Jump to content

యరపతినేని శ్రీనివాస రావు

వికీపీడియా నుండి
యరపతినేని శ్రీనివాస రావు
యరపతినేని శ్రీనివాస రావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2019
నియోజకవర్గం గురజాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
మంచికల్లు గ్రామం, రెంటచింతల మండలం,గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మయ్య
జీవిత భాగస్వామి నాగమణి
సంతానం మహేష్, రేణుక & సాయి నిఖిల్
వృత్తి రాజకీయ నాయకుడు

యరపతినేని శ్రీనివాస రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గురజాల నియోజకవర్గం నుండి నాల్గోవ సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

యరపతినేని శ్రీనివాస రావు 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామంలో జన్మించాడు. ఆయన మాచెర్ల లోని ఎస్.కె.బి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి 1982లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

యరపతినేని శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి పై 23967 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయాడు. శ్రీనివాస రావు 2009లో 10021 ఓట్ల మెజారిటీతో, 2014లో 7187 ఓట్ల మెజారిటీతో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి [1] 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (2 April 2019). "గురజాలలో యరపతినేని హ్యాట్రిక్ కొడతారా...? కాసు బోణీ కొడతారా...?". Retrieved 6 December 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (22 May 2020). "టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ల సంగతి చూస్తా". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.