Jump to content

రవి చౌధరి

వికీపీడియా నుండి

రవి చౌధరి (Eng:Ravi Chaudhary) భారత సంతతికి చెందిన రక్షణ నిపుణుడు[1], ఇతను అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్‌ స్టాఫ్‌ అసైన్‌మెంట్లు వంటి వైవిధ్యమైన అంశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సి–17 పైలట్‌గా అఫ్గానిస్తాన్, ఇరాక్‌ యుద్ధ విధుల్లో పాలుపంచుకున్నారు. సిస్టమ్స్‌ ఇంజినీర్‌ కూడా అయిన చౌధరి నాసాలోనూ పనిచేశారు[2].

కుటుంబ నేపథ్యం

[మార్చు]

రవి తల్లిదండ్రులు భారతదేశంలోని హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుండి అమెరికాకు వలస వచ్చారు, ఇతని తాతలు, మేజర్ ప్రతాప్ సింగ్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఫెరూ సింగ్ భారత సైన్యం కోసం రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడారు, ఇంకా ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో పనిచేశారు, అతని తండ్రి, డాక్టర్ సురేంద్ర పాల్ సింగ్ చౌధరి, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌లో రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్.  చౌదరి తల్లి, రాజ్ మోహిని చౌధరి, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు, ఈమె సౌత్ ఆసియన్ కమ్యూనిటీ కోసం వాదించే ఒక సంస్థ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు, సోదరుడు స్టేట్ సెనేటర్ సత్వీర్ చౌదరి మిన్నెసోటా చరిత్రలో మొదటి ఆసియా అమెరికన్ శాసనసభ్యుడిగా పనిచేశారు[3]. సోదరి లయోలా విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర ప్రొఫెసర్.

విద్య

[మార్చు]
  • జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంజార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుండి 2011 - 2017 సంవత్సరంలో డాక్టరేట్ ఆఫ్ లిబరల్ స్టడీస్, ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ & ఇన్నోవేషన్డాక్టరేట్ ఆఫ్ లిబరల్ స్టడీస్, ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ & ఇన్నోవేషన్.
  • సెయింట్ మేరీస్ యూనివర్సిటీసెయింట్ మేరీస్ యూనివర్సిటీ నుండి 1997 - 1999 సంవత్సరంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS), ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (NASA గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫెలోషిప్) మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS), ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (NASA గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫెలోషిప్)
  • యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ అకాడమీయునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి 1989 - 1993 సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS), ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS), ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్
  • ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూట్, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూట్, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుండి ప్రజాస్వామ్య సమాజానికి నాయకత్వంప్రజాస్వామ్య సమాజానికి నాయకత్వం
  • USAF ఎయిర్ కమాండ్, స్టాఫ్ కాలేజ్USAF ఎయిర్ కమాండ్, స్టాఫ్ కాలేజ్ నుండి 2005 - 2006 సంవత్సరంలో మిలిటరీ ఆపరేషనల్ ఆర్ట్, సైన్స్/స్టడీస్మాస్టర్స్, మిలిటరీ ఆపరేషనల్ ఆర్ట్, సైన్స్/స్టడీస్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

వృత్తి

[మార్చు]

రవి 1993–2015 నుంచి 22 ఏళ్లపాటు అమెరికా ఎయిర్‌ఫోర్స్‌‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తో రీజియన్స్, సెంటర్ ఆపరేషన్స్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. FAAలో చేరడానికి ముందు, రవి ఎయిర్ ఫోర్స్ అధికారి, కమాండర్, ఎయిర్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్, జాయింట్ బేస్ ఆండ్రూస్, మేరీల్యాండ్‌కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు, యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు[4]. ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులపై అధ్యక్షుడి (ఒబామా) సలహా సంఘం సభ్యుడిగా పనిచేశాడు. 2023 మార్చి నెలలో అమెరికా రక్షణశాఖలో వైమానిక దళానికి సహాయ మంత్రిగా రవినియామకానికి సెనెట్‌ ఆమోదం తెలిపింది[5][1].

మూలాలు

[మార్చు]
  1. "అమెరికా సహాయమంత్రిగా రవి చౌదరి". EENADU. Retrieved 2023-03-17.
  2. Cohen, Rachel (2021-10-14). "Biden nominates former FAA official Ravi Chaudhary as Air Force installations boss". Air Force Times (in ఇంగ్లీష్). Retrieved 2023-03-17.
  3. "Satveer Chaudhary". Ballotpedia (in ఇంగ్లీష్). Retrieved 2023-03-17.
  4. "#MyAAPIStory: Ravi Chaudhary". whitehouse.gov (in ఇంగ్లీష్). 2015-06-19. Retrieved 2023-03-17.
  5. Telugu, TV9 (2023-03-16). "Ravi Chaudhary: భారత సంతతి వ్యక్తికి అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యత.. అమెరికా సెనెట్ గ్రీన్ సిగ్నల్". TV9 Telugu. Retrieved 2023-03-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రవి_చౌధరి&oldid=4075551" నుండి వెలికితీశారు