Machine. Santa Barbara Independent
- ↑ Journal of Vaishnava Studies, Volume 13, Issues 1-2. 2004.
- ↑ Ciment, J. 2001. Encyclopedia of American Immigration. Michigan: M. E. Sharpe.
- ↑ "Barsana Dham Hindu Temple" Archived మార్చి 3, 2016 at the Wayback Machine. The Pluralism Project at Harvard University.
- ↑ "Mayor Watson declares Radha Rani Rath Yatra Day in Austin" Archived జనవరి 26, 2013 at Archive.today, November 17, 2001. India Herald
- ↑ Maze, H. November 24, 2002. Interreligious organization, volunteers help give thanks" Archived మార్చి 16, 2012 at the Wayback Machine. News 8 Austin
- ↑ Duke, M.C. January 13, 2011. "Local event promotes Hindu-Jewish solidarity" Archived జూలై 11, 2012 at Archive.today. Jewish Herald-Voice
- ↑ Giri, Kalyani. January 17, 2011. "Building Bridges Between World Cultures". Indo American-News
- ↑ "More pictures from the 1st Annual Hindu-Jewish Solidarity Day" Archived మార్చి 3, 2016 at the Wayback Machine. 2011.
- ↑ "Collecting Many Voices" Archived మే 9, 2016 at the Wayback Machine. 2004.
- ↑ Nevans-Pederson, M. November 16, 2002. "Seeking Divine unity through Hinduism". The Telegraph-Herald