మ్యూనిక్


మ్యూనిక్ జర్మనీలోని బవేరియా రాష్ట్ర రాజధాని. ఆ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా. 2024 నవంబరు 30 నాటికి 16,04,384 మంది జనాభాతో,[1] జనాభా ప్రకారం బెర్లిన్, హాంబర్గ్ ల తర్వాత, ఇది జర్మనీలో మూడవ అతిపెద్ద నగరం. ఐరోపా సమాఖ్యలో ఇది 11వ అతిపెద్ద నగరం. మ్యూనిక్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో - శివారు ప్రాంతాలు, ఉపగ్రహ పట్టణాలతో సహా - 30 లక్షల మంది నివాసితులు ఉన్నారు; నగర మెట్రోపాలిటన్ ప్రాంతంలో దాదాపు 62 లక్షల మంది నివసిస్తున్నారు. GDP ప్రకారం ఐరోపా సమాఖ్యలో మూడవ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం.[2]
ఆల్ప్స్ పర్వతాలకు ఉత్తరాన ఇసార్ నది ఒడ్డున విస్తరించి ఉన్న మ్యూనిచ్, ఎగువ బవేరియాలోని బవేరియన్ పరిపాలనా ప్రాంతానికి కేంద్రంగా ఉంది. జర్మనీలో అత్యంత జనసాంద్రత కలిగిన మునిసిపాలిటీ ఇది. ఇక్కడి జనసాంద్రత 4,500/చ.కి.మీ. ఆస్ట్రియా రాజధాని వియన్నా తర్వాత, బవేరియన్ మాండలికం మాట్లాడే ప్రాంతాల్లో మ్యూనిక్ రెండవ అతిపెద్ద నగరం.
ఈ నగరం ఉనికి మొదట 1158 లో కనిపిస్తుంది. కాథలిక్ మ్యూనిచ్ సంస్కరణను తీవ్రంగా వ్యతిరేకించింది. దీని ఫలితంగా రాజకీయంగా విభేదాలు తలెత్తి ముప్పై సంవత్సరాల యుద్ధం జరిగింది. కానీ ప్రొటెస్టంట్ స్వీడన్లు దేశాన్ని ఆక్రమించినప్పటికీ నగరాన్ని భౌతికంగా తాకలేదు.[3] 1806 లో బవేరియా బవేరియా రాజ్యంగా స్థాపించబడిన తర్వాత, మ్యూనిచ్ కళలు, వాస్తుశిల్పం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రానికి ఐరోపాలో ప్రధాన కేంద్రంగా మారింది. 1918 లో 1918–1919 జర్మన్ విప్లవం సమయంలో, 1180 నుండి బవేరియాను పరిపాలిస్తూ వచ్చిన పాలక హౌస్ ఆఫ్ విట్టెల్స్‌బాచ్, పదవి నుండి వైదొలగాల్సి వచ్చింది. అపుడు కొద్దికాలం పాటు బవేరియన్ సోవియట్ రిపబ్లిక్ గా ఉనికిలో ఉంది. 1920 లలో మ్యూనిచ్ అనేక రాజకీయ వర్గాలకు నిలయంగా మారింది. వాటిలో నాజీ పార్టీ కూడా ఒకటి. నాజీలు అధికారంలోకి వచ్చిన తరువాత, మ్యూనిచ్‌ను వారి "ఉద్యమ రాజధాని"గా ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ నగరంపై భారీగా బాంబు దాడులు జరిగాయి. కానీ పాత పట్టణంలో ఎక్కువ భాగాన్ని పునరుద్ధరించుకున్నారు. యుద్ధానికి ముందు నగరంలో దాదాపు 30,000 భవనాలుండేవి.[4] యుద్ధం తరువాత, విర్ట్‌చాఫ్ట్స్‌వుండర్ పాలనలో జనాభాలో, ఆర్థిక శక్తిలో గొప్ప పెరుగుదల కనిపించింది. ఈ నగరం 1972 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
నేడు, మ్యూనిచ్ శాస్త్ర సాంకేతికం, ఆర్థిక, ఇన్నోవేషన్, వ్యాపారం, పర్యాటక రంగాల్లో ప్రపంచంలో ప్రముఖ కేంద్రంగా ఉంది. మ్యూనిచ్‌లో చాలా ఉన్నత జీవన ప్రమాణాలుమ్ జీవన నాణ్యత ఉన్నాయి. ఈ ప్రమాణాల్లో మ్యూనిక్, 2018 మెర్సర్ సర్వే ప్రకారం జర్మనీలో మొదటి స్థానంలోను, ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలోనూ నిలిచింది.[5] మోనోకిల్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సర్వే 2018 ద్వారా ప్రపంచంలోనే అత్యంత జీవించదగిన నగరంగా రేటింగు తెచ్చుకుంది.[6] రియల్ ఎస్టేట్ ధరలూ అద్దె ఖర్చుల పరంగా మ్యూనిచ్, జర్మనీలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా ర్యాంకు పొందింది.[7][8] 2023 లో మ్యూనిచ్ నివాసితులలో 30.1 శాతం మంది విదేశీయులు, మరో 19.4 శాతం మంది విదేశాల నుండి వలస నేపథ్యం కలిగిన జర్మనీ పౌరులు.[9]
మ్యూనిచ్ ఆర్థిక వ్యవస్థ హైటెక్, ఆటోమొబైల్స్, సేవా రంగం, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇతర ఏ జర్మన్ నగరానికన్నా బలమైన ఆర్థిక వ్యవస్థ మ్యునిక్‌ది. జర్మనీలో పది లక్షల పైచిలుకు జనాభా ఉన్న నగరాలన్నిటి లోకీ అత్యల్ప నిరుద్యోగ రేటు మ్యూనిక్‌లో ఉంది. ఈ నగరంలో BMW, సిమెన్స్, అలియాంజ్ SE, మ్యూనిచ్ రే వంటి అనేక బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. అదనంగా, మ్యూనిచ్ రెండు పరిశోధనా విశ్వవిద్యాలయాలకూ, అనేక శాస్త్రీయ సంస్థలకూ నిలయంగా ఉంది. మ్యూనిచ్, అనేక నిర్మాణ, సాంస్కృతిక ఆకర్షణలు, క్రీడా కార్యక్రమాలు, ప్రదర్శనలకు నెలవు. ఇక్కడా ఏటా జరిగే ఆక్టోబర్‌ఫెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద వోక్స్‌ఫెస్ట్. ఇది గణనీయమైన సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.[10]

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య నగర చరిత్ర
[మార్చు]1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత, జర్మనీపై మిత్రరాజ్యాలు విధించిన దిగ్బంధనం కారణాంగా ఆహారం, ఇంధనాలకు కొరత ఏర్పడి, మ్యూనిక్‌లో జీవితం చాలా కష్టమైంది. 1916 లో ఫ్రెంచ్ వైమానిక దాడుల సమయంలో, మ్యూనిక్‌పై మూడు బాంబులు పడ్డాయి.
