రాకేష్ రాథోడ్
రాకేష్ రాథోడ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
ముందు | రాజేష్ వర్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సీతాపూర్ | ||
పదవీ కాలం మార్చి 2017 – మార్చి 2022 | |||
ముందు | రాధే శ్యామ్ జైసావల్ | ||
తరువాత | రాకేష్ రాథోర్ | ||
నియోజకవర్గం | సీతాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సీతాపూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | 1964 డిసెంబరు 4||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాకేష్ రాథోడ్ (జననం 4 డిసెంబర్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతాపూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాకేష్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017 శాసనసభ ఎన్నికలలో సీతాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి రాధేశ్యామ్ జైస్వాల్‌పై 24,839 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2022లో కాంగ్రెస్‌లో చేరాడు.[3]
రాకేష్ రాథోడ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజేష్ వర్మపై 89,641 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
అత్యాచార ఆరోపణలు & అరెస్టు
[మార్చు]రాకేష్ రాథోడ్ నాలుగు సంవత్సరాలుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన దీనిపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి, లొంగిపోవాలని కోరింది. అంతకుముందు సీతాపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జనవరి 23న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆయన తన ఇంట్లో విలేకరుల సమావేశం మధ్యలో అత్యాచారం కేసులో జనవరి 30న రాకేష్ రాథోడ్‌ను అరెస్టు చేశారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "SP founding member, former BJP MLA join Congress in Lucknow" (in Indian English). The Hindu. 8 June 2023. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
- ↑ "Lok Sabha 2024 Election Results: Sitapur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 4 June 2024. Retrieved 19 February 2025.
- ↑ "Congress's Sitapur MP held for rape on pretext of marriage". The Times of India. 31 January 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.