యుఎస్ ఓపెన్ (టెన్నిస్)
ప్రారంభం | 1881 |
---|---|
ఎడిషన్లు | 143 (2023) |
స్థలం | న్యూ యార్క్ అమెరికా |
వేదిక | USTA బిల్లీ జీన్ కింగ్ నేషనల్ సెంటర్ (1978 నుండి) |
నేల | హార్డ్ కోట్ – ఔట్‌డోర్[a][b] (since 1978) Clay – outdoors (1975–1977) Grass – outdoors (1881–1974) |
బహుమాన ధనం | US$65,000,020 (2023)[1] |
డ్రా | S (128Q) / 64D (16Q)[c] |
ప్రస్తుత ఛాంపియన్లు | నోవక్ జకోవిచ్ (సింగిల్స్) రాజీవ్ రామ్ జో శాలిస్‌బరీ (డబుల్స్) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | 7 బిల్ టిల్డెన్ |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | 6 మైక్ బ్రయాన్ |
డ్రా | S (128Q) / 64D (16Q) |
ప్రస్తుత ఛాంపియన్లు | కోకో గాఫ్ (సింగిల్స్) గాబ్రియెలా డబ్రోవ్‌స్కీ ఎరిన్ రూట్‌లిఫ్ (డబుల్స్) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | 8 మోలా మాలెరీ |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | 13 మార్గరెట్ ఆస్బోర్న్ డుపోంట్ |
డ్రా | 32 |
ప్రస్తుత ఛాంపియన్లు | అన్నా డానిలీనా హారీ హీలియోవారా |
అత్యధిక టైటిళ్ళు (పురుషులు) | 4 బిల్ టిల్డెన్ బిల్ టాల్బర్ట్ బాబ్ బ్రయాన్ |
అత్యధిక టైటిళ్ళు (స్త్రీలు) | 9 మార్గరెట్ ఆస్బోర్న్ డుపోంట్ |
2023 |
యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ (సాధారణంగా యుఎస్ ఓపెన్ అని అంటారు) న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ప్రతి సంవత్సరం జరిగే హార్డ్‌కోర్ట్ టెన్నిస్ టోర్నమెంటు. 1987 నుండి, యుఎస్ ఓపెన్, గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులలో కాలక్రమానుసారం సంవత్సరంలో జరిగే నాల్గవది, చివరిది. మిగిలిన మూడు, కాలక్రమానుసారం, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లు. యుఎస్ ఓపెన్ ఆగస్టు చివరి సోమవారం నాడు ప్రారంభమై రెండు వారాల పాటు కొనసాగుతుంది. మధ్య వారాంతం యుఎస్ లేబర్ డే సెలవుదినం ఉంటుంది. ఈ టోర్నమెంటు, ప్రపంచంలోని పురాతన టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో ఒకటి. దీనిని వాస్తవానికి యుఎస్ నేషనల్ ఛాంపియన్‌షిప్ అని పిలుస్తారు, దీని కోసం పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌ను మొదట 1881 ఆగస్టులో ఆడారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కారణంగా రద్దు చేయని లేదా 2020లో COVID-19 మహమ్మారి వలన అంతరాయం కలగని ఏకైక గ్రాండ్ స్లామ్ ఇది.
టోర్నమెంటులో ఐదు ప్రాథమిక ఛాంపియన్‌షిప్‌లు ఉన్నాయి: పురుషుల, మహిళల సింగిల్స్, పురుషులు, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్. టోర్నమెంటులో సీనియర్, జూనియర్, వీల్ చైర్ ప్లేయర్‌ల ఈవెంట్‌లు కూడా ఉన్నాయి. 1978 నుండి, టోర్నమెంటును న్యూయార్క్ నగరంలో క్వీన్స్ లో ఉన్న ఫ్లషింగ్ మెడోస్-కరోనా పార్క్ లోని USTA బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్‌లో యాక్రిలిక్ హార్డ్‌కోర్ట్‌ల మీద నిర్వహిస్తారు. యుఎస్ ఓపెన్ను, లాభాపేక్షలేని సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (USTA) నిర్వహిస్తుంది. యుఎస్ ఓపెన్ చైర్‌పర్సన్ పాట్రిక్ గాల్‌బ్రైత్. టిక్కెట్ల విక్రయాలు, స్పాన్సర్‌షిప్‌లు, టెలివిజన్ కాంట్రాక్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యునైటెడ్ స్టేట్స్‌లో టెన్నిస్‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ టోర్నమెంటు, 1971 నుండి 2021 వరకు, సింగిల్స్ మ్యాచ్‌లోని ప్రతి సెట్ లోనూ ప్రామాణిక టైబ్రేకర్‌లను (ఏడు పాయింట్లు రావాలి, తేడాతో రెండు ఉండాలి) ఉపయోగిస్తూ వచ్చింది.[2] 2022 నుండి, చివరి సెట్‌లో కొత్త టైబ్రేక్ నియమాలు చేర్చారు. మ్యాచ్ చివరి సెట్‌లో (మహిళలకు మూడవది, పురుషులకు ఐదవది) స్కోరు ఆరు-ఆరు వద్ద ఉన్నపుడు, పొడిగించిన టైబ్రేకర్ (గెలుపొందేందుకు పది పాయింట్లు రావాలి, రెండు పాయింట్ల ఆధిక్యం ఉండాలి) ఆడుతున్నారు.