1916 లో, 'బేరిస్చే మోటోరెన్ వర్కే' (BMW) మ్యూనిక్ లోనే దాని మొదటి విమాన ఇంజన్‌ను ఉత్పత్తి చేసింది.[11] 1918 లో BMW AG ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించారు. మూలధనంలో మూడో వంతు వాటా కామిల్లో కాస్టిగ్లియోని వద్ద ఉండేది. 1922 లో BMW తన ప్రధాన కార్యాలయాన్ని మ్యూనిక్‌లోని ఒక కర్మాగారానికి మార్చింది.[12]
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, నగరం తీవ్రమైన రాజకీయ అశాంతికి కేంద్రంగా మారింది. 1918 నవంబరులో జర్మన్ విప్లవం సందర్భంగా, బవేరియాకు చెందిన లుడ్విగ్ III, అతని కుటుంబం నగరం నుండి పారిపోయారు. 1919 ఫిబ్రవరిలో బవేరియా మొదటి రిపబ్లికన్ ప్రధాని ఐన కర్ట్ ఐస్నర్‌ను అంటోన్ గ్రాఫ్ వాన్ ఆర్కో ఔఫ్ వ్యాలీ హత్య చేసిన తరువాత, బవేరియన్ సోవియట్ రిపబ్లిక్ ఏర్పడింది.[13] 1918 నవంబరు విప్లవంతో బవేరియాలో విట్టెల్స్‌బాచ్ పాలనను ముగిసింది.[14] మెయిన్ కాంఫ్‌లో అడాల్ఫ్ హిట్లర్ 1918 నవంబరు తర్వాత మ్యూనిక్‌లో తన రాజకీయ క్రియాశీలత గురించి చెబుతూ, "నా రాజకీయ కార్యకలాపాల ప్రారంభం"గా అభివర్ణించాడు. హిట్లర్ స్వల్పకాలిక బవేరియన్ సోవియట్ రిపబ్లిక్‌ను "యూదుల పాలన" అని పేర్కొన్నాడు.[15] 1919 లో మ్యూనిక్‌లో బవేరియా ఫిల్మ్‌ను స్థాపించారు. 1920 లలో జర్మనీలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో ఐన బాబెల్స్‌బర్గ్ స్టూడియోకు ఇది ప్రత్యామ్నాయంగా నిలిచింది.[16]

1923లో గుస్తావ్ వాన్ కహర్ బవేరియన్ ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. జర్మన్ పౌరసత్వం లేని యూదులందరినీ బహిష్కరించడానికి వెంటనే ప్రణాళిక వేశాడు. పోలీసు చీఫ్ ఎర్నెస్ట్ పోహ్నర్, విల్హెల్మ్ ఫ్రిక్ లు బహిరంగంగా యూదు వ్యతిరేకతకు పాల్పడ్డారు. మితవాద రాజకీయాల మద్దతుదార్లైన వ్యక్తులు చేసిన నేరాలకు, బవేరియన్ న్యాయమూర్తులు వారిని దేశభక్తులుగా ప్రశంసిస్తూ తేలికపాటి శిక్షలను విధించారు.[17] 1923 లో మ్యూనిక్‌లో కేంద్రీకృతమై ఉన్న అడాల్ఫ్ హిట్లర్, అతని మద్దతుదారులు, వీమర్ రిపబ్లిక్‌ను పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో బీర్ హాల్ తిరుగుబాటు జరిపారు. తిరుగుబాటు విఫలమై, హిట్లర్ అరెస్టు అయ్యాడు. నాజీ పార్టీ (NSDAP) తాత్కాలికంగా చతికిలబడింది.[18]
బవేరియా స్వేచ్ఛా రాజ్యం ఏర్పడినపుడు మ్యూనిక్‌ను దానికి రాజధానిగా ఎన్నుకున్నారు. నగరాన్నీ, చుట్టుపక్కల జిల్లాలనూ నిర్వహించడానికి బాధ్యత తీసుకుంది. బ్యూరోక్రసీ కోసం కార్యాలయాలు నిర్మించాల్సిన అవసరం ఉంది, కాబట్టి 1920 ల చివరలో చారిత్రిక నగర కేంద్రంలోని దక్షిణ భాగంలో 12 అంతస్తుల కార్యాలయ భవనాన్ని నిర్మించారు.[14]
1933 లో నాజీలు జర్మనీలో అధికారం చేపట్టినప్పుడు మ్యూనిక్ మళ్ళీ వారికి ముఖ్యమైనదిగా మారింది. ఆ పార్టీ తన మొదటి కాన్సంట్రేషన్ క్యాంప్‌ను నగరానికి వాయవ్యంగా 16 కి.మీ. (10 మై.) దూరంలో నున్న డాచౌలో ఏర్పాటు చేసారు. జాతీయ సోషలిజం పెరుగుదలకు దాని ప్రాముఖ్యత కారణంగా, మ్యూనిక్‌ను హౌప్ట్‌స్టాడ్ట్ డెర్ బెవెగుంగ్ ("ఉద్యమ రాజధాని") అని పిలుస్తారు.[19]
