యల్లా వెంకటేశ్వరరావు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
యల్లా వెంకటేశ్వరరావు ప్రసిద్ధిచెందిన మృదంగ విద్వాంశులు, మృదంగంపై జలపాతాల హోరును సృష్టించగల ప్రతిభాశాలి. వెంకటేశ్వరరావు భీమవరం పట్టణానికి ఆరుకిలోమీటర్ల దూరంలో కల పాలకోడేరులో జన్మించాడు. వెంకటేశ్వరరావు కుటుంబం తాత ముత్తాతల నుండి సంగీతంతో సహజీవనం సాగిస్తున్నది. ఇతడి తండ్రి రామ్మూర్తి ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు. తాత వెంకటలింగం కూడా మృదంగ, సంగీత విద్వాంశుడు. వెంకటేశ్వరరావు చిన్నతనంలో కుటుంబం విజయవాడకు వలస వెళ్ళింది. అక్కడ భజన కార్యక్రమాలలో పాల్గొంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుతూ పద్నాలుగేళ్ళ వయసులో ఆలిండియా రేడియో జాతెయ స్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలలో అప్పటి రాష్ట్రపతిడా, సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నాడు.
ప్రజ్ఞా విశేషాలు - అవార్డులు
[మార్చు]- కేంద్ర ప్రభుత్వం వారు 2007 సంవత్సరానికిగాను పద్మశ్రీ బిరుదుతో సత్కరించారు.
- హైదరాబాద్‌లో రెండున్నర దశాబ్ధాల క్రిందట ఏకథాటిగా 36 గంటలు మృదంగం వాయించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు.
- ప్రపంచదేశన్నిటిలో కచేరీలు చేసాడు.
- అనేక సినిమాలలో తన మృదంగనాదాన్ని అందించాడు.
- ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.[1][2]
స్వవిశేషాలు
[మార్చు]వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. కుమార్తెలు విజయదుర్గ, పద్మజలు సైతం సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. కుమారుడూ మురళీకృష్ణ కర్ణాటక సంగీతంలో విశేష ప్రావీణ్యం సంపాదించి పలు ప్రదర్శనలు ఇస్తున్నారు.బొద్దు పాఠ్యం వాలు పాఠ్యం
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 9 June 2020.
- ↑ ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 9 June 2020.
ఈనాడు వార పత్రిక వ్యాసం నుండి సేకరణ.