యాద్‌గార్
యాద్‌గార్ (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | కమల్ హాసన్ పూనమ్ ధిల్లాన్ సంజీవ్ కుమార్ |
సంగీతం | బప్పీలహరి |
విడుదల తేదీ | 20 జూలై 1984 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
యాద్‌గార్ 1984 లో విడుదలైన, హిందీ నుండి తెలుగు లోకి అనువదించిన సినిమా. కమల్ హాసన్, పూనం ధిల్లాన్, సంజీవ్ కుమార్ నటించాగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. సంగీతం బప్పి లాహిరి
కథ
[మార్చు]కమల్ హాసన్ భయంకరమైన అబద్దాలకోరు; అతను తన గ్రామంలోని ప్రతిఒక్కరికీ డబ్బు కోసం అబద్ధం చెప్పేవాడు. ఒక రోజు ఒక గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంటలు చెలరేగి, అతని తండ్రి తీవ్రంగా గాయపడతాడు. అతను తన తండ్రిని కాపాడటానికి సహాయం చేయమని డాక్టరును ఇతర గ్రామస్తులనూ ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు. కాని అతని అబద్ధాల కారణంగా ఎవరూ అతనిని నమ్మరు. చివరికి, వైద్యం అందనందున తండ్రి మరణిస్తాడు. మరుసటి రోజు అతను పెళ్ళైన తన సోదరి ఇంట్లో తేలతాడు. ఇంటి పనులలో సహాయం చేస్తే, అతన్ని ఇంట్లో ఉండనిస్తామని అత్తింటివారు చెబుతారు. కాని అతను పూర్తి సమయం పనివాడైపోతాడు. తినడానికి పాచిపోయిన తిండి పెడతారు. ఒక రోజు, అతని మామగారు ప్రమాదానికి గురైనప్పుడు, మొత్తం కుటుంబానికి అతడు చెడు శకునమయ్యాడని నిందిస్తారు. మరుసటి రోజు అతన్ని కిరాణా సామాగ్రి కొనడానికి పంపినప్పుడు, అతను ఒక గుడ్డి మహిళను దుండగుల నుండి రక్షిస్తాడు. కొన్న పచారీ వస్తువులన్నింటినీ కోల్పోతాడు. అతను ఇంటికి వెళ్ళినప్పుడు, అతన్ని తన సొంత సోదరే అతడి కథను నమ్మక, అతన్ని అవమానిస్తుంది. అతను తన కోసం డబ్బు ఖర్చు చేసుకుని ఉంటాడని అనుకుంటుంది. తరువాత, అతను అనుకోకుండా పగలగొట్టిన గడియారాన్ని రిపేరు చేయించే పని పడుతుంది. గడియారం యొక్క ప్రతిరూపాన్ని కొనడానికి డబ్బు కోసం ఒక రేసులో పాల్గొంటాడు. అతను రేసులో గెలిచి గడియారం కొని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అతన్ని అత్తమామలు కొడతారు. కారణం -అతని బావకు ఉద్యోగం పోయింది,అదికూడా ఈ దురదృష్టవంతుడి కారణంగానే. అతని సోదరి దీనిని సహించలేక పోతుంది. తన సోదరుడిని వెళ్లి ఇంటిని విడిచిపెట్టమని అడుగుతుంది.
తాను రక్షించిన గుడ్డి అమ్మాయి తల్లి తీవ్రంగా అనారోగ్యంతో ఉందని అతను తెలుసుకుంటాడు. అందువల్ల అతను ఒక వైద్యుడిని తీసుకువస్తాడు. కానీ చాలా ఆలస్యమై, ఆమె తల్లి చనిపోతుంది. బెట్టింగు, జూదంలో తన ప్రతిదాన్ని కోల్పోతున్న మూఢనమ్మకాల ధనవంతుడైన సంజీవ్ కుమార్కు దశ తిరుగుతుంది. ఒక రోజు అతను పందెం కోసం వెళుతున్నప్పుడు కమల్ హాసన్ ఎదురౌతాడు. అతను తన జీవితంలో మొదటిసారి పందెం గెలిచాడు. అతడు అదృష్టవంతుడని భావించి అతన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. సంజీవ్ కుమార్కు పిల్లలు లేనందున, అతను వివిధ లాభదాయక ఒప్పందాల తరువాత కమల్ హాసన్ ను దత్తత తీసుకుంటాడు. కమల్ హాసన్ గుడ్డి అమ్మాయిని వివాహం చేసుకుని, కంటి చూపు కోసం ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాడు. ఆమెకు కంటి చూపు తిరిగి వస్తుంది. సంజీవ్ కుమార్ చాలా కాలం తరువాత తండ్రి అవుతాడు. కమల్ హాసన్ తన బావమరిది ఇంట్లో ఇంతకాలం కుళ్ళిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది. తరువాత, అతను తన కొత్తగా జన్మించిన సోదరుడికి విషం ఇచ్చాడని నిందపడుతుంది. కాని అతను అప్పటికే క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని అతని తల్లికి తెలిస్తే, ఆమె క్షమిస్తుంది. తరువాత, ఆమె సొంత సోదరుడు దోషి అని తేలుతుంది. తరువాత కమల్ హాసన్ తన తల్లిదండ్రుల చేతుల్లోనే మరణిస్తాడు. సినిమా విషాదకరంగా ముగుస్తుంది.