NSDAP ప్రధాన కార్యాలయం, ప్రజల జీవితంలోని అన్ని అంశాలనూ నియంత్రించే డాక్యుమెంటేషన్ మ్యూనిక్‌లో ఉన్నాయి. నేషనల్ సోషలిస్ట్ ఉమెన్స్ లీగ్, గెస్టాపో వంటి నాజీ సంస్థల కార్యాలయాలు బ్రియెన్నర్ స్ట్రాస్ లోను, కోనిగ్స్ప్లాట్జ్ చుట్టూనూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో పార్టీ 68 భవనాలను సొంతం చేసుకుని, అనేక ఫ్యూరర్‌బాటెన్ (" ఫ్యూరర్ భవనాలు") శక్తిని ప్రతిబింబించేలా నిర్మించారు.[20] ఫ్యూరర్‌బౌ, పార్టీ ప్రధాన కార్యాలయం (బ్రౌన్ హౌస్ అంటారు) నిర్మాణ పనులు 1933 సెప్టెంబరులో ప్రారంభమయ్యాయి.[21] హౌస్ డెర్ కున్స్ట్ (జర్మన్ ఆర్ట్ హౌస్) హిట్లర్ ప్రారంభించిన మొదటి భవనం. 1931లో ఒక కాల్పుల దాడిలో గ్లాస్ ప్యాలెస్ ధ్వంసమైనప్పుడు "జర్మన్ నగరాల్లోకెల్లా అత్యంత జర్మన్ నగరమైన" మ్యూనిక్‌లో ప్రదర్శన భవనం లేకపోవడం నచ్చక నాజీలు, అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే ఆర్కిటెక్ట్ పాల్ ట్రూస్ట్‌ను పని ప్రారంభించమని కోరారు.[22]
1930 లో మ్యూనిక్‌లో ఫీంకోస్ట్ కాఫర్‌ను స్థాపించారు. కాఫర్ క్యాటరింగ్ వ్యాపారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది.[23]
ఫ్రాంకో-బ్రిటిష్ బుజ్జగింపు విధానంలో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్, మూడవ ఫ్రెంచ్ రిపబ్లిక్ లు నాజీ జర్మనీతో 1938 లో మ్యూనిక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. హిట్లర్ ప్రాదేశిక విస్తరణను సంతృప్తి పరచాలనే ఆశతో బ్రిటిష్ ప్రధాన మంత్రి నెవిల్లే చాంబర్‌లైన్, చెకోస్లోవేకియా లోని సుడెటెన్‌ల్యాండ్‌ను జర్మనీ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఒప్పందంలో అంగీకరించాడు.
మ్యూనిక్-రీమ్ విమానాశ్రయం 1939 అక్టోబరులో పూర్తయింది.[24]
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన కొద్దికాలానికే, 1939 నవంబరు 8న, రాజకీయ పార్టీ ప్రసంగం చేసిన అడాల్ఫ్ హిట్లర్‌ను హత్య చేసే ప్రయత్నంలో జార్జ్ ఎల్సర్ మ్యూనిక్‌లోని బర్గర్‌బ్రూకెల్లర్‌లో బాంబును అమర్చాడు. అయితే, బాంబు పేలడానికి కొన్ని నిమిషాల ముందు హిట్లర్ ఆ భవనం నుండి వెళ్ళిపోయాడు. 1942 మధ్య నాటికి మ్యూనిక్ లోను, శివారు ప్రాంతాల్లోనూ నివసిస్తున్న యూదులలో అధిక భాగాన్ని బహిష్కరించారు.[25]
భౌగోళికం
[మార్చు]
స్థలాకృతి
[మార్చు]మ్యూనిక్, ఎగువ బవేరియా లోని ఎత్తైన మైదానాలలో, ఆల్ప్స్ పర్వతాల ఉత్తర అంచు నుండి ఉత్తరంగా దాదాపు 50 కి.మీ. (31 మై.) దూరాన, సముద్ర మట్టం నుండి దాదాపు 520 మీ. (1,706 అ.) ఎత్తున ఉంది. ఇసార్, వర్మ్ లు స్థానికంగా ప్రవహించే నదులు.
వాతావరణం
[మార్చు]కోపెన్ వాతావరణ వర్గీకరణ ప్రకారం, వాతావరణం సముద్ర ( Cfb ), ఐసోథెర్మ్ నుండి స్వతంత్రంగా ఉంటుంది కానీ వేసవి వెచ్చదనం నుండి వేడిగా ఉంటుంది. శీతాకాలాలు చల్లగా, తేమతో కూడిన ఖండాంతర ( Dfb ) లక్షణాలను కలిగి ఉంటుంది. శాశ్వత మంచు పొర ఏమీ ఉండదు.[26][27] మ్యూనిక్ విమానాశ్రయం తేమతో కూడిన ఖండాంతర వాతావరణాన్ని కలిగి ఉంది. సగటున, అత్యంత వెచ్చని నెల జూలై కాగా, జనవరి నెల అత్యంత చల్లగా ఉంటుంది.
