రాగిణి నంద్వాని
రాగిణి నంద్వాని | |
---|---|
జననం | షీనా నంద్వాని 1991 సెప్టెంబరు 4 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
రాగిణి నంద్వాని, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి. మిస్సెస్ కౌశిక్ కి పాంచ్ బహుయిన్ అనే హిందీ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించి గుర్తింపు పొందింది.[1] 2013లో వచ్చిన డెహ్రాడూన్ డైరీ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2013లో ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన తలైవా అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2]
జననం
[మార్చు]రాగిణి నంద్వాని 1991, సెప్టెంబరు 4న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జన్మించింది.
నటనారంగం
[మార్చు]యే మేరీ లైఫ్ హై, థోడి ఖుషీ థోడే ఘమ్, సిఐడి వంటి టెలివిజన్ సీరియళ్ళలో చిన్నచిన్న సహాయక పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 2011లో, జీ టీవీలో వచ్చిన మిస్సెస్ కౌశిక్ కి పాంచ్ బహుయిన్ అనే డైలీ సీరియల్ తో వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్ డైరీ అనే హిందీ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. సినిమా పరాజయం పాలైనప్పటికీ, నంద్వానికి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. విజయ్ సరసన తలైవా సినిమాలో నటించిన రాగిణికి ఆ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.[3]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2005 | అయోధ్య | జరీనా | తమిళం | |
2013 | డెహ్రాడూన్ డైరీ | ప్రీతి ఠాకూర్ | హిందీ | |
తలైవా | గౌరీ | తమిళం | ||
కృపా స్వామించి | మరాఠీ | అతిధి పాత్ర | ||
2014 | పెరుచాజి | జెస్సీ | మలయాళం | మలయాళ అరంగేట్రం |
2016 | సిద్ధార్థ | సహస్త్ర | తెలుగు | |
2017 | హదియ్యా | సారా | మలయాళం |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఛానల్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2005 | యే మేరీ లైఫ్ హై | కోయెనా | సోనీ టీవీ | సపోర్టింగ్ రోల్ |
2006 | తోడి ఖుషీ తోడే ఘమ్ | హేతల్ షా | సోనీ టీవీ | సపోర్టింగ్ రోల్ |
2007 | సిఐడి | సోనీ టీవీ | ఎపిసోడిక్ రోల్ (ది కేస్ ఆఫ్ ది మిస్సింగ్ బ్రైడ్) ఎపి 462 | |
2011-2012 | మిస్సెస్ కౌశిక్ కి పాంచ్ బహుయేన్ | లవ్లీ త్యాగి | జీ టీవీ | ప్రధాన పాత్ర. అలాగే కొన్ని ఎపిసోడ్లలో దులారిగా ద్విపాత్రాభినయం. వింధ్య తివారీని స్థానంలో |
2011 | స రే గ మ పా ఎల్'ఇల్ చాంప్స్ 2011 | లవ్లీ త్యాగి | జీ టీవీ | అతిథి |
2016 | భక్తోన్ కీ భక్తి మే శక్తి | లైఫ్ ఓకే | ||
2016-2017 | సూపర్‌కాప్స్ వర్సెస్ సూపర్‌విలన్స్ | యువరాణి అడోనియా | లైఫ్ ఓకే | ప్రధాన పాత్ర |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | కార్యక్రమం | ఫలితం |
---|---|---|---|---|
2011 | జీ రిష్టే అవార్డులు | పాపులర్ జోడి (ముకుల్ హరీష్‌తో పాటు) | మిస్సెస్ కౌశిక్ కి పాంచ్ బహుయేన్ | గెలుపు |
ఫెవరెట్ నయీ జోడి | ||||
ఫెవరెట్ భాబీ | ప్రతిపాదించబడింది | |||
ఫెవరెట్ సాస్ బహు | గెలుపు | |||
ఫెవరెట్ నయా సదస్య (నటి) | ||||
జనాదరణ పొందిన ముఖం (నటి) | ప్రతిపాదించబడింది |