Jump to content

రమ్మీ

వికీపీడియా నుండి
రమ్మీ
పురోగతిలో రమ్మీ 500 యొక్క ఒక గేమ్.
Originయునైటెడ్ స్టేట్స్
Alternative name(s)సాయి రమ్మీ, ప్రామాణిక రమ్మీ, ప్రాథమిక రమ్మీ, సాంప్రదాయ రమ్మీ
Typeసరిపోలిక
Players2+
Age rangeఅందరూ
Cards(52) ఆట రకం మారుతూ ఉంటుంది
Deckఫ్రెంచ్ డెక్
Playసవ్యముగా (క్లాక్‌వైజ్)
Card rank (highest to lowest)A K Q J 10 9 8 7 6 5 4 3 2 (A) ఆట రకాన్ని బట్టి మారుతుంది
Playing time15 నిమిషాలు.
Random chanceమధ్యస్థం
Related games
కింగ్స్ కోర్ట్, కాన్‌క్యూయిఎన్, మహ్‌జంగ్, డీస్మోకీ

అదే ర్యాంక్ లేదా క్రమం, అదే జోడి యొక్క మ్యాచింగ్ కార్డుల ఆధారంగా ఆడే ఇటువంటి వాటిలో గుర్తింపు పొందిన మ్యాచింగ్ కార్డ్ గేమ్స్ యొక్క ఒక గ్రూప్ రమ్మీ.

భారతీయ రమ్మీ

[మార్చు]

భారతదేశంలో ఆడే ఒక కార్డు గేమ్ భారతీయ రమ్మీ. ఇది అసలు రమ్మీకి కొంత వ్యత్యాసంగా ఉంటుంది. ఇది "రమ్మీ 500", "జిన్ రమ్మీ" కి మధ్య ఒక క్రాస్ గా భావిస్తారు. ఇది 13 కార్డులతో ఆడతారు, కనీసం రెండు డెక్స్, కొన్నిసార్లు జోకర్స్ (వైల్డ్ కార్డులు). భారతీయ రమ్మీ దక్షిణ ఆసియాలో ఆడే రమ్మీ యొక్క ఒక వెర్షన్ నుంచి ఉద్భవించి ఉండవచ్చు, అది "సెలెబెస్ రమ్మీ" గా కొనసాగుతుంది, అలాగే అది రుక్ అని కూడా పిలవబడుతుంది.

సాధ్యమయ్యే సెట్ల యొక్క రెండు రకాలు: వరుసగా సరిపోయే కార్డుల యొక్క ఒక రన్, మూడు లేదా ఒక రకం యొక్క నాలుగు (నకిలీ జోడీలు లేకుండా). ఈ ఆటలో గెలిచేందుకు ప్రాథమికంగా అవసరమైనవి కనీసం రెండు వరుస క్రమాలు, వీటిలో ఒకటి "స్వచ్ఛం"గా ఉండాలి, అంటే ఇది ఎటువంటి జోకర్స్ లేకుండా ఉండాలి.

చట్టపరమైన స్థితి

[మార్చు]

రమ్మీ నైపుణ్యానికి చెందిన ఆట అని చట్టానికి చెందిన న్యాయస్థానాలచే ప్రకటించబడింది. కొన్ని మినహా అన్ని రాష్ట్రాల్లో పందాలు, జూదం (భారతదేశం యొక్క రాజ్యాంగం కింద పందెం, జూదం రాష్ట్రానికి సంబంధించినవి) నిషేధించే చట్టాల యొక్క సంబంధము నుండి నైపుణ్యానికి చెందిన ఆటలు మినహాయించబడ్డాయి. అంతేకాక భారతదేశంలో అన్లైన్ లో ఆడే రమ్మీ చట్టపరమైనది కూడా.

జోకర్స్

[మార్చు]

డెక్ లోని ప్రామాణిక జోకర్స్ కు అదనంగా ఒక ఆటగాడు ప్యాక్ నుంచి ఒక కార్డును బయటికి తీసి ఎంపిక చేస్తాడు. ఈ కార్డు కింది పద్ధతిలో జోకర్స్ యొక్క అదనపు సెట్ నిర్ణయిస్తుంది:

  • అదే ర్యాంకు సంబంధం లేని రంగు
  • అదే ర్యాంకు సంబంధం లేని గుర్తు (The same rank but of opposite color known as opposite joker).
  • అదే జోడికి చెందిన తదుపరి పెద్ద కార్డు, దీనిని "పప్లు" అంటారు.

