రమ్యా హరిదాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమ్య హరిదాస్‌

లోక్‌సభ సభ్యురాలు
పదవీ కాలం
23 మే 2019 – 3 జూన్ 2024
ముందు పీకే బిజూ
తరువాత కె. రాధాకృష్ణన్
నియోజకవర్గం అలత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం 11 జనవరి 1986
కోజికోడ్, కేరళ,భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పి. హరిదాసు
రాధా
వృత్తి రాజకీయ నాయకురాలు
సామజిక సేవకురాలు

రమ్యా హరిదాస్‌ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అలత్తూర్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది.[1] రమ్య 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కేరళ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీగా, 32 ఏళ్ల తరువాత గెలిచిన మహిళా దళిత ఎంపీగా రికార్డు సృష్టించింది.

రాజకీయ జీవితం

[మార్చు]

రాహుల్‌గాంధీ నేతృత్వంలో 2010లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ యువ నాయకత్వం కోసం సాగించిన వెతుకులాటలో మంచి వాగ్ధాటి, విషయాలపై అవగాహన కలిగి ఉండడంతో రమ్య హరిదాస్‌ను రాహుల్‌ గాంధీ తెరపైకి తెచ్చాడు. మహిళా కాంగ్రెస్‌ నాయకురాలైన ఆమె తల్లి రాధ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన రమ్య పదేళ్ళపాటు యువజన కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేస్తూ 2010లో కోజికోడ్‌ యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయింది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొంతమంది యువతని ఎంపిక చేసి వారికి విదేశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రమ్య భారతదేశం తరపున జపాన్, మలేసియా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో జరిగిన వరల్డ్‌ యూత్‌ కార్యక్రమాలకి వెళ్లిన పది మంది ప్రతినిధుల్లో ఆమె కూడా పాల్గొన్నారు. రమ్య 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అలత్తూర్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి పీకేబిజూ పై 1,58,968 ఓట్ల మెజారిటీతో గెలిచింది.[2]

రమ్యా హరిదాస్‌ను పార్లమెంట్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను 2023 డిసెంబరు 14న శీతాకాల సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి సస్పెండ్ చేశారు.[3]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి (29 May 2019). "పేదరికం నుంచి పార్లమెంట్‌కు". Sakshi. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
  2. The New Indian Express. "Now, Ramya sings a victory song". The New Indian Express. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
  3. Andhrajyothy (14 December 2023). "14 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.