రంజన్ ఘోష్
రంజన్ ఘోష్ | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2011 – ప్రస్తుతంం |
రంజన్ ఘోష్ పశ్చిమ బెంగాల్ చెందిన సినిమా దర్శకుడు, రచయిత.[1]
జననం, విద్య
[మార్చు]రంజన్ ఘోష్ పశ్చిమ బెంగాల్‌లో జన్మించాడు. దుర్గాపూర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్, బిసి ఇన్స్టిట్యూషన్‌లో చదివాడు. ఆ తర్వాత జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదవడానికి కలకత్తా వెళ్ళాడు. ఆ చదువును వదిలేసి ముంబై విశ్వవిద్యాలయం నుండి నాటికల్ సైన్సెస్‌లో చేరి, డిగ్రీని పొందాడు.[2] 2007లో ఫిల్మ్ మేకింగ్ అధ్యయనం చేయడానికి ముంబైకు చెందిన ఫిల్మ్ స్కూల్ విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌లో చేరాడు. 2009 లో స్క్రీన్ రైటింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.
సినిమారంగం
[మార్చు]ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడే నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న 2009 అంతహీన్ అనే బెంగాలీ సినిమాకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అదే సినిమా షూటింగ్‌లో దర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌదరికి సహాయం చేశాడు. అపర్ణా సేన్ తీసిన ఇతి మృణాళిని సినిమాకి తొలిసారిగా స్క్రీన్ ప్లే రచయిత పరిచయమై, ప్రశంసలు పొందాడు.[3][4][5]
2014లో అబిర్ ఛటర్జీ, రైమా సేన్ నటించిన హృద్ మఝరే అనే బెంగాలీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[6][7] ఆ తరువాత రోంగ్‌బెరోంగర్ కోర్హి సినిమా తీశాడు. ఈ సినిమా దుబాయ్,[8] ఢాకా, లండన్, జాతీయ స్థాయిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె,[9] హైదరాబాద్‌లలో జరిగిన చిత్రోత్సవాలలో ప్రదర్శించడానికి ముందు 2018లో విడుదలై విస్తృతంగా ప్రశంసలు పొందిన చిత్రంగా నిలిచింది.[10][11][12]
2019లో అహా రే సినిమా తీశాడు. అంతర్జాతీయ చలనచిత్ర వెబ్ మ్యాగజైన్ ఏషియన్ మూవీ పల్స్ సంకలనం చేసిన 25 ఆల్-టైమ్ గ్రేట్ ఆసియా సినిమాల గౌరవనీయమైన జాబితాలో ఈ సినిమా కూడా చేర్చబడింది.[13][14] [15][16]
2022లో మహిషాసుర్ మర్దిని - ఎ నైట్ టు రిమెంబర్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమాను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ , జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలలో ప్రదర్శించారు.[17][18][19] ఇంతకు ముందు న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ నిర్వహించిన 21వ హేబిటాట్ థియేటర్ ఫెస్టివల్ 2022లో నాటకోత్సవంలో ప్రదర్శించబడిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.[20][21][22]
సినిమాలు
[మార్చు]- అంతహీన్ (2009) (స్క్రిప్టింగ్ అసిస్టెంట్)
- ఇతి మృణాళిని (2011) (స్క్రీన్ ప్లే రచయిత, డైరెక్టర్ అసిస్టెంట్)
- హృద్ మఝరే (2014) (స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు)
- రోంగ్‌బెరోంగర్ కోర్హి (2018) (స్క్రీన్ ప్లే రచయిత, ప్రొడక్షన్ డిజైనర్, దర్శకుడు)
- ఆహా రే (2019) (స్క్రీన్ ప్లే రచయిత, ప్రొడక్షన్ డిజైనర్, దర్శకుడు)
- మహిషాసుర మర్దిని (2022) (స్క్రీన్ ప్లే రచయిత, ప్రొడక్షన్ డిజైనర్, దర్శకుడు)
మూలాలు
[మార్చు]- ↑ "There are a million similar stories everywhere because we are all connected: Filmmaker Ranjan Ghosh". cinestaan.com. 10 July 2018. Archived from the original on 10 జూలై 2018. Retrieved 26 జూలై 2023.
- ↑ "University of Mumbai: Alumni". Archived from the original on 2015-09-04. Retrieved 2023-07-26.
- ↑ "Seven years of Iti Mrinalini". The Times of India. 29 July 2018.
- ↑ "Interview with Ranjan Ghosh: I have an enormous interest to explore the human condition, and I guess I have imbibed this from Ray-Ghatak-Sen". asianmoviepulse. 5 February 2020.
- ↑ "Script is King in any film". Archived from the original on 3 December 2010. Retrieved 2023-07-26.
- ↑ "Love, and jealousy, 450 years after the Bard – The Times of India". The Times of India. 4 August 2014.
- ↑ "Many Bengali films are said to be inspired by Bard's works". Business Standard India. Press Trust of India. 13 July 2014.
- ↑ "Rongberonger Korhi to be screened at the Dubai International Film Festival". The Times of India. 10 July 2018.
- ↑ "Rongberonger Korhi makes it to the Pune National Film Archive". The Times of India. 24 December 2018.
- ↑ "Rongberonger Korhi is creating waves all around". The Times of India. 19 December 2018.
- ↑ "Habitat Film Festival selects Ranjan Ghosh's movie Rongberonger Korhi". gulgal. 10 July 2018. Archived from the original on 10 జూలై 2018. Retrieved 26 జూలై 2023.
- ↑ "Rongberonger Korhi". biffes. 19 March 2019. Archived from the original on 30 జూలై 2021. Retrieved 26 జూలై 2023.
- ↑ "25 Great Asian Films about Food". asianmoviepulse. 28 May 2020.
- ↑ {{Cite web|date=1 August 2020|title=Ranjan Ghosh's Bengali crossover Ahaa Re is a gentle, hope-filled gastronomical romance|url=https://indianexpress.com/article/lifestyle/art-and-culture/ranjan-ghosh-bengali-crossover-ahaa-re-film-6534026/%7Cwebsite=indianexpress}[permanent dead link]
- ↑ "Ranjan Ghosh's Ahaa Re Starring Rituparna Sengupta, Arifin Shuvoo Is Chosen As Best Films About Food". spotboye. 27 April 2020.
- ↑ "Rituparna, Ranjan Ghosh talk about Ahaa Re ranking among great Asian films". archive.dhakatribune. 4 May 2020.[permanent dead link]
- ↑ "JNU screening of 'Mahishasur Marddini' leaves Ranjan emotional". timesofindia.indiatimes]. 16 December 2022.
- ↑ "Ranjan Ghosh on Mahishasur Marddini's JNU screening". telegraphindia.com. 16 December 2022.
- ↑ "Special screening of upcoming Bengali feature film Mahishashur Mardini at JMI" (PDF). jmi.ac.in. 30 September 2022.
- ↑ "Mahishasur Marddini to be screened at IHC Theatre Festival". telegraphindia. 13 September 2022.
- ↑ "The selection of Mahishasur Marddini at a prestigious theatre festival is pathbreaking: Rituparna Sengupta". [timesofindia.indiatimes. 1 October 2022.
- ↑ "Ranjan Ghosh: 'Mahishasur Marddini' getting selected at a prestigious theatre fest is really special". timesofindia.indiatimes. 14 September 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రంజన్ ఘోష్ పేజీ