రణధీర్ గట్ల
స్వరూపం
రణధీర్ గట్ల | |
---|---|
జననం | హైదరాబాదు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2007-ప్రస్తుతం |
రణధీర్ గట్ల ఒక తెలుగు సినిమా నటుడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రణధీర్ హైదరాబాదు లో పుట్టి పెరిగాడు. సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎం. బి. ఏ పూర్తి చేశాడు. తరువాత ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ కొన్నేళ్ళు బెంగళూరు లో ఉన్నాడు. సినిమాల్లో ప్రవేశించక మునుపు కొన్ని ప్రకటనల్లో కనిపించాడు.
సినిమాలు
[మార్చు]2007 లో శేఖర్ కమ్ముల అందరూ కొత్త వాళ్ళతో తాను తీయబోయే సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్లో పాల్గొన్నాడు. అప్పటికి పూర్వ నటనానుభవం లేదు. ఈ సినిమా తర్వాత నీలకంఠ తీసిన మిస్టర్ మేధావి సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత వచ్చిన యువత సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
- హ్యాపీ డేస్
- మిస్టర్ మేధావి
- యువత
- బాణం
- ఏప్రిల్ ఫూల్
- ధనలక్ష్మి తలుపు తడితే
- అడ్డా (2013)[2]
మూలాలు
[మార్చు]- ↑ "చిట్ చాట్ : రణధీర్ – ఏ సినిమాకైనా కథే హీరో.!". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 24 September 2017.
- ↑ "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.