Jump to content

రాజేష్ గార్గ్

వికీపీడియా నుండి
రాజేష్ గార్గ్

పదవీ కాలం
2013 – 2015
ముందు జై భగవాన్ అగర్వాల్
తరువాత విజేందర్ గుప్తా
నియోజకవర్గం రోహిణి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజేష్ గార్గ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రోహిణి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజేష్ గార్గ్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రోహిణి శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జై భగవాన్ అగర్వాల్ పై 1,872 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని ఆరోపించిన రాజేష్ గార్గ్‌ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 2015 మార్చి 16న సస్పెండ్ చేసింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "AAP legislator travels to Assembly on e-rickshaw" (in Indian English). The Hindu. 2 January 2014. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  2. "Delhi assembly elections: Why contest is on a knife's edge in this crime-hit middle-class segment". The Times of India. 20 January 2020. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  3. "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  4. "AAP suspends former MLA Rajesh Garg" (in Indian English). The Hindu. 16 March 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
  5. "Aam Aadmi Party suspends Rohini MLA Rajesh Garg for 'anti-party activities'" (in ఇంగ్లీష్). The Indian Express. 17 March 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.