Jump to content

రాజేంద్ర పాటిల్

వికీపీడియా నుండి
రాజేంద్ర పాటిల్ యాద్రవ్కర్
రాజేంద్ర పాటిల్


ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య, ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్, కల్చర్ అఫైర్స్ శాఖల సహాయమంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 27 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
అక్టోబర్ 2019
ముందు ఉల్లాస్ పాటిల్
నియోజకవర్గం షిరోల్

వ్యక్తిగత వివరాలు

రాజేంద్ర పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శిరోల్ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ, వైద్య విద్య, ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్‌టైల్, కల్చర్ అఫైర్స్ శాఖల సహాయమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

విద్యావేత్తగా

[మార్చు]

రాజేంద్ర పాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శరద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యాద్రవ్‌లోని పాలిటెక్నిక్, జైనాపూర్‌లోని శరద్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లాంటి విద్యా సంస్థలను స్థాపించాడు.

ఇతర పదవులు

[మార్చు]
  1. అధ్యక్షుడు - ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ కో-ఆప్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్
  2. చైర్మన్ - యాద్రవ్ కో-ఆప్ బ్యాంక్ లిమిటెడ్
  3. చైర్మన్ - శరద్ కో-ఆప్ షుగర్ ఫ్యాక్టరీ, లిమిటెడ్,
  4. చైర్మన్ -శ్రీ శ్యాంరావ్ పాటిల్ యాద్రావ్కర్ ఛారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్
  5. డైరెక్టర్ - కొల్హాపూర్ జిల్లా కో-ఆప్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్
  6. డైరెక్టర్ - కొల్హాపూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్
  7. డైరెక్టర్ - పార్వతి కో-ఆప్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్

రాజకీయ జీవితం

[మార్చు]

రాజేంద్ర పాటిల్ 26 ఏళ్ల వయసులో జైసింగ్‌పూర్ మున్సిపాలిటీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 32 ఏళ్ల వయసులో శరద్ షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్‌గా నియమితుడై ఆయన నాయకత్వంలో శరద్‌ షుగర్‌ ఫ్యాక్టరీ ఐదేళ్లలో రుణమాఫీ అయ్యే విధంగా కృషి చేశాడు.

రాజకీయ పదవులు

[మార్చు]
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు [2][3][4]
  • 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రి [5]
  • 2019: మహారాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్, ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్‌టైల్, కల్చర్ అఫైర్స్ కొరకు రాష్ట్ర మంత్రి [6] [7]

మూలాలు

[మార్చు]
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Shirol Vidhan Sabha constituency result 2019".
  3. "Independents to watch out for in Maharashtra: 8 BJP-Sena rebels, 1 maverick" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2019. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
  4. "Sitting and previous MLAs from Shirol Assembly Constituency".
  5. "Maharashtra Cabinet Expansion".
  6. "Maharashtra Cabinet portfolios announced".
  7. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".