Jump to content

మోహినీ రుక్మాంగద (నాటకం)

వికీపీడియా నుండి

ధర్మవరము రామకృష్ణమాచార్యులు (1853 - 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. వాటిలో ప్రఖ్యాతి పొందినదీ నాటకం. ఇది డి.కె.కృష్ణమాచార్లు వారి సోదరుల వలన ప్రకటించబడినది. దీని రెండవ కూర్పు 1931 సంవత్సరంలో బళ్ళారిలో ముద్రింబడినది.

కథా సంగ్రహం

[మార్చు]

ప్రథమాంకము

[మార్చు]
  • రంగం 1 : అజామిళుని చరిత్రము నారదుని వలన విని రుక్మాంగదుడు ఏకాదశీ వ్రతము పట్టుట.
  • రంగం 2 : ఏకాదశీ వ్రతమును గురించిన ముఖ్య ప్రకటన.
  • రంగం 3 : పిచ్ఛిల వలాహకులను నిరువును సత్రధర్మకర్తలు పంచాపకేశ శాస్త్రియను మధుర వైపుననుండి వచ్చిన యధికారిచే బలవంతపు ఏకాదశి చేయించుట.

ద్వితీయాంకము

[మార్చు]
  • రంగం 1 : యముడు విరామముగా వైద్యనాథుడను గంధర్వునితో చదరంగమాడుట. వారి సంభాషణము.
  • రంగం 2 : నందనవనములో రంభాదులయిన యప్సరసల సంగీత వినోదము. ఆ సందర్భమున నైన విఘ్నములు.
  • రంగం 3 : యమ బ్రహ్మల సంవాదము. విష్ణు సేనానియగు విష్వక్సేనుడు వచ్చి వైకుంఠమును వృద్ధిచేయుమని చెప్పుట. అప్సరసల మొర.

తృతీయాంకము

[మార్చు]
  • రంగం 1 : రుక్మాంగదుని భార్య సంధ్యావళి గర్భముతో నుండుట. ఇష్టకామేశ ప్రభావమున నాయమ జాడ్యము నివర్తించియుండినందున శివస్తుతి.
  • రంగం 2 : అప్సరసల నిర్ధారణము.
  • రంగం 3 : రుక్మాంగదు హరికథా కాలక్షేపము. మోహిని యకృత్రిమ మోహము.

చతుర్థాంకము

[మార్చు]
  • రంగం 1 : వింధ్యపర్వతములో నిష్టకామేశాలయము. మోహిని గానము రుక్మాంగదు మోహము. శివలింగము నుభయులు స్తుతించుట.
  • రంగం 2 : రుక్మాంగదు భార్యల యాలోచన. వారి నిర్ధారణము. మోహినీ సంధ్యావళుల స్నేహము.

పంచమాంకము

[మార్చు]
  • రంగం 1 : రంభాదుల యాగ్రహము. మోహిని పశ్చాత్తాపము.
  • రంగం 2 : రుక్మాంగదు నేకాదశీ నియమువలని దుఃఖము. మోహినీ కౄరకృత్యము. ధర్మాంగదుని మనోదార్ఢ్యము. శ్రీవిష్ణు నాగమనము. స్తపము.

సినిమాలు

[మార్చు]

ఈ నాటకం ఆధారంగా రెండు తెలుగు సినిమాలు నిర్మించబడ్డాయి.

మూలాలు

[మార్చు]