యశ్‌పాల్ ఆర్య
యశ్‌పాల్ ఆర్య | |
---|---|
ఉత్తరాఖండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు | |
Assumed office 2022 ఏప్రిల్ 10 | |
Deputy | భువన్ చంద్ర |
అంతకు ముందు వారు | ప్రీతం సింగ్ |
ఉత్తరాఖండ్ శాసనసభ, | |
Assumed office 2012 | |
నియోజకవర్గం | బాజ్‌పూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1952 జనవరి 8 |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (2017 వరకు) భారతీయ జనతా పార్టీ (2017–21) |
సంతానం | సంజీవ్ ఆర్య |
నివాసం | డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ |
యశ్‌పాల్ ఆర్య, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1]అతను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. యశ్‌పాల్ ఆర్య రవాణా, సాంఘిక సంక్షేమం, మైనారిటీ విద్యార్థుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు. [2] ప్రస్తుతం, యశ్‌పాల్ఆర్య భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు . ఉత్తరాఖండ్ శాసనసభ సభ్యుడు. యశ్‌పాల్ ఆర్య ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్ గా పనిచేశాడు.[3][4] యశ్‌పాల్ ఆర్య 2007 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు లోముక్తేశ్వర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గాఎన్నికయ్యాడు.
యశ్‌పాల్ ఆర్య 2007 నుండి 2014 వరకు ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఉత్తరాఖండ్ పీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశాడు.[5] అతను 2012లో బాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉత్తరాఖండ్ శాసనసభకు ఎన్నికయ్యాడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత హేమవతి నందన్ బహుగుణ కుమారుడు విజయ్ బహుగుణను కాంగ్రెస్ హైకమాండ్ ప్రమాణస్వీకారం చేసే వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం ముందున్న వారిలో ఒకరిగా భావించారు. [6]
యశ్‌పాల్ ఆర్య 2017 జనవరి 26న భారతీయ జనతా పార్టీలో చేరారు, అక్కడ 2017 మార్చి 18 [7] నుండి 2021 అక్టోబరు 11 వరకు రవాణా, సాంఘిక సంక్షేమం, మైనారిటీ విద్యార్థుల సంక్షేమం, ఉత్తరాఖండ్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. రావత్ తీరత్ సింగ్ రావత్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశాడు.[2][8]
2021 అక్టోబరు 11న, యశ్‌పాల్ ఆర్య తన కుమారుడు సంజీవ్ ఆర్య (ఎమ్మెల్యే, నైనిటాల్ )తో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరాడు.[9] యశ్‌పాల్ ఆర్య 2022 లో జరిగిన ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలలో భాజ్ పూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆ తర్వాత ఉత్తరాఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించబడ్డాడు.[10][11]
నిర్వహించిన పదవులు
[మార్చు]సంవత్సరం | వివరణ |
---|---|
1984 - 1989 | ఛలయాల్ సుయల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ |
1989 - 1991 | ఉత్తర ప్రదేశ్ శాసనసభకు మొదటిసారి ఎన్నికయ్యాడు. |
1993 - 1996 | ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు (2వసారి) |
2002 - 2007 |
|
2007 - 2012 |
|
2012 - 2017 |
రెవెన్యూ భూ నిర్వహణ, నీటిపారుదల, వరద నియంత్రణ, కేబినెట్ మంత్రి |
2017 - 2022 |
|
2022 - ఇప్పటి వరకు |
|
ఇతర పదవులు
[మార్చు]సంవత్సరం | వివరణ |
---|---|
1979 - 1983 | నైనిటాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు |
1983 - 1984 | నైనిటాల్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి |
1984 - 1989 | నైనిటాల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు |
1996 - 2000 | ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు |
2007 - 2014 | ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు |
పోటీ చేసిన ఎన్నికలు
