Jump to content

రబ్బరు చెట్టు

వికీపీడియా నుండి

రబ్బరు చెట్టు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Genus:
Species:
H. brasiliensis
Binomial name
Hevea brasiliensis

రబ్బరు చెట్టు, హీవియా ప్రజాతికి చెందిన వృక్షం. దీని కాండం నుండి తీసిన పాలు నుండి సహజ రబ్బరు తయారుచేస్తారు.

చరిత్ర

[మార్చు]

రబ్బరు చెట్టు 100 నుండి 130 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది 100 సంవత్సరాల వరకు జీవించగలదు. హెవియా బ్రసిలియెన్సిస్ అనేది రబ్బరు కలప జాతి, ఇది బ్రెజిల్, వెనిజులా, ఈక్వెడార్, కొలంబియా, పెరూ బొలీవియా, దక్షిణ అమెరికాలోని అమెజాన్ ప్రాంతంలోని అడవులలో కనిపిస్తాయి . ఈ చెట్లు తక్కువ ఎత్తులో ఉన్న తేమ అడవులు, చిత్తడి నేలలు, , అటవీ అంతరాలు,చెదిరిన ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇది త్వరగా పెరిగే చెట్లు.ఓల్మెక్, మాయ, అజ్టెక్ చేత మొదట కనుగొనబడిన రబ్బరు చెట్టు నుండి రబ్బరు పాలు , రబ్బరు బంతులను, నీళ్లను నిరోధించే వస్త్రములను , పాదరక్షలను తయారు చేయడానికి వాడతారు [1] [2]

ఉపయోగాలు

[మార్చు]

విత్తనానికి ముందు కలుపును నియంత్రించడం వల్ల వ్యాధులనివారణ , నిర్వహణ తో రబ్బర్ చెట్లు పెంపకం లాభదాయకం గా ఉంటుంది.రబ్బరును అన్ని రకాల రబ్బరు ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. రబ్బరుగింజల నూనెతో సబ్బు తయారీ, రంగుల పరిశ్రమలలో వాడతారు.[3] చాలా దేశాలలో రబ్బరు ఇప్పటికీ మొక్కల పెంపకందారులకు వాణిజ్యపంట గా ఉన్నది . దీనితో ప్రభుత్వాలు పరిశోధన , అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని కి ప్రాధాన్యత ను ఇస్తూ పరిశోధన సంస్థలను ఏర్పాటు చేస్తున్నవి . రబ్బరు దిగుబడి ఆగ్నేయ ఆసియాలో, సగటు దిగుబడి సంవత్సరానికి హెక్టారుకు సంవత్సరానికి 1200-2000 కిలోలు. చిన్న భూములలో సగటు దిగుబడి సంవత్సరానికి 400-1500 కిలోల నుండి ఉంటుంది. మలేషియాలో, సగటు జాతీయ దిగుబడి సంవత్సరానికి హెక్టారుకు 1150 కిలోలు. సహజ ముడి రబ్బరు యొక్క ఉపయోగం టైర్ల తయారీ లో ప్రపంచ లో మొత్తం 50-60% వినియోగిస్తారు. రబ్బరు కారు భాగాలలో , పాదరక్షలు, క్రీడా వస్తువులు, బొమ్మలు, చేతి తొడుగులు, రబ్బరు దారాలు, ఫర్నిచర్, చిప్‌బోర్డ్, ఫైబర్ బోర్డ్, అనేక విలువ కలిగిన ఉత్పత్తులకు రబ్బరును వాడతారు [4]

మూలాలు

[మార్చు]
  1. "Species Profile: Rubber Tree". Rainforest Alliance (in ఇంగ్లీష్). Retrieved 2020-10-08.
  2. "rubber tree | Definition & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-10-08.
  3. "Factsheet - Hevea brasiliensis (Rubbertree)". keys.lucidcentral.org. Retrieved 2020-10-08.
  4. "Hevea brasiliensis (PROSEA) - PlantUse English". uses.plantnet-project.org. Archived from the original on 2020-10-15. Retrieved 2020-10-08.

వెలుపలి లంకెలు

[మార్చు]