రాజదేవి దేవాలయం
రాజదేవి దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 26°32′26″N 86°44′55″E / 26.54056°N 86.74861°E |
దేశం | నేపాల్ |
రాష్ట్రం | సాగరమాత |
జిల్లా | సప్తరి జిల్లా |
ప్రదేశం | రాజదేవి టోలే, రాజ్బీరాజ్ |
ఎత్తు | 76 మీ. (249 అ.) |
సంస్కృతి | |
దైవం | రాజదేవి దేవి |
ముఖ్యమైన పర్వాలు | దసరా |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | పగోడా శైలి |
దేవాలయాల సంఖ్య | 1 |
శాసనాలు | శిలా శాసనాలు |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | Unknown; earliest reference in the 1097-98.[1] |
రాజదేవి దేవాలయం, తూర్పు నేపాల్‌లోని ఒక హిందూ దేవాలయం, శక్తి పీఠం. రాజదేవి ఇక్కడి ప్రధాన దేవత. ఈ దేవాలయం సప్తరి, రాజ్‌బీరాజ్ లోని రాజ్‌దేవి తోలేలో ఉంది. నేపాల్, భారతీయ యాత్రికులకు ఈ దేవాలయం ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి బడా దశాయిన్ ప్రజలు వస్తుంటారు.[2] దసరా సమయంలో ఇక్కడ కొన్ని వేల మేకలను బలి ఇస్తారు.[3]
చరిత్ర
[మార్చు]ఈ దేవాలయం అక్కడి స్థానిక, పొరుగు ప్రాంతాలకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగివున్న దేవాలయం. ఇక్కడి రాజదేవి విగ్రహం 1000 సంవత్సరాల క్రితం కనుగొనబడి, ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠంచబడింది. ప్రస్తుతమున్న దేవాలయ నిర్మాణం 1990వ దశకంలో పునర్నిర్మించబడింది.[3] ఇది జనక రాజు సోదరుడు కుశధ్వజ రాజు కుటుంబ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. మక్వాన్‌పూర్ సెన్స్ ద్వారా 14వ శతాబ్దంలో ఈ దేవాలయం పునరుద్ధరించబడింది.
తీర్థయాత్ర
[మార్చు]ప్రతి సంవత్సరం నేపాల్, భారతదేశం, ఇతర దేశాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి రాజదేవి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. దసరా పండుగ సమయంలో ఎక్కువమంది భక్తులు వస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ Dāsa, Harikāntalāla (2003). Saptarī Jillākā pramukha sāṃskr̥tika sthalaharu : eka adhyayana : laghuanusandhānakārya (1. saṃskaraṇa. ed.). Kāṭhamāḍauṃ: Nepāla Rājakīya Prajñā-Pratishṭhāna. p. 120. ISBN 9789993350569.
- ↑ "Maha Asthami observed today". ekantipur.com. Archived from the original on 2014-11-11. Retrieved 2021-12-09.
- ↑ 3.0 3.1 "The Goddess with Severed Head". Boss Nepal. Archived from the original on 2016-01-13. Retrieved 2021-12-09.