[మార్చు]సంవత్సరం | ఎన్నిక విధానం | పార్టీ | నియోజకవర్గం పేరు | ఫలితం | వచ్చిన ఓట్లు | ఓటు శాతం% | మార్జిన్ | మూలం | |
---|---|---|---|---|---|---|---|---|---|
1989 | ఎమ్మెల్యే | భారత జాతీయ కాంగ్రెస్ | ఖతిమా | గెలుపు | 38,785 | 40.42% | 14,793 | [12] | |
1991 | ఎమ్మెల్యే | ఓటమి | 29,211 | 32.11% | 1,755 | [13] | |||
1993 | ఎమ్మెల్యే | గెలుపు | 49,487 | 42.01% | 8,787 | [14] | |||
1996 | ఎమ్మెల్యే | అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) | ఓటమి | 35,120 | 21.46% | 21,329 | [15] | ||
2002 | ఎమ్మెల్యే | భారత జాతీయ కాంగ్రెస్ | ముక్తేశ్వర్ | గెలుపు | 13,531 | 37.70% | 1,424 | [16] | |
2007 | ఎమ్మెల్యే | గెలుపు | 26,801 | 58.24% | 10,984 | ||||
2012 | ఎమ్మెల్యే | బాజ్‌పూర్ | గెలుపు | 38524 | 45.94% | 15,131 | [17] | ||
2017 | ఎమ్మెల్యే | భారతీయ జనతా పార్టీ | గెలుపు | 54,965 | 53.22% | 12,636 | |||
2022 | ఎమ్మెల్యే | భారత జాతీయ కాంగ్రెస్ | గెలుపు | 40,252 | 36.76% | 1,611 |
ఇతర వివరాలు
[మార్చు]అతను 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత పివి నరసింహారావుకు వ్యతిరేకంగా మరి ఆ తరువాత ఎన్.డి తివారీ నాయకత్వం 1994లో అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) పేరుతో తిరుగుబాటు కాంగ్రెస్‌ను స్థాపించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Uttarakhand Minister Yashpal Arya, His Son Join Congress After Quitting BJP". NDTV.com. Retrieved 2022-07-12.
- ↑ 2.0 2.1 Iqbal, Aadil Ikram Zaki. "Uttarakhand Government 2017: Full list of Trivendra Singh Rawat's Cabinet Ministers with Portfolios | India.com". www.india.com. Retrieved 2022-07-12.
- ↑ "Yashpal Arya frontrunner for Uttarakhand CM's post". The Times of India. 10 March 2012.
- ↑ U’khand Cong manages to win rebels for magic figure
- ↑ "Office Bearers". Uttarakhand Pradesh Congress Committee, Official website. Archived from the original on 2012-01-22. Retrieved 2024-05-04.
- ↑ "The Tribune, Chandigarh, India - Dehradun Plus". www.tribuneindia.com. Retrieved 2022-07-16.
- ↑ Excelsior, Daily (2017-03-18). "Trivendra Singh Rawat sworn in as Uttarakhand CM". Jammu Kashmir Latest News | Tourism | Breaking News J&K. Retrieved 2022-07-12.
- ↑ "Uttarakhand CM Tirath Rawat distributes portfolios among his ministers". The New Indian Express. Retrieved 2022-07-12.
- ↑ "Uttarakhand: Senior Congress leader Yashpal Arya joins BJP". 16 January 2017.
- ↑ "yashpal-arya in Uttarakhand Assembly Elections 2022". News18. Retrieved 2022-07-12.
- ↑ "U'khand: Congress appoints Yashpal Arya as leader of opposition month after elections". The New Indian Express. Retrieved 2022-07-12.
- ↑ "Khatima 1989 Assembly MLA Election Uttarakhand | ENTRANCEINDIA". 30 October 2018. Archived from the original on 2 December 2023. Retrieved 4 May 2024.
- ↑ "Khatima 1991 Assembly MLA Election Uttarakhand | ENTRANCEINDIA". 30 October 2018. Archived from the original on 9 జూన్ 2023. Retrieved 4 మే 2024.
- ↑ "Khatima 1993 Assembly MLA Election Uttarakhand | ENTRANCEINDIA". 30 October 2018. Archived from the original on 2 December 2023. Retrieved 4 మే 2024.
- ↑ "Khatima 1996 Assembly MLA Election Uttarakhand | ENTRANCEINDIA". 30 October 2018. Archived from the original on 2 December 2023. Retrieved 4 మే 2024.
- ↑ "Mukteshwar Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com.
- ↑ "Bajpur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com.