నేల
[మార్చు]1978 నుండి 2019 వరకు, యుఎస్ ఓపెన్‌ను ప్రో డెకోటర్ఫ్ అని పిలిచే హార్డ్‌కోర్ట్ ఉపరితలంపై ఆడేవారు. ఇది అనేక పొరలున్న కుషన్డ్ ఉపరితలం. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ దీన్ని మీడియం-ఫాస్ట్ అని వర్గీకరించింది.[3] ప్రతి ఆగస్టులో టోర్నమెంటు ప్రారంభానికి ముందు, కోర్టుల ఉపరితలాన్ని మళ్లీ తయారుచేస్తారు.[4]
ఆటగాళ్లు, ప్రేక్షకులు, టెలివిజన్ వీక్షకులు అందరికీ బంతి సులభంగా కనబడేందుకు గాను, 2005 నుండి, యుఎస్ ఓపెన్ సిరీస్ లోని టెన్నిస్ కోర్టులన్నిటి లోనూ లైన్‌ల లోపల నీలం రంగు ("యుఎస్ ఓపెన్ బ్లూ" అని దీనికి ట్రేడ్‌మార్కు తీసుకున్నారు) పెయింట్ వేస్తున్నారు.[5] లైన్ల వెలుపల ఉన్న ప్రాంతాన్ని "యుఎస్ ఓపెన్ గ్రీన్" అనే పెయింట్ వేస్తారు.[5]
పాయింట్, ప్రైజ్ మనీ పంపిణీ
[మార్చు]సంవత్సరాలుగా యుఎస్ ఓపెన్‌లో పురుషులు ( ATP ), మహిళల ( WTA ) ర్యాంకింగ్ పాయింట్లు మారుతూ ఉన్నాయి. ఒక్కో ఈవెంటుకు ఉన్న ర్యాంకింగ్ పాయింట్‌లను చూపే పోటీల కోసం పట్టికల శ్రేణి క్రింద ఉంది:
సీనియర్
[మార్చు]ఈవెంట్ | వి | ఫై | సెఫై | క్వాఫై | R4 | R3 | R2 | R1 | ప్ర | Q3 | Q2 | Q1 |
పురుషుల సింగిల్స్ | 2000 | 1200 | 720 | 360 | 180 | 90 | 45 | 10 | 25 | 16 | 8 | 0 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పురుషుల డబుల్స్ | 0 | — | — | — | — | — | ||||||
మహిళల సింగిల్స్ | 1300 | 780 | 430 | 240 | 130 | 70 | 10 | 40 | 30 | 20 | 2 | |
మహిళల డబుల్స్ | 10 | — | — | — | — | — |
వీల్‌చెయిర్[మార్చు]
|
Junior[మార్చు]
|
నగదు బహుమతి
[మార్చు]2023 యుఎస్ ఓపెన్ మొత్తం ప్రైజ్ మనీ $65,000,020. ఇది గ్రాండ్ స్లామ్‌లన్నిటి లోకీ అతిపెద్ద మొత్తం. టోర్నమెంటు చరిత్రలోనే ఇది అతి పెద్దది. ప్యాకేజీ క్రింది విధంగా విభజించబడింది:[6]
ఈవెంట్ | వి | ఫై | సెఫై | క్వాఫై | రౌండ్ 16 | రౌండ్ 32 | రౌండ్ 64 | Round of 128 | Q3 | Q2 | Q1 |
సింగిల్స్ | $3,000,000 | $1,500,000 | $775,000 | $455,000 | $284,000 | $191,000 | $123,000 | $81,500 | $45,000 | $34,500 | $22,000 |
డబుల్స్ | $700,000 | $350,000 | $180,000 | $100,000 | $58,000 | $36,800 | $22,000 | N/A | N/A | N/A | N/A |
మిక్స్డ్ డబుల్స్ | $170,000 | $85,000 | $42,500 | $23,200 | $14,200 | $8,300 | N/A | N/A | N/A | N/A | N/A |
ప్రస్తుత ఛాంపియన్లు
[మార్చు]
|
రికార్డులు
[మార్చు]రికార్డు | యుగం. | ఆటగాడు (s) | లెక్కింపు | సంవత్సరాలు. |
---|---|---|---|---|
1881 నుండి పురుషులు | ||||
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | రిచర్డ్ సియర్స్ | 7 | 1881–87 |
విలియం లార్నెడ్ | 1901–02, 1907–11 | |||
బిల్ టిల్డెన్ | 1920–25, 1929 | |||
ఓపెన్ యుగం | జిమ్మీ కానర్స్ | 5 | 1974, 1976, 1978, 1982–83 | |
పీట్ సాంప్రాస్ | 1990, 1993, 1995–96, 2002 | |||
రోజర్ ఫెదరర్ | 2004–08 | |||