ఆల్ప్స్ పర్వతాలకు దగ్గరగా ఉండటం వల్ల వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. తత్ఫలితంగా వరదలు ఎక్కువ గానే వస్తూ ఉంటాయి. వాతావరణ మార్పు, తీవ్ర సంఘటనలకు అనుగుణంగా ఉండే అధ్యయనాలు నిర్వహించబడతాయి; వాటిలో ఒకటి EU అనుకూల వాతావరణం.[28]
వసంత ఋతువు చివరిలోను, వేసవి అంతటాను జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, అత్యధిక సగటు నెలవారీ అవపాతాన్ని కలిగిస్తాయి. సగటున జూలైలో అత్యధిక అవపాతం నమోదవుతుంది. శీతాకాలంలో తక్కువ అవపాతం ఉంటుంది, ఫిబ్రవరిలో అత్యల్పంగా ఉంటుంది.
సముద్ర మట్టం నుండి ఎత్తుగా ఉండడం, ఆల్ప్స్ పర్వతాలకు సామీపంలో ఊండడం కారణంగా జర్మనీలోని అనేక ఇతర ప్రాంతాల కంటే నగరంలో ఎక్కువ వర్షం, మంచు కురుస్తుంది. ఆల్ప్స్ పర్వతాలు నగర వాతావరణాన్ని ఇతర విధాలుగా కూడా ప్రభావితం చేస్తాయి; ఉదాహరణకు, ఆల్ప్స్ పర్వతాల నుండి దిగువకు వచ్చే వెచ్చని గాలి (ఫోహ్న్ విండ్) వలన శీతాకాలంలో కూడా కొన్ని గంటల్లోనే ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పెరుగుతాయి.
మ్యూనిక్ అధికారిక వాతావరణ కేంద్రాలలో, ఇప్పటివరకు కొలిచిన అత్యధిక, ఉష్ణోగ్రత 37.5 °C (100 °F), 1983 జూలై 27 న, ట్రూడరింగ్-రీమ్‌లో కాగా, అత్యల్ప ఉష్ణోగ్రత −31.6 °C (−24.9 °F), 1929 ఫిబ్రవరి 12 న నగరంలోని బొటానిక్ గార్డెన్‌లో కొలిచారు.[29][30]
శీతోష్ణస్థితి డేటా - Munich (Dreimühlenviertel) (1991–2020 normals, extremes 1954–present) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 18.9 (66.0) |
21.4 (70.5) |
24.0 (75.2) |
32.2 (90.0) |
31.8 (89.2) |
35.2 (95.4) |
37.5 (99.5) |
37.0 (98.6) |
31.8 (89.2) |
28.2 (82.8) |
24.2 (75.6) |
21.7 (71.1) |
37.5 (99.5) |
సగటు గరిష్ఠ °C (°F) | 11.8 (53.2) |
13.7 (56.7) |
18.9 (66.0) |
23.6 (74.5) |
27.5 (81.5) |
30.5 (86.9) |
31.9 (89.4) |
31.5 (88.7) |
26.8 (80.2) |
22.6 (72.7) |
17.0 (62.6) |
12.6 (54.7) |
33.1 (91.6) |
సగటు అధిక °C (°F) | 4.0 (39.2) |
5.6 (42.1) |
10.1 (50.2) |
15.2 (59.4) |
19.4 (66.9) |
22.9 (73.2) |
24.9 (76.8) |
24.7 (76.5) |
19.6 (67.3) |
14.5 (58.1) |
8.2 (46.8) |
4.8 (40.6) |
14.5 (58.1) |
రోజువారీ సగటు °C (°F) | 0.9 (33.6) |
1.9 (35.4) |
5.7 (42.3) |
10.2 (50.4) |
14.3 (57.7) |
17.8 (64.0) |
19.6 (67.3) |
19.4 (66.9) |
14.7 (58.5) |
10.1 (50.2) |
4.9 (40.8) |
1.8 (35.2) |
10.1 (50.2) |
సగటు అల్ప °C (°F) | −1.8 (28.8) |
−1.4 (29.5) |
1.7 (35.1) |
5.3 (41.5) |
9.3 (48.7) |
12.9 (55.2) |
14.7 (58.5) |
14.5 (58.1) |
10.4 (50.7) |
6.5 (43.7) |
2.1 (35.8) |
−0.8 (30.6) |
6.1 (43.0) |
సగటు కనిష్ఠ °C (°F) | −13.8 (7.2) |
−12.4 (9.7) |
−7.3 (18.9) |
−3.3 (26.1) |
1.5 (34.7) |
5.3 (41.5) |
7.8 (46.0) |
6.6 (43.9) |
1.9 (35.4) |
−2.1 (28.2) |
−6.8 (19.8) |
−12.3 (9.9) |
−16.8 (1.8) |
అత్యల్ప రికార్డు °C (°F) | −22.2 (−8.0) |
−25.4 (−13.7) |
−16.0 (3.2) |
−6.0 (21.2) |
−2.3 (27.9) |
1.0 (33.8) |
6.5 (43.7) |
4.8 (40.6) |
0.6 (33.1) |
−4.5 (23.9) |
−11.0 (12.2) |
−20.7 (−5.3) |
−25.4 (−13.7) |
సగటు అవపాతం mm (inches) | 51.9 (2.04) |
45.5 (1.79) |
61.2 (2.41) |
56.0 (2.20) |
107.0 (4.21) |
120.9 (4.76) |
118.9 (4.68) |
116.5 (4.59) |
78.1 (3.07) |
66.9 (2.63) |
58.4 (2.30) |
58.5 (2.30) |
939.7 (37.00) |
సగటు అవపాతపు రోజులు (≥ 1.0 mm) | 15.3 | 14.0 | 15.6 | 13.5 | 16.1 | 16.7 | 16.1 | 15.0 | 14.2 | 14.2 | 14.6 | 16.8 | 182.0 |
సగటు మంచు కురిసే రోజులు (≥ 1.0 cm) | 11.7 | 11.2 | 4.5 | 0.6 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 3.3 | 8.0 | 39.3 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 80.3 | 75.9 | 70.7 | 64.6 | 67.2 | 67.2 | 66.1 | 68.1 | 75.5 | 79.9 | 83.3 | 82.3 | 73.4 |
