Jump to content

రాగిణి (నటి)

వికీపీడియా నుండి
రాగిణి
రాగిణి
జననం(1937-03-27)1937 మార్చి 27
తిరువనంతపురం, ట్రావన్కోర్, కేరళ
మరణం1976
మరణ కారణంబ్రెస్ట్ క్యాన్సర్
వృత్తినటి, నృత్యకళాకారిణి
జీవిత భాగస్వామిమాధవన్ థంపి
పిల్లలులక్ష్మి, ప్రియ
తల్లిదండ్రులు
  • గోపాల పిళ్లై (తండ్రి)
  • సరస్వతమ్మ (తల్లి)

రాగిణి భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో చివరి సోదరీమణి.

విశేషాలు

[మార్చు]

ఈమె 1937, మార్చి 27న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అనేక నాటకాలలో కూడా నటించింది. ఈమె అక్కలులలిత, పద్మినిలు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది[1]. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె మాధవన్ థంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మి, ప్రియ అనే కుమార్తెలు కలిగారు. ఈమె భర్త ఈమెను వదిలి 1974లో అమెరికా వెళ్ళాడు. కానీ ఈమె కేన్సర్‌ బారిన పడ్డ తరువాత తిరిగి వచ్చాడు. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ 1976లో మృతిచిందింది.

తెలుగు సినిమాల జాబితా

[మార్చు]

లలిత నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1952 సింగారి టి.ఆర్.రామచంద్రన్, లలిత, పద్మిని
1955 అంతా ఇంతే శివాజీ గణేశన్, లలిత, పద్మిని ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి ఎన్.టి.రామారావు, లలిత, పద్మిని డి.యోగానంద్
1957 వరుడు కావాలి జగ్గయ్య, పి.భానుమతి,అమర్‌నాథ్ పి.ఎస్.రామకృష్ణారావు
1958 పులి చేసిన పెళ్లి సత్యం, ముత్తయ్య పి.భాస్కరన్
1961 స్త్రీ జీవితం శివాజీ గణేశన్,పద్మిని పి.భాస్కరన్
1963 రాణీ సంయుక్త ఎం.జి.రామచంద్రన్, పద్మిని డి.యోగానంద్
1964 వీర సేనాపతి ప్రేమ్ నవాజ్, తిక్కురిస్సి సుకుమారన్ నాయర్ జి.విశ్వనాథం
1965 చలాకీ పిల్ల శ్రీరాం, టి.ఆర్.రామచంద్రన్, తంగవేలు కె. సోము
1969 రాజ్యకాంక్ష జెమినీ గణేశన్, పద్మిని జి.విశ్వనాథం
1974 కోటివిద్యలు కూటికొరకే నగేష్, లక్ష్మి కె.బాలచందర్

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]