రంజన్‌బెన్ ధనంజయ్ భట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంజన్ భట్
రంజన్‌బెన్ ధనంజయ్ భట్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 సెప్టెంబర్ 2014 - 3 జూన్ 2024
ముందు నరేంద్ర మోదీ
తరువాత హేమంగ్ జోషి
నియోజకవర్గం వడోదర

వ్యక్తిగత వివరాలు

జననం (1962-08-10) 1962 ఆగస్టు 10 (వయసు 62)
భరూచ్, గుజరాత్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ధనంజయ్ భట్
సంతానం 2
నివాసం వడోదర
మూలం [1]

రంజన్‌బెన్ ధనంజయ్ భట్ (జననం 10 ఆగస్టు 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె వడోదర లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

రంజన్‌బెన్ భట్ 1992లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2000లో జరిగిన వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. ఆమె 2010లో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి గెలిచి వీఎంసీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా పని చేసింది.

ఆమె 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వడోదర, వారణాసి లోక్‌సభ నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు స్థానాలలో గెలవడంతో వడోదర లోక్‌సభ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రంజన్‌బెన్ భట్ కాంగ్రెస్‌ అభ్యర్థి నరేంద్ర రావత్‌పై 3,29,507 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4] ఆమె 2014 నుండి 2016 వరకు పార్లమెంట్ లో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, 2016 నుండి 2019 వరకు పరిశ్రమల పార్లమెంటరీ కమిటీలో సభ్యురాలిగా పని చేసింది.

రంజన్‌బెన్ భట్ 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రశాంత్ చందూభాయ్ పటేల్ పై 5,89,177 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[5] ఆమె 2019 నుండి 2023 వరకు రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా పని చేసి వ్యక్తిగత కారణాలతో 2024 ఎన్నికలలో పోటీ చేయలేదు.

మూలాలు

[మార్చు]
  1. Digital Sansad (2024). "Ranjanben Dhananjay Bhatt" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  2. Times Now (23 March 2024). "Vadodara Lok Sabha Seat Candidate And BJP MP Ranjan Bhatt Quits Election Race, Cites 'Personal Reasons'" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  3. The Times of India (24 March 2019). "Party ends speculations, repeats Ranjan Bhatt". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  4. The Economic Times (16 September 2014). "Gujarat bypolls: BJP wins Vadodara Lok Sabha seat by over 3.29 lakh votes". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.