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు | 74.6 | 95.2 | 145.3 | 186.0 | 213.0 | 223.7 | 241.4 | 232.1 | 169.7 | 123.3 | 74.0 | 66.4 | 1,841.4 |
Source 1: World Meteorological Organization[31] | |||||||||||||
Source 2: DWD[32] SKlima.de[33] Infoclimat[34] |
జనాభా
[మార్చు]సంవత్సరం | జనాభా | మార్పు ±% |
---|---|---|
1500 | 13,447 | — |
1600 | 21,943 | + 63.2% |
1750 | 32,000 | +45.8% |
1880 | 230,023 | +618.8% |
1890 | 349,024 | +51.7% |
1900 | 499,932 | +43.2% |
1910 | 596,467 | +19.3% |
1920 | 666,000 | +11.7% |
1930 | 728,900 | +9.4% |
1940 | 834,500 | +14.5% |
1950 | 823,892 | −1.3% |
1960 | 1,055,457 | + 28.1% |
1970 | 1,311,978 | +24.3% |
1980 | 1,298,941 | −1.0% |
1990 | 1,229,026 | −5.4% |
2001 | 1,227,958 | −0.1% |
2011 | 1,348,335 | +9.8% |
2022 | 1,478,638 | +9.7% |
పరిపాలనా విభాగాలలో మార్పుల వల్ల జనాభా పరిమాణం ప్రభావితం కావచ్చు. |
1700 లో కేవలం 24,000 మంది ఉన్న నగర జనాభా, ప్రతి 30 సంవత్సరాలకు రెట్టింపు అవుతూ వచ్చింది. 1852 లో 1,00,000, 1883 లో 2,50,000 కు, 1901 లో 5,00,000 కూ పెరిగింది. అప్పటి నుండి, మ్యూనిక్ జర్మనీలో మూడవ అతిపెద్ద నగరంగా మారింది. 1933 లో 8,40,901 మంది, 1957లో 10 లక్షలు, 2022 లో 15 లక్షలకూ జనాభా చేరుకుంది.
వలస
[మార్చు]2023 డిసెంబరులో మ్యూనిక్ జనాభా 15.8 లక్షలు. 2023 డిసెంబరు 31 నాటికి 4,77,855 మంది విదేశీయులు నగరంలో నివసిస్తున్నారు, వీరిలో 42.88% మంది EU సభ్య దేశాల పౌరులు కాగా, 29.66% మంది EUలో లేని యూరోపియన్ దేశాల పౌరులు (కొసావో, టర్కీలతో సహా).[35] టర్కులతో పాటు, క్రొయేషియన్లు నగరంలోని రెండు అతిపెద్ద విదేశీ మైనారిటీలు. అందుకే కొంతమంది క్రొయేషియన్లు మ్యూనిక్‌ను తమ "రెండవ రాజధాని"గా చెబుతారు.[36] విదేశీ జాతీయుల అతిపెద్ద సమూహాలు టర్కులు (38,947), క్రొయేషియన్లు (37,541), ఇటాలియన్లు (28,142), గ్రీకులు (24,843), బోస్నియన్లు (24,161) ఉక్రేనియన్లు (21,899), ఆస్ట్రియన్లు (21,944).
ఆర్కిటెక్చర్
[మార్చు]


రాజభవనాలు, కోటలు
[మార్చు]స్క్లోస్ నింఫెన్‌బర్గ్ (నింఫెన్‌బర్గ్ ప్యాలెస్, దీని నిర్మాణం 1664 లో ప్రారంభమైంది) మ్యూజియంలో ప్రజలకు ప్రత్యేక టూర్లున్నాయి.[37][38]
చిన్న స్క్లాస్ ఫర్‌స్టెన్‌రీడ్ (ఫర్‌స్టెన్‌రీడ్ ప్యాలెస్, నిర్మాణం 1715–1717) ను ఆర్చ్ డియోసెస్ ఆఫ్ మ్యూనిక్ అండ్ ఫ్రీసింగ్ సమావేశ స్థలంగా ఉపయోగిస్తుంది.[39]
స్క్లోస్ బ్లూటెన్‌బర్గ్ ( బ్లూటెన్‌బర్గ్ కోట ) 2024 లో పిల్లల లైబ్రరీగా మొదలైంది.[40] ఈ మైదానంలో నిర్మించిన చివరి గోతిక్ బ్లూటెన్‌బర్గ్ కోట చర్చిని సందర్శకులు చూడవచ్చు.[41]
మ్యూనిక్ ఓల్డ్ టౌన్ అంచున ఉన్న పెద్ద మ్యూనిక్ రెసిడెంజ్ కాంప్లెక్స్ ఇప్పుడు యూరప్‌లోని అత్యంత ముఖ్యమైన ఇంటీరియర్ డెకరేషన్ మ్యూజియంలలో ఒకటిగా నిలిచింది. రెసిడెంజ్ లోపల అద్భుతమైన కువిల్లీస్ థియేటరు, పక్కనే నేషనల్ థియేటర్ మ్యూనిక్ ఉన్నాయి. మ్యూనిక్‌లో ఇప్పటికీ ఉన్న భవనాలలో పాలైస్ పోర్సియా, పాలైస్ ప్రీసింగ్, పాలైస్ హోల్న్‌స్టెయిన్, ప్రింజ్-కార్ల్-పలైస్ ముఖ్యమైనవి. అన్ని భవనాలు రెసిడెంజ్‌కు దగ్గరలో ఉన్నాయి. అలాగే విట్టెల్స్‌బాచ్ హౌస్ మొదటి నివాసం అయిన ఆల్టర్ హాఫ్ కూడా ఉంది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]
ఒక అధ్యయనం ప్రకారం మ్యూనిక్ ఆర్థిక వ్యవస్థ ఇతర జర్మన్ నగరాలన్నిటి కన్నా బలమైనది.[42] పది లక్షల పైచిలుకు జనాభా కలిగిన జర్మన్ నగరాలలో, మ్యూనిక్ లోనే అత్యల్ప నిరుద్యోగ రేటు (2020 జూలైలో 5.4%) ఉంది.[43][44] స్థూల దేశీయోత్పత్తి (GDP) ప్రకారం జర్మన్ నగరాలలో మ్యూనిక్ మూడవ స్థానంలో ఉంది. జర్మనీలోని అత్యంత ఆకర్షణీయమైన వ్యాపార ప్రదేశాలలో ఒకటి.[42] ఈ నగరం దక్షిణ జర్మనీ ప్రాంతానికి ఆర్థిక కేంద్రం కూడా. 2002 - 2011 మధ్య 60 జర్మన్ నగరాల్లో ఆర్థిక అవకాశాలకు సంబంధించి 2005 ఫిబ్రవరిలో క్యాపిటల్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో మ్యూనిక్ అగ్రస్థానంలో నిలిచింది.
