రంగూన్ రౌడీ (నాటకం)
స్వరూపం
రంగూన్ రౌడీ అను పతిభక్తి వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తంగా సోమరాజు రామానుజరావు రచించిన తెలుగు నాటకం. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నాటకం సినిమాగా కూడా రూపొందించారు. దీని మూడవకూర్పును కురుకూరి సుబ్బారావు గారు 1935లో ప్రచురించారు.
పాత్రలు
[మార్చు]- పురుషులు
- శంకరరావు - రంగూన్ రౌడీ, కథానాయకుడు
- తులసీరావు - పోలీసు సూపరింటెండెంటు (కథానాయకుని మామ)
- రమేశ్ బాబు - రంగూను లోని లక్షాధికారి
- గంగారాం సేటు - ఒక మార్వాడీ
- కృష్ణమూర్తి - జానకి ప్రియుడు
- జయరాం - రాధాబాయి ప్రియుడు
- మోహనరావు - కథానాయకుని కుమారుడు
- జడ్జి - అన్నపూర్ణకు ఉరిశిక్ష విధించిన అధికారి
- బట్లరు - విజయనగరం హోటలులోని నౌకరు
- సబ్‌ఇన్పెక్టరు - కాకినాడలో
- సబ్‌ఇన్పెక్టరు - విజయనగరములో
- జైలు సూపరింటెండెంటు - ఉరికంబం వద్ద
- కిరాతుడు - ఉరికంబం వద్ద
- రంగారావు - పవర్‌దారు
- సేవకుడు - కాకినాడలో
- స్త్రీలు
- అన్నపూర్ణ - కథానాయిక
- ప్రభావతి - రమేశ్ బాబు భార్య
- గిరికుమారి - కాకినాడలోని వేశ్య
- రాధాబాయి - గంగారాముని కుమార్తె
- నాందీబాయి - గంగారాముని భార్య
- జానకి - కథానాయకుని చెల్లి
- తల్లి - కథానాయకుని తల్లి
- ఇంగ్లీషు దాసి - గంగారాముని దాసి
- లక్ష్మి - కథానాయిక దాసి
- దాసి - గిరికుమారి దాసి
గృహలక్ష్మి సినిమా
[మార్చు]హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం-గృహలక్ష్మి (1938). దీని కథా రచయిత సోమరాజు రామానుజరావు. రామానుజరావు రచించిన రంగూన్ రౌడీ నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.