Jump to content

రాజేశ్వరి సచ్‌దేవ్

వికీపీడియా నుండి
రాజేశ్వరి సచ్‌దేవ్
రాజేశ్వరి సచ్‌దేవ్ (2018)
జననం
రాజ్ కౌర్ సచ్‌దేవ్

(1975-04-14) 1975 ఏప్రిల్ 14 (వయసు 49)
క్రియాశీల సంవత్సరాలు1991 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పురస్కారాలు1997లో సర్దారీ బేగం సినిమాకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు

రాజేశ్వరి సచ్‌దేవ్ మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టీవి, సినిమా నటి. 1996లో శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన సర్దారీ బేగం సినిమాలోని పాత్రకు, ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

సచ్‌దేవ్ 1994 నుండి 2001 వరకు అన్నూ కపూర్‌తో కలిసి జీ టీవీలో అంతాక్షరి అనే సంగీత కార్యక్రమానికి సహ-హోస్ట్ చేసింది. 2005లో, తన భర్త వరుణ్ బడోలాతో కలిసి, నాచ్ బలియే అనే రియాలిటీ టీవీ డ్యాన్స్ పోటీ షోలో పాల్గొన్నది.[1] రిహాయీ అనే క్రైమ్ టీవీ సిరీసులో కార్యకర్త పాత్రను పోషించింది.[2]

జననం, విద్య

[మార్చు]
2012లో భర్త వరుణ్ బడోలాతో రాజేశ్వరి సచ్‌దేవ్
కామెడీ సర్కస్ 300 ఎపిసోడ్‌ల బాష్‌లో రాజేశ్వరి సచ్‌దేవ్

రాజేశ్వరి 1975, ఏప్రిల్ 14న జన్మించింది.[3]

ముంబైలోని గురునానక్ ఖల్సా కళాశాల (కింగ్స్ సర్కిల్) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, తరువాత ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ తో కలిసి నాటకాలు వేస్తూ తన వృత్తిని ప్రారంభించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2004లో వరుణ్ బడోలాతో వివాహం జరిగింది.

టెలివిజన్ కార్యక్రమాలు

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర ఇతర వివరాలు
1997 మార్గరీట మార్గరీట ప్రధాన పాత్ర
1997–1998 ఓం నమః శివాయ రాతి
2004 రిహయీ మాధవి
2005 ఫిర్ సె టెలివిజన్ చిత్రం[4]
నాచ్ బలియే 1 పోటీదారు
2006–2007 జీ భెంజీ[5]
2007–2008 కె ఫర్ కిషోర్ హోస్ట్
2014–2015 లౌట్ ఆవో త్రిష లావణ్య స్వైక గరేవాల్
2014 సంవిధాన్ రాజకుమారి అమృత్ కౌర్
2015–2016 బాలికా వధూ మంగళా దేవి
2017 పీష్వా బాజీరావు రాధాబాయి
2018 దిల్ హాయ్ తో హై మమతా నూన్
2020–2021 షాదీ ముబారక్ కుసుమ్ కొఠారి

మూలాలు

[మార్చు]
  1. "Rajeshwari Sachdev joins Bhagyashree for a TV show - Times of India". The Times of India.
  2. "'I'll have to get pregnant' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-16.
  3. "हिंदी खबर, Latest News in Hindi, हिंदी समाचार, ताजा खबर". Patrika News. Archived from the original on 26 April 2021.
  4. "SaharaOne bags Rapa Awards for telefilm 'Phir Se'". Indian Television Dot Com. April 28, 2005.
  5. "The Sunday Tribune - Spectrum". www.tribuneindia.com.

బయటి లింకులు

[మార్చు]