మ్యూనిక్ ఒక ఆర్థిక కేంద్రం, ప్రపంచ నగరం. ఇక్కడ అనేక కంపెనీల ప్రధాన కార్యాలయాలున్నాయి. జర్మనీ స్టాక్ మార్కెట్ ఇండెక్సైన DAX లో భాగంగా ఉన్న కంపెనీల్లో, మ్యూనిక్‌లో ఉన్నన్ని కంపెనీల ప్రధాన కార్యాలయాలు మరే జర్మను నగరం లోనూ లేవు. అలాగే మెక్‌డొనాల్డ్స్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక విదేశీ కంపెనీల జర్మనీ ప్రధాన కార్యాలయాలు లేదా ఐరోపా ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. మ్యూనిక్‌లో కొత్తగా స్థాపించబడిన అత్యంత ప్రసిద్ధ కంపెనీలలో ఒకటి ఫ్లిక్స్‌బస్.
రవాణా
[మార్చు]మ్యూనిక్ ప్రజా రవాణా వ్యవస్థలో భూగర్భ మెట్రో, ట్రామ్‌లు, బస్సులు, హై-స్పీడ్ రైలు ఉన్నాయి. 2015 లో మ్యూనిక్ మొత్తం రవాణాలో 38 శాతం ప్రజా రవాణా కాగా, మిగతా వాటిలో 25 శాతం కారు, 23 శాతం నడక, 15 శాతం సైకిల్ ఉన్నాయి.[45] ఆ సంవత్సరం ప్రజా రవాణా వ్యవస్థను 56.6 కోట్ల ప్రయాణీకులు ఉపయోగించుకున్నారు.[46]
అభివృద్ధి చెందిన ప్రాంతీయ రవాణా వ్యవస్థకు మ్యూనిక్ కేంద్రం. జర్మనీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం, బెర్లిన్-మ్యూనిక్ హై-స్పీడ్ రైల్వేలు ఇందులో భాగం. హై స్పీడ్ రైల్వే ద్వారా మ్యూనిక్ నుండి 4 గంటలలో బెర్లిన్ చేరుకోవచ్చు. ఇంటర్‌సిటీ కోచ్ సేవలను అందించే ఫ్లిక్స్‌మొబిలిటీ ప్రధాన కార్యాలయం మ్యూనిక్‌లో ఉంది.
ట్రాన్స్‌పోర్ట్ లాజిస్టిక్ అనే వాణిజ్య ప్రదర్శన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి న్యూ మెస్సే ముంచెన్ లో జరుగుతుంది.



26 లక్షల పట్టణ జనాభా కలిగిన మ్యూనిక్‌లో మ్యూనిక్ యు-బాన్, మ్యూనిక్ ఎస్-బాన్, ట్రామ్‌లు, బస్సులతో కూడిన సమగ్ర ప్రజా రవాణా నెట్‌వర్కు ఉంది. ఈ వ్యవస్థను మ్యూనిక్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ టారిఫ్ అసోసియేషన్ ( ముంచ్నర్ వెర్కెర్స్-ఉండ్ టారిఫ్‌వెర్‌బండ్ ) పర్యవేక్షిస్తుంది. మ్యూనిక్ ట్రామ్‌వే, నగరం లోని అత్యంత పురాతన ప్రజా రవాణా వ్యవస్థ. ఇది 1876 నుండి పనిచేస్తోంది. మ్యూనిక్‌లో విస్తృతమైన బస్సు రవాణా వ్యవస్థ కూడా ఉంది. పనిదినాల్లో ప్రజలు ప్రజా రవాణా ద్వారా సగటున 56 నిమిషాలు గడుపుతారు.
మ్యూనిక్ సెంట్రల్ రైలు స్టేషన్
[మార్చు]ముంచెన్ హౌప్ట్‌బాన్‌హోఫ్ అనేది నగర కేంద్రంలో ఉన్న సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది దూరప్రాంత రవాణాకు సంబంధించిన స్టేషన్.
మ్యూనిక్ సెంట్రల్ రైలు స్టేషన్ను రోజుకు దాదాపు 4,50,000 మంది ఉపయోగిస్తారు. డ్యూష్ బాన్ వారి 21 కేటగిరీ 1 స్టేషన్లలో మ్యూనిక్ సెంట్రల్ రైలు స్టేషన్, ముంచెన్ ఓస్ట్ రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి.