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | రిచర్డ్ సియర్స్ | 7 | 1881–87 |
ఓపెన్ యుగం | రోజర్ ఫెదరర్ | 5 | 2004–08 | |
అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | రిచర్డ్ సియర్స్ | 6 | 1882-84,1886-87 జోసెఫ్ క్లార్క్ తో జేమ్స్ డ్వైట్ తో |
హోల్కోంబ్ వార్డ్ | 1899-1901 డ్వైట్ ఎఫ్. డేవిస్ 1904-06 తో బీల్స్ రైట్ | |||
ఓపెన్ యుగం | మైక్ బ్రయాన్ | 6 | 2005, 2008, 2010, 2012, 2014 బాబ్ బ్రయాన్ 2018 జాక్ సాక్ తో | |
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | రిచర్డ్ సియర్స్ | 6 | 1882–87 |
ఓపెన్ యుగం | రాజీవ్ రామ్ | 3 | 2021–23 | |
జో సాలిస్బరీ | 2021–23 | |||
అత్యధిక మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | ఎడ్విన్ పి. ఫిషర్ | 4 | 1894-96 జూలియట్ అట్కిన్సన్ 1898లో క్యారీ నీలీ |
వాల్లస్ ఎఫ్. జాన్సన్ | 1907 విత్ మే సేయర్స్-1909,1911,1915 విత్ హాజెల్ హాట్చ్కిస్ వైట్మాన్ | |||
బిల్ టిల్డెన్ | 1913-14 మేరీ బ్రౌన్ తో 1922-23 మొల్లా మల్లోరీ | |||
బిల్ టాల్బర్ట్ | 1943-46 మార్గరెట్ ఒస్బోర్న్ డుపాంట్ తోమార్గరెట్ ఒస్బోర్న్ డుపోంట్ | |||
ఓపెన్ యుగం | ఓవెన్ డేవిడ్సన్ | 1966 విత్ డోనా ఫ్లాయిడ్ 1967,1971,1973 విత్ బిల్లీ జీన్ కింగ్ | ||
మార్టీ రీసెన్ | 1969-70,1972 మార్గరెట్ కోర్ట్ 1980 వెండీ టర్న్బుల్ | |||
బాబ్ బ్రయాన్ | 2003 లో కాటరినా స్రెబోట్నిక్ 2004 తో వెరా జ్వోనరేవా 2006 తో మార్టినా నవ్రతిలోవా 2010 తో లైజెల్ హుబెర్ తో లీజెల్ హుబెర్ | |||
అత్యధిక ఛాంపియన్షిప్లు (సింగిల్స్, డబుల్స్ & మిక్స్డ్ డబుల్స్) |
ఔత్సాహిక యుగం | బిల్ టిల్డెన్ | 16 | 1913-29 (7 సింగిల్స్, 5 డబుల్స్, 4 మిక్స్డ్ డబుల్స్) |
ఓపెన్ యుగం | బాబ్ బ్రయాన్ | 9 | 2003-14 (5 డబుల్స్, 4 మిక్స్డ్ డబుల్స్) | |
1887 నుండి మహిళలు | ||||
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | / మొల్లా మల్లోరీ | 8 | 1915–18, 1920–22, 1926 |
ఓపెన్ యుగం | క్రిస్ ఎవర్ట్ | 6 | 1975–78, 1980, 1982 | |
సెరెనా విలియమ్స్ | 1999, 2002, 2008, 2012–14 | |||
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | / మొల్లా మల్లోరీ | 4 | 1915–18 |
హెలెన్ జాకబ్స్ | 1932–35 | |||
ఓపెన్ యుగం | క్రిస్ ఎవర్ట్ | 4 | 1975–78 | |
అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | మార్గరెట్ ఒస్బోర్న్ డుపోంట్ | 13 | 1941 సారా పాల్ఫ్రే కుక్ 1942-50 తో, 1955-57 లూయిస్ బ్రో |
ఓపెన్ యుగం | మార్టినా నవ్రతిలోవా | 9 | 1977లో బెట్టీ స్టోవ్ 1978,1980లో బిల్లీ జీన్ కింగ్ 1983-84 తో, 1986-87 పామ్ ష్రివర్ 1989లో హనా మాండ్లికోవాతో 1990లో గిగి ఫెర్నాండెజ్ తో | |
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | మార్గరెట్ ఒస్బోర్న్ డుపోంట్ | 10 | 1941 సారా పాల్ఫ్రే కుక్ 1942-50 తో లూయిస్ బ్రోతో |
ఓపెన్ యుగం | వర్జీనియా రువానో పాస్కల్ | 3 | 2002–04 | |
