Jump to content

యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
వై. ఆదినారాయణ రెడ్డి
మద్రాస్ శాసనసభ సభ్యుడు
In office
1964-1970
నియోజకవర్గంఆంధ్రప్రదేశ్
In office
1982-1988
నియోజకవర్గంఆంధ్రప్రదేశ్
శాసనసభ సభ్యుడు ఆంధ్రప్రదేశ్
In office
1952–1954
నియోజకవర్గంమద్రాస్ శాసనసభ
వ్యక్తిగత వివరాలు
జననం(1916-10-15)1916 అక్టోబరు 15
టి. సుండుపల్లి, కడప జిల్లా , ఆంధ్రప్రదేశ్ , భారత దేశం
మరణం2002 జూన్ 08
హైదరాబాద్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
సంతానం7
నివాసంఆంధ్రప్రదేశ్

యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి (15 అక్టోబర్ 1916 - 8 జూన్ 2002) భారత స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయ నాయకుడు. ఆది నారాయణ రెడ్డి కడప జిల్లాలో సత్యాగ్రహ ఉద్యమం నిర్వహించి మూడు నెలల పాటు వేలూరు సెంట్రల్ జైలులో జైలు శిక్ష అనుభవించాడు. ఆదినారాయణ రెడ్డి రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడు, గా పనిచేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించాడు. [1] [2] [3] ఆదినారాయణ రెడ్డి రాయచోటి శాసనసభ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆదినారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. [4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]
ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబ సభ్యులతో ఆదినారాయణ రెడ్డి

యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి 1916 అక్టోబర్ 15న ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా టి.సుండుపల్లెలో జన్మించారు. ఆదినారాయణ రెడ్డి మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తన బి ఎ పూర్తి చేసాడు.[4] ఆదినారాయణరెడ్డికి బసమ్మతో వివాహం జరిగింది. ఆదినారాయణ రెడ్డి దంపతులకు 4 కుమారులు 3 కూతుళ్లు - వై. రవీంద్రారెడ్డి ( ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ మాజీ చైర్మన్), [5] శివరాం రెడ్డి, డాక్టర్ యెరుకల రెడ్డి, ఆనంద్ రెడ్డి, అరుంధతి, సావిత్రి అల్లపురెడ్డి శ్రీదేవి.[4] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకులతో ఆదినారాయణ రెడ్డికి బంధుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆదినారాయణ రెడ్డికి బావ అవుతాడు. పెన్నా నది ఉపనదిపై ప్రతిష్టాత్మకమైన పింఛా ప్రాజెక్ట్ డ్యామ్ కు ఆదినారాయణ రెడ్డి పేరు పెట్టారు. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదినారాయణరెడ్డి పింఛా ప్రాజెక్టుగా నామకరణం చేశారు.

స్వాతంత్ర్య పోరాటం

[మార్చు]

ఆదినారాయణరెడ్డి డిసిసి అధ్యక్షునిగా జిల్లాలో 1940 - 41 వరకు వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారు. దాంతో ఆదినారాయణ రెడ్డిని అప్పటి బ్రిటిష్ పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి జైలలో నిర్బంధించారు.[6] 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కడప జిల్లా ప్రజలకు ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 1942 డిసెంబర్ నుండి 1944 డిసెంబరు వరకు ఆదినారాయణ రెడ్డి వెల్లూరు తంజావూరు జైళ్లలో జైలు శిక్షను అనుభవించాడు.[7] మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో ఆదినారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 'ఆజాద్ హింద్' తెలుగు వారపత్రికకు ఆదినారాయణ రెడ్డి సంపాదకత్వం వహించారు.[ ] 1974లో భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మచే భారత స్వాతంత్య్ర పోరాటానికి చేసిన విశిష్టమైన కృషికి గాను ఆదినారాయణ రెడ్డికి తామ్రపత్ర పురస్కారం లభించింది.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆదినారాయణ రెడ్డి1940 నుంచి 1949 వరకు కడప జిల్లా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు. [7] 1952లో ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారిలను రాయచోటికి ఆహ్వానించి ప్రజలు పడుతున్న కష్టాలను జవహర్లాల్ నెహ్రూ రాజగోపాల చారి కి వివరించి సహాయ కార్యక్రమాలు జరిగేలా చూశారు.[4] జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌లతో సహా అనేక మంది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆదినారాయణ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి.[4] 1969లో ఆదినారాయణ రెడ్డి ఏఐఐసీ సభ్యునిగా ఎంపికయ్యారు. [7] అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సాన్నిహిత్యం కారణంగా ఆదినారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు .[4]

1965 నుంచి 1969 వరకు ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశారు. [8] ఆదినారాయణ రెడ్డి 1952 నుండి 1954 వరకు మద్రాసు రాష్ట్రంలోని రాయచోటి నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశారు. 1954 నుండి 1962 వరకు ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయచోటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.[8] ఆదినారాయణ రెడ్డి 1964 1982లో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ నుండి , రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు [7] ఆదినారాయణ రెడ్డి 1974లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.[8]

1986లో ఆదినారాయణ రెడ్డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ సమావేశంలో భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 23 December 2017.
  2. India. Parliament. Lok Sabha (1983). Parliamentary Committee: Summary of Work. Lok Sabha Secretariat. p. 53. Retrieved 23 December 2017.
  3. The Election Archives. Shiv Lal. 1978. p. 859. Retrieved 23 December 2017.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "రాజకీయ చాతుర్యం.. నిరాడంబర జీవితం". Sakshi. 15 March 2019.
  5. "TDP leader gunned down in Cuddapah district".
  6. తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. p. 170. Retrieved 12 August 2024.
  7. 7.0 7.1 7.2 7.3 "WHO'S WHO OF FREEDOM STRUGGLE IN KADAPA DISTRICT" (PDF).
  8. 8.0 8.1 8.2 "Adinarayana Reddy, Yerrapureddy – Freedom Fighter". 11 June 2012.