ఆటోబాన్స్
[మార్చు]దక్షిణ జర్మనీలోని ఆటోబాన్ రోడ్డు వ్యవస్థలో మ్యూనిక్ అంతర్భాగం. స్టట్‌గార్ట్ (పశ్చిమ), నూరెంబర్గ్, ఫ్రాంక్‌ఫర్ట్, బెర్లిన్ (ఉత్తర), డెగెన్‌డార్ఫ్, పాసౌ (ఉత్తర), సాల్జ్‌బర్గ్, ఇన్స్‌బ్రక్ (ఆగ్నేయ), గార్మిష్ పార్టెన్‌కిర్చెన్ (దక్షిణ), లిండౌ (నైరుతి) నుండి వచ్చే మోటారు మార్గాలు మ్యూనిక్ వద్ద ముగుస్తాయి. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీలోని వివిధ ప్రాంతాలకు దారులు మూనిక్ గుండానే వెళ్తాయి.
వైమానిక
[మార్చు]మ్యూనిక్ అంతర్జాతీయ విమానాశ్రయం
[మార్చు]
ఫ్రాంజ్ జోసెఫ్ స్ట్రాస్ అంతర్జాతీయ విమానాశ్రయం ( IATA : MUC, ICAO : EDDM) జర్మనీలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం. లండన్ హీత్రో, పారిస్ చార్లెస్ డి గాల్, ఫ్రాంక్‌ఫర్ట్, ఆమ్స్టర్డామ్, మాడ్రిడ్, ఇస్తాంబుల్ అటాటర్క్ తర్వాత యూరప్‌లో ఏడవ అతిపెద్ద విమానాశ్రయం. ఏటా దాదాపు 4.6 కోట్ల మంది ప్రయాణీకులు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది నగర కేంద్రానికి ఈశాన్యంగా దాదాపు 30 కి.మీ. (19 మై.) దూరంలో ఉంది. నగరం నుండి సబర్బన్ రైలు మార్గాల ద్వారా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రధాన రైల్వే స్టేషన్ నుండి ప్రయాణం 40–45 నిమిషాలు పడుతుంది. 400 km/h (249 mph) వేగంతో నడిచే అయస్కాంత లెవిటేషన్ రైలు (ట్రాన్స్‌రాపిడ్ అని పిలుస్తారు) ద్వారా సెంట్రల్ స్టేషన్ నుండి విమానాశ్రయానికి 10 నిమిషాలలో చేరుకోవచ్చు.[47] కానీ చార్జీలు భారీగా పెరగడంతో నిరసనలు ఎదురై, 2008 మార్చిలో దీన్ని రద్దు చేసారు.[48] 2003 లో ఈ విమానాశ్రయంలో రెండవ టెర్మినల్ ప్రారంభమయ్యాక, లుఫ్తాన్సా ఇక్కడ తన రెండవ హబ్‌ను ప్రారంభించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- దీర్ఘ కృపాణ రాత్రి: ప్రత్యర్థులను ఏరివేసేందుకు హిట్లరు జరిపిన ఈ మారణహోమానికి మ్యూనిక్ ప్రధాన కేంద్రం
గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Stadtverwaltung, Landeshauptstadt München. "Bevölkerung". stadt.muenchen.de (in జర్మన్). Archived from the original on 24 March 2023. Retrieved 21 March 2024.
- ↑ "The Munich Metropolitan Region" (in జర్మన్). Europäische Metropolregion München e.V. Archived from the original on 31 May 2017. Retrieved 17 April 2017.
- ↑ Englund, Peter (1993). Ofredsår. Stockholm: Atlantis.
- ↑ "Archived copy" (PDF). Archived (PDF) from the original on 29 March 2024. Retrieved 6 April 2024.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Quality of Living City Rankings". Business Insider. Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ "Munich Named The Most Livable City In The World". 25 June 2018. Archived from the original on 3 July 2018. Retrieved 2 July 2018.
- ↑ Wille, Robin (15 July 2021). "Immobilien: Das sind die 10 teuersten Städte in Deutschland". Business Insider (in జర్మన్). Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
- ↑ "Die 10 teuersten Städte Deutschlands 2020". www.haus.de (in జర్మన్). Archived from the original on 18 April 2022. Retrieved 16 April 2022.
- ↑ "Bevölkerung am 31.12.2023 nach Migrationshintergrund in den Stadtbezirken" [Population on 31.12.2023 by migration background in the city districts] (PDF). Statistisches Amt München. December 31, 2024. Archived (PDF) from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
- ↑ "Munich Travel Tourism Munich". muenchen.de. Archived from the original on 14 February 2016. Retrieved 12 February 2016.
- ↑ Alain Verbeke (2014). International Business Strategy. Vahlen. p. 02. ISBN 9783800648702.
- ↑ Alain Verbeke (2013). International Business Strategy. Cambridge University Press. p. 237. ISBN 9781107355279.
- ↑ "From the Murder of Eisner to the "Räterepublik Baiern" (Soviet Republic of Bavaria) | bavarikon". www.bavarikon.de (in ఇంగ్లీష్). Archived from the original on 8 April 2024. Retrieved 20 January 2024.
- ↑ 14.0 14.1 Jeremy White; Swati Chattopadhyay (2010). City Halls and Civic Materialism. Taylor & Francis. p. 85. ISBN 9781317802280.
- ↑ Michael Brenner (2022). In Hitler's Munich: Jews, the Revolution, and the Rise of Nazism. Princeton University Press. pp. 3. ISBN 9780691191034.
- ↑ Robert C. Reimer; Carol J. Reimer (2010). The A to Z of German Cinema. Scarecrow Press. p. 51. ISBN 9781461731863.