పావోలా సురెజ్ | 2002–04 | |||
అత్యధిక మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ | ఔత్సాహిక యుగం | మార్గరెట్ ఒస్బోర్న్ డుపోంట్ | 9 | బిల్ టాల్బెర్ట్తో 1943-46 కెన్ మెక్గ్రెగర్ 1950,1956 కెన్ రోజ్వాల్ 1958-60 నీల్ ఫ్రేజర్ |
ఓపెన్ యుగం | మార్గరెట్ కోర్ట్ | 3 | 1969-70,1972 మార్టీ రీసెన్తో | |
బిల్లీ జీన్ కింగ్ | 1971, 1973 ఓవెన్ డేవిడ్సన్ తో 1976 ఫిల్ డెంట్ తో | |||
మార్టినా నవ్రతిలోవా | 1985 హీన్జ్ గుంథార్డ్ 1987 ఎమిలియో సాంచెజ్ 2006 బాబ్ బ్రయాన్తో | |||
అత్యధిక ఛాంపియన్షిప్లు (సింగిల్స్, డబుల్స్ & మిక్స్డ్ డబుల్స్) |
ఔత్సాహిక యుగం | మార్గరెట్ ఒస్బోర్న్ డుపోంట్ | 25 | 1941-60 (3 సింగిల్స్, 13 డబుల్స్, 9 మిక్స్డ్ డబుల్స్) |
ఓపెన్ యుగం | మార్టినా నవ్రతిలోవా | 16 | 1977-2006 (4 సింగిల్స్, 9 డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్) | |
వివిధ | ||||
సీడ్ చేయని ఛాంపియన్లు | పురుషులు. | ఆండ్రీ అగస్సీ | 1994 | |
మహిళలు | కిమ్ క్లిజ్స్టర్స్ స్లోన్ స్టీఫెన్స్ ఎమ్మా రాడుకాను |
2009-2017 (ప్రధాన టైటిల్ గెలుచుకున్న ఏకైక రక్షిత ర్యాంకింగ్) 2021 (ప్రధాన టైటిల్ గెలిచిన ఏకైక క్వాలిఫైయర్) | ||
అతి పిన్న వయస్కుడైన సింగిల్స్ విజేత | పురుషులు. | పీట్ సాంప్రాస్ | 19 సంవత్సరాల 1 నెల (1990) [7] | |
మహిళలు | ట్రేసీ ఆస్టిన్ | 16 సంవత్సరాల 8 నెలలు (1979) [7] | ||
అత్యంత పెద్ద వయస్కులైన సింగిల్స్ ఛాంపియన్ | పురుషులు. | విలియం లార్నెడ్ | 38 సంవత్సరాల 8 నెలలు (1911) [7] | |
మహిళలు | / మొల్లా మల్లోరీ | 42 సంవత్సరాల 5 నెలలు (1926) [7] |
గమనికలు
[మార్చు]- ↑ DecoTurf was used from 1978 to 2019, and Laykold since 2020.
- ↑ Except Arthur Ashe Stadium and Louis Armstrong Stadium during rain delays.
- ↑ In the main draws, there are 128 singles players (S) and 64 doubles teams (D), and there are 128 and 16 entrants in the respective qualifying (Q) draws.
మూలాలు
[మార్చు]- ↑ "2023 US Open Prize Money". USOpen.org. Retrieved August 18, 2023.
- ↑ "Tiebreak in Tennis". Tennis Companion. October 29, 2019. Retrieved September 1, 2021.
- ↑ "About Court Pace Classification". International Tennis Federation. Retrieved August 25, 2018.
- ↑ Thomas Lin (September 7, 2011). "Speed Bumps on a Hardcourt". The New York Times. Retrieved August 25, 2018.
- ↑ 5.0 5.1 Tim Newcomb (August 24, 2015). "The science behind creating the U.S. Open courts and signature colors". Sports Illustrated.
- ↑ "2023 US Open Prize Money". United States Tennis Association. Retrieved August 18, 2023.
- ↑ 7.0 7.1 7.2 7.3 "Youngest and oldest champions". United States Tennis Association. Retrieved October 17, 2017.