రాజు మహిషి
రాజు మహిషి 1968లో రావిశాస్త్రి రచించిన నవల. ఈ నవల ఒక అసంపూర్ణ నవల. ఇందులో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రేమ, దైవం, మనిషి, ధర్మం, సత్యం, మానవ జీవితంలో ఉండే ఒడిదుడుకులనూ ప్రధాన పాత్రల రూపంలో చిత్రికరించారు. ఈ నవలపై శ్రీ శ్రీ స్పందిస్తూ ఇరవైవ శతబ్దపు క్లాసిక్ నవలగా అవుతుందని పేర్కొన్నాడు.
నవల నేపథ్యం
[మార్చు]ఈ నవల 1968లో రాచకొండ విశ్వనాధశాస్త్రి రచించాడు. ఇతను రచించిన అసంపూర్ణ నవలలో ఇది ఒకటి.[1]
కథ సారాంశం
[మార్చు]కథ వివరణ, పాత్రలు
[మార్చు]ఈ నవలలో ఆధునిక సమాజంలో జరిగే కుట్రలూ, దగా, మోసం, ఎన్నికలు, కోర్టులు, రాజకీయ పార్టీల రంకూలు ఒకటేమిటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఇందులో కనిపిస్తాయి. ఇందులో ప్రదానంగా సమాజంలో ఉండే ప్రేమ, దైవం, మనిషి, ధర్మం, సత్యం, మానవ జీవితంలో ఉండే ఒడిదుడుకులు చిత్రికరించారు. ముఖ్యంగా ఇందులోని పాత్రలూ ఛైర్మన్ సేనరావు, మందుల భీముడు, రంగారావు, ప్రసాద్, జమీందారు పురుషోత్తమరావు, గేదెల రాజమ్మ తదితరుల పాత్రలు ఇందులో ప్రధాన పాత్రలు.[1]
శైలి శిల్పం
[మార్చు]రాజు మహిషి నవలలోని వర్ణన, శైలి, భాష మొదలైనవి అంతకుముందు తెలుగు సాహిత్యంలో ఎక్కడా లేనివని, చాలా శక్తివంతమైనవని అక్కిరాజు ఉమాపతిరావు పేర్కోన్నాడు.[1]
స్పందన
[మార్చు]ఈ నవల ఆ కాలంలో విమర్శకుల ప్రశంశలనూ అందుకుంది. ఈ నవలపై శ్రీ శ్రీ తన స్పందననూ తెలియజేస్తూ తెలుగు సాహిత్యంలో సంతృప్తికరమైన కవిత్వం వచ్చినట్లూ, ఇది ఇరవై శతబ్దపు క్లాసిక్ నవలగా ఉంటుందని మెచ్చాకున్నాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 అక్కిరాజు, రమాపతి రావు (1975). తెలుగు నవల. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. pp. 28–29. Retrieved 1 June 2018.