- ↑ Michael Brenner (2022). In Hitler's Munich: Jews, the Revolution, and the Rise of Nazism. Princeton University Press. pp. 23. ISBN 9780691191034.
- ↑ Magazine, Smithsonian; Wexler, Ellen. "Before He Rose to Power, Adolf Hitler Staged a Coup and Went to Prison". Smithsonian Magazine (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.
- ↑ "NS-Wiege: "Hauptstadt der Bewegung"". Bayerischer Rundfunk. 26 November 2007. Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ David Ian Hall (2021). Hitler's Munich: The Capital of the Nazi Movement. Pen & Sword Books Limited. p. 176. ISBN 9781526704955.
- ↑ David Ian Hall (2021). Hitler's Munich: The Capital of the Nazi Movement. Pen & Sword Books Limited. p. 178. ISBN 9781526704955.
- ↑ David Ian Hall (2021). Hitler's Munich: The Capital of the Nazi Movement. Pen & Sword Books Limited. p. 177. ISBN 9781526704955.
- ↑ Adrienne Steffen; Susanne Doppler, eds. (2020). Case Studies on Food Experiences in Marketing, Retail, and Events. Elsevier Science. p. 137. ISBN 9780128177938.
- ↑ "Online archive of the old Munich-Riem Airport". Flughafen München (in ఇంగ్లీష్). 20 December 2018. Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.
- ↑ Alan E. Steinweis; Susanna Schrafstetter (2015). The Germans and the Holocaust. Berghahn Books. p. 113. ISBN 9781782389538.
- ↑ "Munich, Germany Köppen Climate Classification (Weatherbase)". Weatherbase. Archived from the original on 7 February 2019. Retrieved 5 February 2019.
- ↑ Jordan-Bychkov, Terry G.; Jordan, Bella Bychkova; Murphy, Alexander B. (28 August 2008). The European Culture Area: A Systematic Geography (in ఇంగ్లీష్). Rowman & Littlefield Publishers. ISBN 978-0-7425-7906-4. Archived from the original on 7 November 2021. Retrieved 18 November 2020.
- ↑ "Munich — Climate-ADAPT". 19 March 2018. Archived from the original on 19 March 2018. Retrieved 5 February 2019.
- ↑ "Extremwertetafel (München-Riem)". SKlima.de. Retrieved 12 February 2019.
- ↑ "Extremwertetafel (München-Botanischer Garten)". SKlima.de. Retrieved 12 February 2019.
- ↑ "World Meteorological Organization Climate Normals for 1991–2020". World Meteorological Organization Climatological Standard Normals (1991–2020). National Oceanic and Atmospheric Administration. Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.
- ↑ "CDC (Climate Data Center)". DWD. Archived from the original on 14 January 2017. Retrieved 2 May 2016.
- ↑ "Monatsauswertung". sklima.de (in జర్మన్). SKlima. Archived from the original on 7 June 2016. Retrieved 2 May 2016. |date=May 2016
- ↑ "Climatologie de l'année à Nuernberg" (in ఫ్రెంచ్). Infoclimat. Archived from the original on 29 October 2023. Retrieved 14 October 2023.
- ↑ "Die ausländische Bevölkerung nach der Staatsangehörigkeit 2023" (PDF). Archived (PDF) from the original on 19 June 2018. Retrieved 19 June 2018.
- ↑ "Kroaten in München – Die zweite Hauptstadt". sueddeutsche.de (in జర్మన్). 17 May 2010. Archived from the original on 24 July 2023. Retrieved 24 July 2023.
- ↑ Zen, Jessica (November 19, 2020). "A quick guide to Nymphenburg Palace in Munich". Stripes Europe. Archived from the original on 19 March 2024. Retrieved March 19, 2024.
- ↑ "Schloss Nymphenburg". Lonely Planet. January 10, 2010. Archived from the original on 19 March 2024. Retrieved March 19, 2024.
- ↑ "Schloss Fürstenried". muenchen.de (in జర్మన్). September 28, 2022. Archived from the original on 19 March 2024. Retrieved March 19, 2024.
- ↑ Hordych, Barbara (March 17, 2024). "Wiedereröffnung der Kinderbibliothek in der Blutenburg". Süddeutsche.de (in జర్మన్). Archived from the original on 19 March 2024. Retrieved March 19, 2024.
- ↑ "Blutenburg Castle: idyllic castle in Munich's Northwest". muenchen.de. October 19, 2022. Archived from the original on 19 March 2024. Retrieved March 19, 2024.
- ↑ 42.0 42.1 "Study conducted by INSM (New Social Market Economy Initiative) and WirtschaftsWoche magazine". Icm-muenchen.de. Archived from the original on 19 June 2012. Retrieved 25 July 2012.
- ↑ "Statistik der BA". statistik.arbeitsagentur.de. Archived from the original on 28 February 2014. Retrieved 11 August 2020.
- ↑ Artikel empfehlen (27 September 2010). "Endlich amtlich: Köln ist Millionenstadt". Koeln.de. Archived from the original on 1 October 2011. Retrieved 15 September 2011.
- ↑ "Munich Transport Corporation (MVG) Sustainability Report 2014/2015" (PDF). www.mvg.de. Archived (PDF) from the original on 10 January 2019. Retrieved 10 January 2019.
- ↑ "Urban mobility 2030: How cities can realize the economic effects". McKinsey & Company. 2 March 2016. Archived from the original on 30 July 2021. Retrieved 29 February 2024.
- ↑ "Germany to build maglev railway". BBC News. 25 September 2007. Archived from the original on 16 February 2008. Retrieved 7 April 2008.
- ↑ "Germany Scraps Transrapid Rail Plans". Deutsche Welle. 27 March 2008. Archived from the original on 28 March 2008. Retrieved 27 March 2008.