ఆడే విధానం

[మార్చు]

ఒక చీట్ల ప్యాక్ లో 52 పేకలు ఉంటాయి. సాధారణంగా ఒక గేమ్ టేబుల్ కి ఇద్దరి నుంచి ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. సాధారణంగా లేదా మంది పెరిగినప్పుడు రెండు ప్యాక్ లను కలిపి పంచుతారు. 13 ముక్కల రమ్మీ ఆటలో ఒక్కొక్క ఆటగానికి ఒక్కొక్క ముక్కను క్లాక్‌వైజ్ పద్ధతిలో వేస్తూ ఒక్కొక్కరికి 13 కార్డులు వచ్చేలా పంచుతారు. పంచగా మిగిలిన ప్యాక్ లోనించి ఆటలోని ఒక ఆటగాడు ప్రామాణిక జోకర్స్ కు అదనంగా ఒక కార్డును బయటికి తీసి ఎంపిక చేస్తాడు. మిగిలిన ప్యాక్ లోని పై కార్డును తిరగేస్తాడు. ఆ కార్డ్ తీసుకొనే మొదటి అవకాశం ఆట ప్రారంభానికి ముందు పెద్ద కార్డ్ పొందిన ఆటగానికి వస్తుంది (ఎవరితో ఆట ప్రారంభించాలి అనేది నిర్ణయించేందుకు మొదట ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డును పంచుతారు, తరువాత ఈ కార్డులను ప్యాక్ లో కలిపేస్తారు). పెద్ద కార్డ్ పొందిన వ్యక్తి తిరగేసిన కార్డ్ లేదా కట్టలోని పై కార్డ్ తీసుకొని తన సెట్ కి సరిపడని కార్డ్ ఒకటి కింద వేస్తాడు( ఒకవేళ అప్పటికే తన సెట్ పూర్తయినట్లయితే ఆ కార్డును మూసేసి తన కార్డుల సెట్ ను చూపిస్తాడు). తదుపరి వ్యక్తికి కనపడేటట్లుగా కింద వేసిన కార్డ్ లేదా కట్టలోని పై కార్డ్ తీసుకొనే అవకాశం వస్తుంది, అతను వాటిలో ఒక కార్డును తీసుకొని సరిపోని కార్డును కింద వేస్తాడు, మళ్ళీ ఇదే విధంగా తదుపరి వ్యక్తులకు క్లాక్‌వైజ్ పద్ధతిలో అవకాశాలు వస్తుంటాయి, ఇలా ఎవరోఒకరు గెలుపొందేదాక ఇలానే ఆట కొనసాగుతుంది, చివరగా గెలుపొందిన వ్యక్తి సరిపడని కార్డును మూసేసి తన కార్డుల సెట్ ను చూపిస్తాడు. ఈ ఆటలో గెలుపొందడం ఎంత ముఖ్యమో స్కోరును తగ్గించుకోవడం కూడా దాదాపు అంతే ముఖ్యం. ఒక రౌండులో అత్యధిక స్కోరు "80", తక్కువ స్కోరు "0", అనగా సున్న స్కోరు వచ్చిన వ్యక్తి ఆ రౌండులో గెలుపొందినట్టు. గెలుపొందడానికి తక్కువ అవకాశాలు ఉన్నవని భావించినప్పుడు, దానితో పాటు స్కోరును భారీగా తగ్గించలేమనుకున్నప్పుడు మొదటిసారి కార్డు ఎత్తుకొనే అవకాశం వచ్చినప్పుడు డ్రాప్ పెట్టడం ద్వారా స్కోరు "20" కి తగ్గించుకోవచ్చు. కార్డు ఎత్తుకొని ఆట ఆడుతూ మధ్యలో కార్డు ఎత్తుకొనే అవకాశం వచ్చినప్పుడు డ్రాప్ పెట్టినట్లయితే స్కోరు "40" అవుతుంది.

స్కోరు లెక్కించే విధానం
[మార్చు]
  • కార్డులలో ఎక్కువ నుంచి తక్కువకు వరుసగా - A K Q J 10 9 8 7 6 5 4 3 2 (A అంటే ఆసు, K అంటే రాజు, Q అంటే రాణి, J అంటే జాకీ)
  • కార్డులలో ఎక్కువ నుంచి తక్కువకు వరుసగా - ఇస్ఫేట్, ఆటీన్, డైమండ్, కళావరు (డైమండ్, ఆటీన్ ఎరుపు రంగులోను, కళావరు, ఇస్ఫే టు నలుపు రంగులోను ఉంటాయి.)
"https://te.wikipedia.org/w/index.php?title=రమ్మీ&oldid=2931224" నుండి వెలికితీశారు