రఘునాథాభ్యుదయము
స్వరూపం
రఘునాథాభ్యుదయము రామభద్రాంబ రచించిన కావ్యం. రామభద్రాంబ తంజావూరు నాయక రాజులలో రఘునాథ నాయకుడి భార్యలలో ఒకతి. ఈ రచన 12 సర్గాల్లో వ్రాయబడిన సంస్కృత మహాకావ్యము. రఘునాథుడ్ని రాముడు-కృష్ణుడు-విష్ణువు అంశంగా కీర్తిస్తూ రచించబడినవి.[1]
మొదటి కొన్ని సర్గాలలో రఘునాథుడి స్తుతి ఉంటుంది. ఇందులో అతని శరణు కోరటం, సహాయం అర్ధించడం, అతని కరుణ-దయ-క్షమా గుణం-బుద్ధి లను కీర్తించడం కనిపిస్తుంది. నాలుగవ సర్గంలో రాఘునాథుడి పూర్వీకుల గురించి, ఆపై వచ్చే సర్గాలలో రఘునాథుడి జీవితంలో తొలినాళ్ళు, అతని యుద్ధ కుశలత గురించి చర్చించబడింది. అతడు 8వ సర్గంలో తన తండ్రినుండి వారసత్వంగా రాజపదవిని తీసుకొని తన సైనిక చర్యలను కొనసాగిస్తాడు. ఆఖరి రెండు సర్గాలలో అతని సభలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రావీణ్యము చెబుతూ రామభద్రాంబ సాహితీ కృషిని గొప్పగా చెప్పారు.
మూలాలు
[మార్చు]- ↑ దవేష్ సోనేజి, పెర్ఫార్మింగ్ సత్యభీమి: టెక్స్ట్, కాంటెక్స్ట్, మెమరీ అండ్ మిమీసిస్ ఇన్ తెలుగు స్పీకింగ్ సౌత్ ఇండియా"' (అముద్రిత పీహెచ్డీ థీసిస్, మెక్గిల్ యూనివర్సిటీ 2004), పు. 53.